‘‘నేను పిచ్చోడిని కాదు.. ఇస్మార్ట్ శంకర్ నన్ను పిచ్చోడిని చేసింది” అంటూ బీరుతో వర్మ రచ్చ చేసిన వర్మ!!

0
659

చాలా సంవత్సరాలుగా హిట్ ఎదురు చూస్తున్న డైరెక్టర్.. హిట్లు వున్నా, భారీ హిట్ కోసం తపిస్తున్న హీరో.. ఇద్దరూ కలిసి సినిమా తీస్తే ఏమవుతుంది ? అది కూడా పక్కా మాస్ వసాలా అయితే.. ‘ఇస్మార్ట్ శంకర్’ అవుతుంది. పూరీ జగన్నాథ్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కొంత మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ మాస్ ఎంటర్టైనర్ బీసీ సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీంతో అటు పూరీ అభిమానులు, ఇటు రామ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను రాబట్టడంలో ఈ సినిమా కొంత సక్సెస్ కాలేదన్న టాక్ వినిపిస్తోంది.

అదలావుంటే.. ఈ సినిమా పై కాంట్రవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. విడుదలకి ముందు నుంచి తరచూ ట్వీట్లు చేస్తున్నారు. ‘‘హేయ్ ఛార్మీ కౌర్.. మీ సినిమా టీమ్‌తో కలిసి పార్టీ చేసుకోడానికి వస్తున్నాను” అని మొన్న ఒక ట్వీట్ చేశాడు. ఇందులో భాగంగానే శనివారం ఆయన సినిమా చూడడానికి వెళ్లారు. సినిమా చూడడానికి వస్తున్నా అని చెప్పగానే చిత్ర యూనిట్ కూడా అక్కడకు చేరుకుంది. ఈ క్రమంలోనే అక్కడ చిత్ర యూనిట్‌తో వర్మ పార్టీ చేసుకున్నారు.

ఈ సందర్భంలో భాగంగా వర్మ బీరు బాటిల్‌తో రచ్చ రచ్చ చేశాడు. బీరును పొంగించి, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, హీరోయిన్స్ నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ సహా చిత్ర యూనిట్‌పై పోశారు. అంతేకాదు, చివర్లో తాను కూడా మిగిలిన బీర్ మొత్తానికి పోసుకున్నాడు. దీనికి సంబంధించిన పలు వీడియోలను ట్వీట్ చేస్తూ.. ‘‘నేను పిచ్చోడిని కాదు.. ఇస్మార్ట్ శంకర్ నన్ను పిచ్చోడిని చేసింది. కాబట్టి మీరు పూరీని, ఛార్మీనే నిందించాలి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here