ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయినట్లుంది…పలువురు క్షణికావేశాలతో తమ వారికి ఫోన్ చేసి మరీ లైవ్ లో సూసైడ్ చేసుకుంటున్నారు..తాము ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో పేర్కొంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఐటీఐ విద్యార్థి లైవ్ లో సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపింది. ఈ ఘటన మల్కాజ్ గిరిలో చోటు చేసుకుంది.
సాగర్ అనే ఐటీఐ విద్యార్థి మల్కాజ్ గిరిలోని తన సోదరి ఇంట్లో ఉంటూ ఐటీఐ చదువుకుంటున్నాడు. జ్యోతి అనే యువతితో పరిచయం ఏర్పడింది..ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారిపోయింది. కానీ వీరిద్దరూ మైనర్లు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లిని నిరాకరించారు. దీనితో సాగర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ప్రియురాలికి ఫోన్ చేసి తాను తీవ్ర మనస్థాపానికి గురయినట్లు..తాను చనిపోతున్నట్లు లైవ్ లో చెబుతూ ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ దృశ్యాలు చూసిన ప్రియురాలు వారించినా అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
Home General News ప్రేమకు నో అన్నదని ప్రేయసికి వీడియో కాల్ చేసి లైవ్ లో సుసైడ్ చేసుకున్న ప్రియుడి...