బిగ్ బాస్ షో నుంచి నన్ను బయటకు పంపండి అంటూ కన్నిలు పెట్టుకున్న ధనరాజ్ అసలు ఏమైందంటే…!

బిగ్ బాస్ షో నుంచి నన్ను బయటకు పంపండి అంటూ కన్నిలు పెట్టుకున్న ధనరాజ్ అసలు ఏమైందంటే…!

సెకెండ్ ఎలిమినేష‌న్ కు ముందే సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షో నుండి డోర్లు తెరుచుకొని వెళ్ళిపోయారు.! నాలుగు గోడ‌ల మ‌ద్య ఉండ‌లేనంటూ…ముందు నుండి బిగ్ బాస్ కు చెబుతున్న సంపూ…త‌డిని క‌న్ఫెష‌న్ రూమ్ లోకి పిలిపించిన బిగ్ బాస్ అత‌ని ప్రాబ్ల‌మ్ ఏంటో చెప్ప‌మ‌న్నాడు. దానికి సంపూ….నేనెప్పుడు ఇలా ఉండ‌లేదు…అద్దాల గోడ‌ల మ‌ద్య ఉండ‌డం వ‌ల్ల టెన్ష‌న్ పెరిగిపోతుంది. నా ఊరి వాళ్ళ‌ను చూడ‌కుండా ఉండలేను..ఇప్పుడే వెళ్ళిపోతా అని అన్నాడు.దానికి బిగ్ బాస్..మీరు మీ ఇష్ట‌పూర్వ‌కంగానే షోకి వ‌చ్చారు..మిమ్మ‌ల్ని ఎవ‌రూ బ‌ల‌వంత‌పెట్ట‌లేదు…హౌస్ లోని స‌భ్యులంద‌రికీ ఒకే రూల్ ఉంటుంది అని చెప్పే ప్ర‌య‌త్నం చేసినా…సంపూ వెళ్ళిపోవ‌డానికే ఇంట్ర‌స్ట్ చూప‌డంతో….అత‌డిని డోర్స్ తెరుచుకొని వెళ్ళిపోమన్నాడు బిగ్ బాస్.
ఇటీవల ఎపిసోడ్ లో మధు ప్రియా ఎలిమినేట్ అయ్యింది. కొత్తగా దీక్ష పంత్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది అనుకునే లోనే కొత్త ప్రోమో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. బిగ్ బాస్ షో వదిలి వెళ్ళిపోతా అని ధన్రాజ్ అంటున్నాడు. తన ఫామిలీకి దూరంగా ఉండలేను అంటున్నాడు. తన ఫామిలీ విలువ తెలిపినందుకు బిగ్ బాస్ కు థాంక్స్ చెప్పాడు.ఆ వీడియో మీరే చూడండి!