నాగచైతన్య నటించిన “బెజవాడ” చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అమలా పాల్, రామ్ చరణ్ తో “నాయక్” సినిమాతో మంచి విజయం సాధించి, అల్లు అర్జున్ హీరోగా ఇద్దరమ్మాయిలు సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించింది. అయితే తరువాత పెద్దగా తెలుగులో అవకాశాలు లేకపోయినా తమిళ, మాలయాళ భాషల్లో వరుసగ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇకపోతే దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకోవడం, తదుపరి విడాకులు తీసుకోవడం, వెనువెంటనే జరిగిపోయాయి.

అయితే తాజాగా అమలాపాల్ మాజీ భర్త, డైరెక్టర్ ఏఎల్ విజయ్ తండ్రి అళగప్పన్ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. అయన స్థానిక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో విజయ్ – అమల ల విడాకులకు దారితీసిన కారణాలు తెలియజేసారు. పెళ్లి తరువాత అమలాపాల్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని,అదే సమయంలో ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థలో తీయబోయే “అమ్మ కనక్కు” అనే సినిమాలో అవకాశం ఇచ్చారు.

అమల ఆ చిత్రం చేయానికి సిద్దపడిందని, ఆ విషయం విజయ్ కి నచ్చలేదని, దేనితో వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తి విడాకులు తీసుకుని విడిపోయారట. దీనితో కోలీవుడ్ మొత్తం అళగప్పన్ ఆరోపణల గురించి చర్చ జరుగుతుంది. 2017లో విడాకులైన సమయంలో విజయ్ మాట్లాడుతూ “అమలాపాల్ తన కెరీర్ ను కొనసాగించాలని ఆశించినప్పుడు నేను, నా కుటుంబం ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదని, మేము అభ్యంతరాలు చెప్పామని వస్తున్న వార్తలలో నిజం లేదని, వివాహ బంధం అనేది నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య నిజాయితీ లోపిస్తే ఆ బంధానికి అర్ధం లేదు ” అని తెలిపారు. ఈ క్రమంలో గత ఏడాది జులైలో విజయ్ మరో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో అమలాపాల్ ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. అయితే తాజా ఆరోపణలపై మాత్రం రచ్చ రచ్చ జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here