చిరంజీవి హీరొయిన్ ఇప్పుడు కొన్ని వేల కోట్లకి వారసురాలు

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. అందులో పనిచేసే వారి జీవితాలు కూడా అలానే ఎవరు బ్లాక్ & వైట్ లో ఉంటారో అలాగే ఎవరు ఇంధ్రధనస్సులా ఉంటారో ఎవరిజీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఊహించలేము .కొందరు ఉహిచనంత ఎత్తుకు ఆర్ధికంగా ఎదుగుతారు అలాగే మరికొందరు అంతా పోగొట్టుకొని రోడ్డున పడతారు. అలాంటి ఒక స్టార్ హీరొయిన్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె ఎవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధవి. ఈమె తెలుఁగు కన్నడ తమిళ ఇలా ఎన్నొ భాషలలో నటించి చాల గొప్ప పేరు తెచ్చుకున్నారు. 1962 వ సంవత్సరంలో శశిరేఖా గోవిందరాజు దంపతులకు హైదరాబాద్ లో జన్మించింది. 8 ఏళ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకొని వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. అబిడ్స్ లోని స్టామిన్ స్కూలు లో ఎనమిదవ తరగతి చదువుతుండగా ఒకసారి దర్శకరత్న దాసరి నారాయణరావు గారి కంట పండింది.

అయితే దాసరిగారు తూర్పు పడమర అనే సినిమాలో మాధవికి అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఆమె తిరుగులేని హీరొయిన్ గా చాలా పెద్దపేరు తెచ్చుకుంది చిరంజీవి మాదవి పెయిర్ అప్పటిలో ఒక హిట్ పెయిర్ గ గుర్తింపు తెచ్చుకుంది వీరిద్దరి కాంబినేషన్ లో అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ లతో కాసుల వర్షం కురిపించాయి. అలాగే మాదవి గారు నటించిన మాతృదేవోభవ సినిమా చూసి ఏడవకుండా థియేటర్ నుండి బయటకు వచ్చిన వారు లేరు.అయితే ఇప్పుడు ఈమె కొన్నివేల కోట్లకు అధిపతి. ఈమె కెరియర్ పీక్ లో ఉండగానే రాజుశర్మ అనే పెద్ద ఫార్మా కంపని ఓనర్ ను అరెంజ్ మ్యారేజ్ చేసుకుని అమెరికా లో సెటిల్ అయింది. ఈమె భర్తకు బిజినెస్ లో పాల్గొంటూ ఎంతో హాయిగ జీవితం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు వీరుకూడా బిజినెస్ వ్యవహారాలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మాదవి ఆస్తి దాదాపు వేలకోట్లను దాటిపోయిందనే చెప్పాలి.