తవ్వకాలలో బయటపడిన 1000 సంవత్సరాల గుడ్డు!

సాధారణంగా పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలను చేపడుతున్న సమయంలో వారికి కొన్ని వేల సంవత్సరాల కాలం నాటి వస్తువులు తవ్వకాలలో బయట పడుతుంటాయి. ఈ వస్తువుల ఆధారంగా ఆ ప్రాంత చరిత్రను తెలుసుకోవడానికి వీలవుతుంది.ఈ విధంగా తవ్వకాలలో దొరికిన వస్తువులను పురావస్తు శాఖ అధికారులు ఎంతో భద్రపరిచి ఉంచుతారు. తాజాగా ఇలాంటి తవ్వకాలలో భాగంగా ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ఆర్కియాలజిస్టుకు వెయ్యేళ్ల కిందటి కోడి గుడ్డు దొరికింది. అయితే ఈ గుడ్డు మనుషుల మలంతో నిండిన సెస్పిట్(మలాన్ని నింపే గొయ్యి)లో అది లభించడం గమనార్హం.

సాధారణంగా మనం ఫ్రిడ్జ్ లేదా బయట గుడ్డు నిల్వ చేయాలంటే కేవలం కొన్ని నెలల వ్యవధి వరకు మాత్రమే నిల్వ చేయవచ్చు కానీ మనసులో నిండిన సుమారు వెయ్యి సంవత్సరాల పాటు ఎంతో భద్రంగా నిల్వ ఉందని ఆర్కియాలజిస్ట్ తెలియజేశారు.యావ్నేలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ (IAA) చేపట్టిన తవ్వకాల్లో ఈ అరుదైన గుడ్డు లభించింది. ఈ తవ్వకాల్లో తొలుత బైజాంటైన్ కాలం నాటి సెస్పిట్లో ఈ గుడ్డును కనుగొనడం జరిగింది.

ఈ క్రమంలోనే ఆర్కియాలజిస్ట్ మాట్లాడుతూ సాధారణంగా గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండవు కాని మానవుడు మండలంలో నిల్వ చేయడం వల్ల ఇది వెయ్యి సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉందని తెలిపారు.పైగా ఈ కోడిగుడ్డు పెంకు ఎంతో దృఢంగా మారిందని కేవలం ఒక చోట మాత్రమే చీలిక రావడం వల్ల గుడ్డు లోపల ఉన్నటువంటి తెల్లసొన లీక్ అయినట్లు తెలిపారు.

గుడ్డు తెల్ల సోన లీక్ కాగా పచ్చసొన ఎంతో భద్రంగా ఉండడంతో దానిని డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ఆర్కియాలజిస్ట్ అల్లా నగోరస్కే తెలియజేశారు. అదేవిధంగా ఈ గుడ్డు దాచి ఉంచిన మలం గొయ్యిలో మనుషుల ఎముకలతో తయారు చేసిన బొమ్మలు ఉన్నాయని మరొక ఆర్కియాలజిస్ట్ పేర్కొన్నారు. ఏదిఏమైనా మనుషుల మలంలో గుడ్డు 1000 సంవత్సరాలు నిల్వ ఉండటం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం అని ఆర్కియాలజిస్ట్ తెలియజేశారు.