టాప్ హీరో చేయూత ఇచ్చిన దారుణమైన స్థితిలో మరణించిన బాలక్రిష్ణ మొదటి సినిమా హీరోయిన్

బాలకృష్ణ మొదటి హీరోయిన్ ఆత్మహత్యచేసుకుందని మీకు తెలుసా….?
విజ్జి…. ఎయిటీస్ లో ఆమె కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక చక్కటి నటి. అందం, అభినయం రెండూ కలగలిసిన ఆమె 1982 లో గంగై అమరన్ చిత్రం కోళి కూవుదు సినిమాతో తమిళ్ చిత్ర రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో , ఆమెకు తమిళ్ లో ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చిపడ్డాయి. ఆమె సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఆమె తనకెరీర్ ను ప్లాన్డ్ గా కొనసాగించింది. అప్పటి తమిళ్ ఇండస్ట్రీలోని అందరి ప్రముఖ హీరోల సినిమాల్లోనూ ఆమెకు ఆఫర్స్ వచ్చిపడ్డాయి. ముఖ్యంగా విజయ్ కాంత్ నటించిన సినిమాల్లో ఆమెకు తరచుగా ఆఫర్స్ వస్తూండేవి. విజయకాంత్ తో ఆమెకున్న మంచి పరిచయం కారణంగానే దర్శకులు ఆమెను తీసుకునేవారు. ఆ టైమ్ లోనే బాలకృష్ణ హీరోగా నటించిన మొదటి చిత్రం సాహసమే జీవితం సినిమాలో ఆమెను హీరోయన్ గా సెలెక్ట్ చేసారు. ఆ సినిమాకి పి.వాసు, మహానది, గుణ సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంతాన భారతి కలిసి భారతి వాసు పేరుతో ఆ సినిమాను డైరెక్ట్ చేసారు. ఇదిలా ఉంటే, విజ్జీ సినీ జీవితం ఎలా ఉన్నా, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో సాగేది. ఆమె అప్పట్లో తమిళ్ దర్శకుడు ఎ.ఆర్ .రమేష్ ను గాఢంగా ప్రేమించింది. అతడికి పెళ్ళైనా సరే అతడి తో ఎఫైర్ కంటిన్యూ చేస్తూండేది. అతడ్ని తరుచుగా తనను పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేసేది. కానీ అతడు జవాబు చెప్పకుండా తప్పించుకొనేవాడు.
అయితే ఆమెను దురదృష్టం మరో కోణంలో వెంటాడింది. 1996లో పూవే ఉనక్కాగ అనే సినిమా షూటింగ్ లో ఉండగా, ఆమెకు బ్యాక్ పెయిన్ ఎటాక్ అయింది. అది సివియర్ గా మారడంతో , ఆమె వెన్నుపూసకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, చెన్నై అపోలో హాస్పటిల్ లో ఆమెకు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది. లోపల ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిందని డాక్టర్లు చెప్పారు. మరి కొన్ని సర్జరీలు చేయడంతో ఆమెకు తాత్కాలిక పక్షవాతం వచ్చింది. దాంతో అపోలో హాస్పటల్ మీద ఆమె కేసు ఫైల్ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కలగచేసుకోవడంతో ఆమెకు అపోలో వాళ్లు ముప్పై వేలు నష్ట పరిహారంగా చెల్లించారు. ఆ తర్వాత చేసిన మరో సర్జరీతో ఆమె వెన్నునెప్పి తగ్గిపోయింది. దీని ఫలితంగా ఆమెకు ఛాన్సులు కరువయిపోయాయి. విజయకాంత్ వల్ల ఒకటో రెండో సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. ఆమె హస్పటిల్ లో ఉన్న సమయంలో విజ్జి ప్రేమించిన దర్శకుడు ఎ.ఆర్ .రమేష్ వచ్చిపోతుండేవాడు. అప్పడు అతడ్ని విజ్జి తన పెళ్లిగురించి మరింత వత్తిడి చేసింది. తనుకు పెళ్లైందని , నీతో ఎఫైర్ మాత్రమే కొనసాగిస్తానని , విజ్జి మధ్యవర్తులతో ఖరాఖండిగా చెప్పేసాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన విజ్జి, 2000 సంవత్సరంలో చెన్నై మహాలింగపురంలో ఉన్న తన అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు ఉరిపోసుకొని ఆత్మహత్యచేసుకుంది. చనిపోయే ముందు రమేష్ తో తను మాట్లాడిన టెలిఫోన్ సంభాషణను రికార్డు చేసి , తన చావుకు అతడే కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. ఆ తర్వాత దర్శకుడు రమేష్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. అలా… కేవలం 34 ఏళ్ల ప్రాయంలోనే తను ప్రేమించిన వాడికోసం అసువులు బాసింది ఆ అందాల హీరోయిన్.