రాజేంద్రప్రసాద్ కెరీర్ లో అందుకున్న హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే జాలిపడతారు.

0
3837

రాజేంద్రప్రసాద్ కెరీర్ లో అందుకున్న హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే జాలిపడతారు. నిమా ఇండస్ట్రీలో కామెడీకి ఆయన కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు. నందమూరి తారక రామారావు గారి స్పూర్తితో నటుడిగా మారాలనుకున్నారు. ఏం చేసినా పర్‌ఫెక్ట్ గా చేయాలి. అదే ఆలోచనలో దేవదాసు కనకాల యాక్టింగ్ స్కూల్ వరకు తీసుకువెళ్ళింది. యాంక్టింగ్ లో పట్టా పొందారు. ప్రత్యేకించి మైమ్ యాక్టింగ్‌లో స్పెషల్‌గా ట్రైనింగ్  తీసుకున్నారు. ఆ అనుభవంతో ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారారు. అప్పటి వరకు కామెడీ, సినిమాలో ఉండేది. ఆయన వచ్చాక సినిమానే కామెడీతో నింపేశారు.
నవ్వుల రారాజుగా వెలుగుతున్నారు.. నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.

రాజేంద్రప్రసాద్ మొదటి సినిమా ప్రముఖ దర్శకులు బాపు తెరకెక్కించిన ‘స్నేహం’ అనే సినిమాతో పరిచయం అయ్యారు. ఈ సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఇందులో రాజేంద్రప్రసాద్ పాత్రకి మంచి పేరు వచ్చింది. దాంతో చిరంజీవి నటించిన మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. వీటితో తన సత్తా చాటారు. రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్ చూసిన పలువురు దర్శకులు ఆయనని కామెడీ హీరోగా
చూపించాలనుకున్నారు. హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు రూపొందించారు.

ప్రముఖ దర్శకులు జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి అగ్ర దర్శకులు రూపొందించిన సినిమాల్లో నటించి గొప్ప పేరు సంపాదించుకున్నారు. హీరోగా చెవిలో పువ్వు, ముత్యమంత ముద్దు, పేకాట పాపారావు, అత్తింట్లో అద్దె మొగుడు, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు లాంటి సినిమాలు రాజేంద్రప్రసాద్‌కి స్టార్ డం తీసుకువచ్చాయి. మాయలోడు, లేడీస్ టైలర్, ఆ ఒక్కటీ అడక్కు, రాజేంద్రుడు గజేంద్రుడు ఆయన కెరీర్‌ని మరో స్థాయికి తీసుకు వచ్చాయి. ఇదే క్రమంలో వచ్చిన ఎర్ర మందారం రాజేంద్రప్రసాద్‌లో మరో కోణాన్ని బయటకు తీసుకు వచ్చింది.

రాజేంద్రప్రసాద్‌ కెరీర్ లో మేడం, పెళ్ళి పుస్తకం ఎన్ని వందల ఏళ్ళు గడిచినా మర్చిపోలేరు. ముఖ్యంగా పెళ్ళి పుస్తకంలోని శ్రీరస్తు శుభమస్తు కలకాలం నిలిచిపోతుంది. కొబ్బరి బోండాం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఖుషీ ఖుషీగా, సరదా సరాదాగా, శ్రీరామ చంద్రులు సినిమాలతో రాజేంద్రప్రసాద్ కి వరుసగా హిట్స్ అందుకున్నారు. ఒకదశలో కంటిన్యూగా ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి. దాంతో రాజేంద్రప్రసాద్ నిర్మాతల హీరోగా మారారు. తనతో సినిమా తీస్తే నిర్మాత నష్టపోకూడదనేదే ఆయనలో ఉన్న గొప్పతనం.

ఒకవైపు హీరోగా చేస్తూనే చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. ఈ పాత్ర ఆయనకి చాలా మంచి పేరు తెచ్చింది. ఇక హాలీవుడ్ సినిమా క్విక్ గన్ మురుగన్ రాజేంద్రప్రసాద్ కెరీర్‌లో మరో మంచి సినిమా. హాలీవుడ్ సినిమా అయినా దీనికి ఆయన అందుకున్న రెమ్యునరేషన్ కేవలం 35 లక్షలు మాత్రమే. అంతేకాదు ఇదే ఆయన ఇప్పటి వరకు అందుకున్న హైయ్యెస్ట్ రెమ్యునరేషన్. ఇది తెలిసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే. దీనిని బట్టి అర్థమవుతోంది ఎంత స్టార్ డం ఉన్నా రెమ్యునరేషన్ విషయంలో అసలు డిమాండ్ చేయరని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here