ఆంధ్రప్రదేశ్ గణతంత్ర వేడుకలు తొలుత విశాఖపట్నంలో నిర్వచాలని భావించారు సీఎం జగన్. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్, నేడు అనూహ్యంగా తమ నిర్ణయాన్ని మార్చుకుంది. గణతంత్ర వేడుకలకు విశాఖ మున్సిపల్ స్టేడియం సిద్ధం చేయాలనీ, తగిన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని అధికారులకు ఇదివరకే ఆదేశాలు ఇచ్చారు. అయితే విశాఖలో వేడుకలు నిర్వహించాలని భావించినప్పటికీ ఆ తర్వాత విశాఖ నుంచి విజయవాడకు మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.

బీచ్ రోడ్డులో సన్నాహక పెరేడ్ లో ఉన్న దళాలను వెనక్కి రావాలంటూ అధికారులు ఆదేశించారు. ఆలా ఏపీ గణతంత్ర వేడుకల వేదిక విశాఖ నుంచి విజయవాడకి మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here