సితార టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె, ఆధ్య టాలీవుడ్ డైరెక్టర్ వంశి పైడిపల్లి కుమార్తె వీరిద్దరూ కలిసి “ఏ అండ్ ఎస్ ” అనే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిన విషయం మనకి తెలిసందే.. అయితే తొలుత త్రీ మార్కర్ ఛాలెంజ్ అనే వీడియో పోస్ట్ చేశారు వీరిద్దరూ… అనంతరం మరిన్ని విభిన్నమైన వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో పాటు ఆద్యంతం వినోదభరితంగా సాగే వీడియోలతో అభిమానులను బాగానే అలరిస్తున్నారు.

తాజాగా సితార, ఆద్యలు ఇద్దరు కలిసి ” సరిలేరు నీకెవ్వరూ ” చిత్రంలోని కధానాయిక రష్మిక మందన్న ను ఇంటర్వ్యూ చేసారు. ఈ క్రమంలో సరిలేరు నీకెవ్వరూ చిత్ర విశేషాలను, షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ ముగ్గురి ఎనర్జీ, ఉత్సాహం తనను ఆశ్చర్యపరిచింది అంటూ ట్వీట్ చేస్తూ ఈ వీడియోను పోస్ట్ చేసారు.

మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూరి దర్శకత్వంలో వస్తున్న ” సరిలేరు నీకెవ్వరూ ” చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్నారు. అలనాటి హీరోయిన్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు ముగ్గురు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా శనివారం భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు, టీజర్, ట్రైలర్, మహేష్ మాస్ లుక్ పోస్టర్స్, నెట్టింట ఓ ఊపు ఊపేస్తున్నాయి. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here