ప్రాణం పోయాల్సిన డాక్టర్లే అమాయకుల ప్రాణాలను దారుణంగా పొట్టన పెట్టుకున్న సంఘటనలు ఎక్కడ చూసినా కోకొల్లలు… ఒకరికి చేయవలసిన ఆపరేషన్లు మరొకరికి చేయడం,డాక్టర్లే నిర్లక్ష్యం తో వస్తువులను శరీరం లోపల వేసి కుట్లు వేయడం …పసికందుల ప్రాణాలతో ఆటలాడుకోవడం ఇలా నిత్యం ఎదో ఒక ఘటనతో వార్తల్లో నిలుస్తునే ఉన్నారు… కాని మొదటి సారిగా ఈ సీన్ రివర్స్ అయ్యింది… డాక్టర్లు ఈ సారి నిర్లక్ష్యం రోగిపై కాకుండా డాక్టరు ఏకంగా మరో డాక్టర్ పై నిర్లక్ష్యం వహించింది…ఇక ఘటన పూర్తి వివరాలలోకి వెళితే….
నిహారిక (27) హోమియోపతిలో కోర్సు ముగించుకుని మూడు నెలల కిందటే వివేకానంద ఆసుపత్రిలో డాక్టర్ గా ఉద్యోగంలో చేరారు. ఆమెకు మొదటి నుండి సైనస్ సమస్య ఉండటంతో అదే ఆసుపత్రిలో ఈఎన్‌టీ వైద్యులు రామకృష్ణను సంప్రదించారు. మత్తు వైద్యుడు (అనస్థీయిన్) డా. జగదీష్‌తో కలిసి సెప్టెంబరు 16న ఆమెకు శస్త్రచికిత్స చేశారు.
నిహారిక పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో మరుసటి రోజు వివేకానంద ఆసుపత్రి డాక్టర్లు కేర్ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. సైనస్ శస్త్రచికిత్స చేసిన వివేకానంద ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిహారిక మెదడు దెబ్బతిన్నదని తెలిపారు. మత్తు అధిక మోతాదులో ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోందని తెలిపారు..