ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు తెర మీద ఒక ఊపు ఊపిన స్నేహ, తరుణ్ నటించిన “ప్రియమైన నీకు” చిత్రం ద్వారా తెలుగు నాట అడుగుపెట్టింది. ఆ తరువాత వరుసగా టాప్ హీరోలు అయిన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సరసన పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే తమిళ హీరో ప్రసన్నని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి విహాన్ అనే పిల్లడు కూడా ఉన్నాడు. మొన్నామధ్య రీఎంట్రీ కూడా ఇచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన “వినయ విధయ రామ” సినిమాలో రామ్ చరణ్ కు వదిన పాత్ర కూడా చేసింది. అయితే తాజాగా స్నేహ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ స్నేహ భర్త ప్రసన్న తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. సో లెట్స్ కంగ్రాట్యులేట్ స్నేహ & ప్రసన్న!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here