శ్రుతిహాసన్ సెకలకి చిరాకొచ్చి చీటింగ్ కేస్ పెట్టాడు
హీరోయిన్లన్నాక గొంతెమ్మ కోర్కెలు కోరడం, ఆ కోరికలు తీర్చకుంటే కొండెక్కి కూర్చోడం కామనే. ఒక్కోసారి ఆ కోరిక చిట్టా తీర్చడం ప్రొడ్యూసర్ వల్ల మాత్రమే కాదు ఆ దేవుడి తరం కూడా కాదు. అలా ఒకసారి మన హాట్ బ్యూటీ శ్రుతిహాసన్ కోరిన ఒక వింత కోరిక పాపం పివిపి మెడకు చుట్టుకుంది. నాగార్జున కథానాయకుడిగా పివిపి “ఊపిరి” అనే సినిమా తీయడం అందులో కార్తీ, తమన్నా జంటగా నటించడం.. సినిమా విడుదలై ఘన విజయం దక్కించుకోవడం వంటి విషయాలన్నీ తెలిసినవే. అయితే.. ఆ సినిమాలో మొదట హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను కథానాయకుడిగా ఎంపిక చేశారని, ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యాక రెండో షెడ్యూల్ జరుగుతున్న సమయంలో శ్రుతిహాసన్ అప్పటికప్పుడు హలీం కావాలి అని అడిగిందట. హలీం అనేది పెద్ద కాస్ట్లీ ఐటెమ్ కాకపోయినా.. ఆ హలీంను శ్రుతి హాసన్ ఓల్డ్ సిటీ నుండి తెప్పించమని అడిగిందట. జూబ్లీ హిల్స్ నుంచి చార్మినార్ వెళ్ళిరావడానికి కనీసం గంటన్నర టైమ్ పడుతుంది. లేట్ గా హలీం పట్టుకొచ్చాడన్న కోపంతో.. ఆ హలీంను తెచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ మొహానికేసి కొట్టి.. సెట్ లో నుంచి ప్రొడక్షన్ టీంకి చెప్పకుండా వెళ్ళిపోయి.. వేరే సినిమా డేట్స్ క్లాష్ అవుతున్న కారణంగా ప్రొజెక్ట్ నుంచి తప్పుకొంటున్నాను అంటూ సింపుల్ గా ఒక ఈమెయిల్ పెట్టి సైడ్ అయిపోయింది.
అప్పట్లో వేరే ఆప్షన్ లేకపోవడం, షూటింగ్ ఎక్కువ రోజులు ఆపడం వల్ల సినిమాకి ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అప్పటికప్పుడు తమన్నాను తీసుకొన్నారు.
అయితే.. అప్పట్లో టైమ్ లేక వదిలేసిన పివిపి అండ్ టీం ఇప్పుడు శ్రుతిపై కసి తీర్చుకొనే పనిలో ఉన్నారు. అప్పుడు ఆమె లీగల్ గా సైన్ చేసిన డాక్యుమెంట్ ను బేస్ చేసుకొని.. ఆ అగ్రిమెంట్ లో ఉన్న లూప్ హోల్స్ తో ఇప్పుడు ఆమెపై క్రిమినస్ కేస్ పెట్టారు. ఆ కేస్ కారణంగా శ్రుతిహాసన్ లీగల్ ప్రోబ్లమ్స్ తోపాటు ఫ్యూచర్ ప్రొజెక్స్ట్ విషయంలోనూ బోలెడన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే.. రీసెంట్ గా “సంఘమిత్ర” అనే ప్రొజెక్ట్ నుంచి కూడా శ్రుతిహాసన్ సడన్ గా తప్పుకొంది. ఇప్పుడు పివిపిని చూసి.. “సంఘమిత్ర” నిర్మాతలు కూడా శ్రుతిహాసన్ పై డిఫేమేషన్ కేస్ వేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
Home Movie News పొగరుబోతు తనం ప్రదర్శించి పరువు పోగోట్టుకొని చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి