ప్రాణం పోయాల్సిన డాక్టర్లు.. ఓ చిన్నారి ప్రాణం తీశారు.

ప్రాణం పోయాల్సిన డాక్టర్లు.. ఓ చిన్నారి ప్రాణం తీశారు. ఎక్కడ ఎలా ఉండాలో కూడా డాక్టర్లు మనం చెప్పాలా.. వాళ్లకు ఆ జ్ణానం లేదా. పోయిన ఆ చిన్నారి ప్రాణాన్ని తీసుకు రాగలరా.. idantaa రాజస్థాన్ జోధ్ పూర్ లోని ఉమైద్ ఆస్పత్రిలో జరిగింది.

నిండు గర్భిణికి ఆపరేషన్ చేస్తున్న టైంలో ఆపరేషన్ థియేటర్ లోనే ఇద్దరు డాక్టర్లకు మధ్య వివాదం తలెత్తింది.మాటా మాటా పెరిగి ఆపరేషన్ ను మధ్యలోనే ఆపేశారు వైద్యులు. ధియేటర్ లోనే ఘర్షణకు దిగారు..ఒకరినొకరు తిట్టుకున్నారు.ఆపరేషన్ మధ్యలోనే నిలిచిపోవడంతో.. ఈ లోకాన్ని చూడకుండానే పసిగుడ్డు ప్రాణాలు వదిలింది.ఈ తతంగాన్ని అంతా వీడియో తీసిన సిబ్బంది నెట్ లో పెట్టారు..డాక్టర్ల గొడవ వీడియో వైరల్ కావటంతో చర్యలకు ఆదేశించింది రాజస్థాన్ ప్రభుత్వం.