శాసన మండలి రద్దు చేసే యోచనలో జగన్? అసెంబ్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు !!

0
303

ఏపీ శాసన మండలి రద్దు దిశగా జగన్ ప్రభుతం అడుగులు వేస్తోంది. పెద్దల సభను రద్దు చేసేందుకు సీఎం జగన్ యోచిస్తున్నారు. బుధవారం శాసన మండలి జరిగిన తీరు తనని ఎంతగానో బాధించిందని, చట్టాలను కాపాడటం కోసం మండలి ఉండాలి కానీ ఇలా అధికార దుర్వినియోగం చేయడానికి కాదు అని, చైర్మన్ షరీఫ్ సభను నిర్వహించడంలో పక్షపాతం చూపించారని, చంద్రబాబు డైరక్షన్ లో ఆయన పనిచేశారని వ్యాఖ్యానించారు. “మేధావులు శాసన సభకు ఎన్నిక కారనే ఉద్దేశ్యంతో మండలి ఏర్పాటు చేసారని, కానీ మన శాసన సభలోనే ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సివిల్ సర్వెంట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నపుడు ఇక మండలి అవసరం ఏముందని ఆలోచించాలి. చట్టసభలు వ్యతిరేకంగా, శాసన సభలకు వ్యతిరేకంగా, రూల్స్ తో సంబంధం లేకుండా పని చేస్తున్న ఈ మండలి కొనసాగించడం అవసరమా?” అని వ్యాఖ్యానించారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే మండలి పనిచేస్తుందని గుర్తు చేసారు.

“ఒక తీర్మానం చేసి ఎక్కడ నుంచి అయినా పాలన చేయొచ్చు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు. రాష్ట్రంలో ఎక్కడైన అసెంబ్లీ పెట్టొచ్చు, ఎక్కడనుంచి అయినా పాలన చేయొచ్చు. రాజ్యాంగం ఇదే విషయాన్నీ చెబుతోంది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చట్టసభలో కూర్చొని తీర్మానం చేస్తే అదే పరిపాలన” అని జగన్ తెలిపారు.

అయినా పేద రాష్టం అయిన మనకి 60 కోట్ల ఖర్చుతో మండలి అవసరమా? అని ప్రశ్నించారు జగన్. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదించిన ఈ విషయంపై స్పందించిన ఆయన మండలి రద్దు విషయమై మాట్లాడారు. ఈ విషయమై సోమవారం చర్చిద్దామని స్పీకర్ ను కోరారు. వెంటనే స్పీకర్ కూడా దీనికి అనుమతినిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here