బేబీ షామిలి ఈ పేరు వినగానే మనకి అంజలి సినిమా గుర్తుకి వస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా షామిలి కి మంచి పేరు సంపాందించింది. 1989 లో రాజండాయ్ సినిమా తో తమిల్ లొచైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయిన షామిలి 1990 లో మణిరత్నం మూవీ అంజలి సినిమాలో మెంటల్లీ చాలేంజ్డ్ పాత్రని చాలా అవలీలగా చేసింది. ఆ సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ స్టార్ క్రేజ్ వచ్చింది. ఆ సినిమా కి గాను నెషనల్ అవార్డ్ తో పాటు బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా అవార్ద్ వచ్చింది.

దాదాపు 42 సినిమాలకి పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన షామిలి ఇప్పటి వరకు వచ్చిన ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లకు వీలు కాని ఎన్నో పాత్రలు మరియు సినిమాలతో స్టార్స్ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకునేది.

ఇక తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు హీరో లకు దీటుగా భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ అమ్ముడు హీరోయిన్ గా అయ్యాక మాత్రం ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది..

షామిలి హీరోయిన్ గా మొదటి సినిమ సిద్దార్థ్ తో కలిసి ఓయ్ లో నటించింది. తన లుక్స్ కి బాగా నెగటివ్ కామెంట్స్ రావడం తో సినిమా బాగానే ఉన్నా మళ్ళీ తెలుగు లో ఆఫర్స్ రాలేదు. దీనితో సినిమాల్లో కొంత గాప్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ధనుష్ కోడి సినిమా తో సెకండ్ హీరోయిన్ గా రి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించిన షూటింగ్ కి టైమ్ కి రాకపోవటం, దీనికి తోడు తన డిమాండ్స్ తో నిర్మాతలు ని ఇబ్బందిపెట్టెదట.

ఇలా గొంతెమ్మ కోరికలతో దనుష్ లాంటి క్రేజీ స్టార్ పక్కన ఆఫర్ చేజేతులా పోగొట్టుకుంది. షామిలి ఈ విధంగా బిహేవ్ చేయటం ఇదేం మొదటి సారి కాదట. ఒయీ తర్వత హీరోయిన గా చేసిన “వల్లియుం తెట్టి పుల్లియుం తెట్టి” అనే మలయాళం మూవీ కి కూడా షూటింగ్ కి టైం కి రాకుండా ఇబ్బందిపెట్టెదట. పూర్తి సినిమ నేపద్యం లో పెరిగిన షామిలి అక్క షాలిని సోదరుడు రిషి కూడ అర్టిస్టులే. షామిలి అక్క షాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా మరియు హేరోయిన్ మంచి సినిమాలు చేసి ఆ తర్వాత తమిల్ హీరో అజిత్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిల్ అయ్యింది. అక్క బావలు అయిన హీరో అజిత్ మరియు షాలిని కూడా తన కెరీర్ ని సపోర్ట్ చేసిన వరుస ఫెయిల్యూర్స్ తనని వెంటాడాయి అని చెప్పాలి. ఆమె బిహేవియర్ కూడా ఇందుకు ఒక కారణం….

చైల్డ్ ఆర్టిస్ట్ గా అత్యున్నత షికరాలను చూసిన షామిలి హీరోయిన్ గా మాత్రం పాపులర్ కాలేక పోయింది. ఓయ్ . తర్వాత గాప్ తీసుకొని మేకోవర్ అయినప్పటికీ మంచి సినిమాల్లో అవకాశాల్ని తన బిహేవియర్ వల్ల లాస్ అయ్యింది అనే చెప్పాలి.

సినిమా ఇండస్ట్రీలో ఎంత సపోర్ట్ ఉన్న మన బిహేవియర్ కూడా లెక్కల్లో వస్తుంది. సినిమాల్లో సక్సెస్, ఫెయిల్యూర్స్ ఈ రెండు కామన్. గ్లామరస్ రోల్స్ లో కనిపించకపోవడం కూడా ఈ అమ్మడికి మైనస్ అనే చెప్పాలి. చెన్నైలో స్థిరపడ్డ షామిలి తమిళ్ సినిమాల్లో ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తుంది.

ఇక తెలుగు లో షామిలి కి ఆఫర్స్ ఇచ్చే వాళ్లు కరువయి దాదపు కరీర్ క్లోజ్ అయ్యె దిష గా నడుస్థుంది. ఇదండి మన క్యుట్ గార్ల్ బేబీ షామిలి ఫ్లాప్ కెరీర్ పైన ఎక్స్లుజివ్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చితే ఓ లైక్‌ కొట్టండి… మీ ఫ్రెండ్స్‌కు షేర్‌ చేయండి. మీ సజెషన్స్‌ ఏమైనా ఉంటే కింద కామెంట్‌ చేయండి. మరోమాట ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగుడెస్క్ పేజీ ని మాత్రం లైక్ చేయడం మాత్రం మరవకండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here