ఎల్‌ఐసీ పాలసీతో అకౌంట్ లోకి రూ.19000.. ఎలా పొందాలంటే..?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరే విధంగా ఎల్‌ఐసీ కొత్త పాలసీలను రూపొందిస్తోంది. ఎల్‌ఐసీ అందుబాటులోకి తెచ్చిన ప్లాన్లు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇతర పాలసీలతో పోలిస్తే జీవన్ అక్షయ పాలసీ వినియోగదారులకు భారీగా ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు చేస్తూ పదవీ విరమణ తరువాత డబ్బు కోసం ఇబ్బంది పడకుండా ఉండాలనుకునే వారికి జీవన్ అక్షయ్ పాలసీ వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఈ పాలసీలో వేరువేరు ఆప్షన్లు సైతం అందుబాటులో ఉంటాయి కాబట్టి అనుకూలమైన ఆప్షన్ ను ఎంచుకుని పాలసీ ద్వారా ఉత్తమ ప్రయోజనాలను పొందవచ్చు.

జీవన్ అక్షయ పాలసీని 30 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు తీసుకోవచ్చు. లక్ష రూపాయల నుంచి 40 లక్షల రూపాయల వరకు ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. 40 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే పాలసీ తీసుకున్నా ఏడాది నుంచే నెలకు 19,000 రూపాయల చొప్పున పొందవచ్చు. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయలేని వాళ్లు లక్షకు పైగా ఎంత ఇన్వెస్ట్ చేసినా ప్రతి నెలా పెన్షన్ ను పొందవచ్చు.

ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు జీవించినంత కాలం డబ్బులను పెన్హ్హన్ రూపంలో పొందే అవకాశం ఉంటుంది. పెన్షన్ డబ్బులను ప్రతి నెలా తీసుకోకూడదని అనుకుంటే మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి పెన్షన్ ను పొందవచ్చు. అయితే పాలసీదారుడు మరణించిన తరువాత పెన్షన్ రాకపోవడంతో పాటు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కుడా తిరిగిరావు. ఈ నిబంధనకు ఓకే అనుకుంటే మిగతా పాలసీలతో పోలిస్తే ఈ పాలసీ వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయి.