షాకింగ్.. ఈ హీరోస్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు

హీరోయిన్స్ అంటేనే సన్నగా ఉండాలని తమ నాజుకు అందాలతో యువత మతి పోగొట్టాలని అనుకుంటారు.. అందంగా ఉన్న హీరోయిన్స్ కొన్ని రోజుల లోనే ముద్దుగా బొద్దుగా కనబడితే మాత్రం చూసి చీ ఎంటి ఇలా తయరయ్యింది అంటూ చురకలెయ్యకుండా ఉండలేం. సినిమాలు తగ్గగానే పెళ్ళి చేసుకోని లేక ఏ పని లేకనో హీరోయిన్స్ గుర్తు పట్తకుండా అయిపోయారు. మన హీరోలలో కూడా మార్పు వస్తోంది. వారు కూడా కాలానుగుణంగా మారడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈ మార్పు బాలీవుడ్, కోలివుడ్లతో పోల్చుకుంటే చాలా నిదానంగా జరుగుతోంది. హిందీ, తమిళం, మళయాల హీరోలు మూస చిత్రాలకు చాలా వరకు స్వస్తి పలికారు. మల్టీస్టార్ చిత్రాలలో నటిస్తున్నారు. కథలలో కొత్తదనంతోపాటు, ఎటువంటి పాత్రనైనా చేస్తున్నారు. జనం మెప్పు పొందుతున్నారు. మన హీరోలు కూడా అదేబాటలోకి వెళుతున్నారు.

కొందరు తారలు ఒక్క సినిమాలో కనిపించినా చెరిగిపోని ముద్ర వేస్తారు. కొందరు నటీనటులు తెరమరుగై ఏళ్లు గడిచినా అభిమానుల మనసు పొరల్లో నిలిచే ఉంటారు. ఒకప్పటి నటి గిరిజా షెట్టర్‌, సర్వదమన్‌ బెనర్జీ, మంజునాథ్‌, మాధవి, అన్షు, రవళి, మీనాక్షీ శేషాద్రి, రక్షిత… లాంటి తారలు ఆ కోవకు చెందినవారే. ఇంతకీ వాళ్లు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారో తెలుసా…

1 . రోహిత్

ఈ హీరో చిన్న బడ్జెట్ సినిమాలకు రారాజులా వెలిగాడు. సిక్స్టీన్ సినిమాతో ఎంటర్ అయిన ఈ హీరో తరవాత గర్ల్ ప్రెండ్ ఈ రెండు సినిమాలు అప్పట్లో సంచనం సాధించాయి. ఆ తరవాత రోహిత్ కు ఆఫర్లు తగ్గి, ఇతర హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాల్సి వచ్చింది. చిరు సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో రోహిత్ నటించిన పాత్ర ఇప్పటికి ప్రేక్షకుల మదిలో ఉంది. చివరిగా 2010 లో మా అన్నయ్య బంగారం లో కనిపించి ఆ తరవాత కనిపించడం మానేసాడు. తాజాగా ఒక ఫంక్షన్ లో రోహిత్ కనిపించాడు గాని అతనిని ఎవ్వరు గుర్తు పట్టలేకుండా ఉన్నారు.


2 . మంజునాథ్

పాతికేళ్ల కిందట దర్శకుడు కె. విశ్వనాధ్ తీసిన స్వాతి కిరణం చిత్రంలో హీరో మమ్ముట్టి. కానీ అతని కన్నా ఎక్కువ పేరొచ్చింది ఆ చిత్రంలో గంగాధరం పాత్ర పోషించిన కుర్రాడు మంజునాథ్ కే. బెంగళూరుకు చెందిన ఈ కుర్రాడు కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాల్లో నటించాడు. 19 ఏళ్ళ వయసులో చదువుకోసం నటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరు లో ఉంటూ సొంతంగా పీ ఆర్ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నాడు. బెంగళూరు – మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రోజెక్టుకూ పని చేస్తున్నాడు. కర్ణాటకకు చెందిన అథ్లెట్ స్వర్ణరేఖ ను పెళ్లి చేసుకున్న మంజునాథ్ కు ఓ బాబు కూడా ఉన్నాడు.


3 . సర్వదమన్‌ బెనర్జీ

సిరివెన్నెల సినిమాలో అంధుడైన ఫ్లూటిస్ట్‌గా సర్వదమన్‌ బెనర్జీ పోషించిన పాత్రను ఆ సినిమా చూసినవారెవ్వరూ మర్చిపోలేరు. దూరదర్శన్‌లో వచ్చిన రామానంద్‌ సాగర్‌ ‘కృష్ణ’ సీరియల్‌లో శ్రీ కృష్ణుడిగానూ దేశం మొత్తానికీ ఆయన సుపరిచితుడు. ఉత్తరాదిలో ఇప్పటికీ చాలామంది సర్వదమన్‌ని ‘కృష్ణ’ అనే పిలుస్తారు. విచిత్రం ఏంటంటే ఆ సీరియల్‌లో కృష్ణుడిగా నటించినప్పట్నుంచీ ఆయన పూర్తిగా కృష్ణతత్వంలోకీ ఆధ్యాత్మిక చింతనలోకీ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌లో స్థిరపడి ధ్యాన బోధన చేస్తున్నారు. పేద పిల్లల్ని చదివించే ‘పంఖ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచేస్తూ సొంత ఖర్చులతో కొందరు విద్యార్థులనూ చదివిస్తున్నారు సర్వదమన్‌.

4 . ఉదయ్ చోప్రా

ధూమ్‌’ సిరీస్‌లో తన కామెడీ అలరించిన ఉదయ్‌ చోప్రా గుర్తున్నాడా? యశ్‌ చోప్రా తనయుడైన ఉదయ్‌ చోప్రా బాలీవుడ్‌లో గొప్పగా రాణించలేదు. దీంతో సినిమాల నుంచి తప్పుకున్న ఉదయ్‌.. కేవలం ‘ధూమ్‌’ సిరీస్‌లో మాత్రం నటిస్తున్నాడు. 2013లో ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘ధూమ్‌-3’ సినిమాలో ఉదయ్‌ చివరిసారిగా తెరపైన కనిపించాడు. ఆ సినిమాలో కండలు తిరిగిన దేహసౌష్టవంతో ఎనర్జిటిక్‌గా కనిపించిన ఉదయ్‌.. ఇప్పుడు కండలు లేవు సరికదా గుర్తుపట్టలేని రీతిలో మారిపోయాడు. బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆయన తాజా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ఉదయ్‌ ఆ మధ్య నర్గీస్‌ ఫక్రీతో డేటింగ్‌ చేసినట్టు కథనాలు వచ్చిన వారి మధ్య ఇటీవల బ్రేకప్‌ అయిందని బాలీవుడ్‌ చెప్పుకుంటోంది.