ప్రదీప్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా లో నాగార్జున చేసిన కామెడీ చూస్తే నవ్వాపుకోలేరు(వీడియో )

నాగార్జున ప్రస్తుతం ‘రాజుగారి గది 2’ సినిమాతో బిజీగా వున్నారు. 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సమంత, సీరత్ కపూర్ హీరోయిన్స్. ఓంకార్ దర్శకుడు. ‘రాజుగారి గది మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ లో ఓ మలయాళం సినిమా రిమేక్ రైట్స్ ను కొనుక్కుని దానికి చాలా మార్పులు చేసి ‘రాజుగారి గది 2’ తీశారు. నాగార్జున మొదటిసారిగా నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ఇది.

ఇక ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా బుల్లి తెర మీద ప్రత్యక్షమయ్యాడు నాగ్. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా పేరిట జీతెలుగులో ప్రసారమయ్యే షోలో సెలబ్రెటీలను ఒక ఆట అడ్డుకుంటాడు యాంకర్ ప్రదీప్ . చైతు సమంతల పెళ్ళికి కొద్ది రోజుల ముందు జరిగిన ఈ కార్యక్రంలో ఎన్నో విషయాలను సరదాగా మాట్లాడాడు నాగార్జున. అయితే చైతు సమంతల ప్రేమ వ్యవహారం తనకు ముందుగా ఏమాత్రం తెలీదని అని చెబుతున్నాడు ఈ అక్కినేని అందగాడు. మనం షూటింగ్ టైంలో సమంత సెట్స్ లో వూరికే చైతు టాపిక్ తెస్తూ ఉండేదని, కానీ అప్పుడు తనకు అర్థం అయ్యేది కాదని, మనది మట్టి బుర్ర కదా అని కామెడీ చేశారు నాగ్.

ఇక ఈ ఎపిసోడ్ ట్రైలర్ చుసిన నాగ్ ఫాన్స్.. టాపిక్ ని డైరెక్ట్ గా చెప్పకుండా, ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తూ, మా నాగ్ ని సమంత మోసం చేసింది అని సోషల్ మీడియా లో సరదాగా కామెడీ ట్రోల్స్ ఇస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. టీవీ షోలల్లో పెద్దగా దాచుకోకుండా మాట్లాడే నాగ్ ఇలాంటి షోస్ కి రావడం అరుదనే చెప్పుకోవాలి. ట్రైలర్ తోనే మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయినా నాగార్జున తో పాటుగా అభిమానులు ఈ ఫుల్ ఎపిసోడ్ కోసం అక్కినేని ఫాన్స్ తెగ ఎదురుచూస్తూ వున్నారు. ప్రదీప్ ప్రశ్నలకు నాగ్ సమాధానాలను ఎంత ఫన్నీగా ఉన్నాయో ఆ ట్రయిలర్ వీడియోను కింద క్లిక్ చేసి చూడండి..