మీ వల్లే కరోనా వస్తుందంటూ…పండ్లు కొనడానికి వచ్చిన మహిళా డాక్టర్ లపై దాడి..!

0
202

మీ వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ ఇద్దరు మహిళా వైద్యులపై దాడికి పాల్పడ్డారు ఢిల్లీలోని స్థానికులు. సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని జరిగింది. ఢిల్లీలోని సప్దర్ జంగ్ ఆసుపత్రిలో ఎమెర్జెన్సీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా వైద్యులు బుధవారం రాత్రి గౌతమ్ నగర్ లో పండ్లుకొనడానికి వెళ్లారు అయితే వీరివల్లే కరోనా వైరస్ వ్యాపిస్తుందంటూ వారి ఇంటి పక్కన ఉండే వ్యక్తి ఇరువురు వైద్యులతో గొడవకు దిగాడు.

దీనిపై వారు ఎంత సర్ది చెప్పినా వినకుండా వారిపై అసభ్యపదజాలం ఉపగయోగిస్తూ దాడికి దిగాడు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇద్దరు మహిళా వైద్యులు దిక్కుతోచని స్థితిలో అక్కడి పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ ఘటనపై ఆ ఇద్దరు డాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here