Bollywood: ప్రస్తుత కాలంలో సినిమాలలో హీరోలతో పాటు సమానంగా విలన్లు కూడా మంచి క్రేజీ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల కాలంలో వచ్చే సినిమాలలో హీరోల కంటే విలన్లు అందంగా కనిపిస్తున్నారు. కానీ ఒకప్పుడు విలన్ అంటేనే చూడటానికి భయంకరంగా ఉండేవారు.
Advertisement
వారిని తెరపై చూస్తే పిల్లలు కూడా భయపడే విధంగా వారి వేషధారణ ఉండేది. ఇక విలన్ పాత్రలలో నటించడానికి కొంతమంది సెలబ్రిటీలు ప్రత్యేకంగా ఉండేవారు కానీ ప్రస్తుత కాలంలో హీరోలు కూడా విలన్లుగా కొన్ని సినిమాలలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో భయంకరమైన విలన్ పాత్రలు పోషించిన శక్తి కపూర్, అశుతోష్ రాణా, నవాబ్ షా , కెకె మీనన్.. ఈ నలుగురు బాలీవుడ్ తెరపైకి రాగానే ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురి చేశారు.
ఇలా తెరపై ప్రేక్షకులను భయపెట్టిన ఈ విలన్ల భార్యలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరి భార్యల బ్యాగ్రౌండ్ తెలిస్తే మాత్రం తప్పకుండా షాక్ అవ్వాల్సిందే.
శివాంగి కొల్హాపురే: శివాంగి 80వ దశకంలో చాలా సినిమాల్లో నటించింది. మిథున్ నుండి అమితాబ్ బచ్చన్ వరకు ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే విలన్ శక్తి కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
Advertisement
రేణుకా షహానే: రేణుక హిందీ మరాఠీ చిత్రాలలో అనేక టెలివిజన్ నిర్మాణాలలో తన పనికి ప్రసిద్ధి చెందింది. ఇలా టెలివిజన్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎన్నో పురస్కారాలను అందుకున్న రేణుక అశుతోష్ రానాను వివాహం చేసుకుంది. అయితే ఇది ఈమెకు రెండవ వివాహం ఈమె మొదట్లో విజయ్ కెంకరేను వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవడంతో 2001వ సంవత్సరంలో ఆశుతోష్ ను పెళ్లి చేసుకున్నారు.
పూజా బాత్రా: ప్రముఖ బాలీవుడ్ నటి పూజా బాత్రా 1993 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా పోటీలో రన్నరప్ టైటిల్ గెల్చుకున్నారు. అంతేకాకుండా ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 1993 కిరీటాన్ని పొందింది . మిస్ ఇంటర్నేషనల్ 1993లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత బాలీవుడ్ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఈమె నవాబ్ షాను రెండో వివాహం చేసుకున్నారు. ఈమె వివాహం అప్పట్లో సంచలనంగా మారింది..
Advertisement
స్టార్ హీరోయిన్స్.. నివేదా భట్టాచార్య: నివేదిత బుల్లితెర నుంచి వెండితెర వరకు చాలా క్రేజ్ దక్కించుకుంది. ఇలా బుల్లితెరపై మాత్రమే కాకుండా ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న నివేదా కెకె మీనన్‌ని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా ఈ నలుగురు విలన్లు అయినప్పటికీ వీరి భార్యలు మాత్రం ఎంతో క్రేజ్ ఉన్న నటీమణులు కావటం విశేషం.
Bigg Boss 8: బిగ్ బాస్ 8 తెలుగు కార్యక్రమం ప్రస్తుతం ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మూడో వారంలోకి అడుగు పెట్టింది. ఇక 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే ఐదవ వారంలో మరికొంతమంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.
Advertisement
ఇక ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ కూడా ఎక్కువగా బుల్లితెర నటీనటులు ఉండటం విశేషం. ఇక బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైన సమయం నుంచి విన్నర్ ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఉంటాయి.
బిగ్ బాస్ నిర్వహకులు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా ఎంత జాగ్రత్త పడినప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు మాత్రం బయటకు వస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా విన్నర్ ఎవరు అనే విషయం గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది.
విన్నర్ విష్ణుప్రియ.. ఇక హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్లలో కాస్తో కూస్తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నటువంటి వారిలో విష్ణు ప్రియ ఒకరు. ఈమెకు సోషల్ మీడియాలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే హౌస్ లో కూడా విష్ణుప్రియ చాలా జెన్యూన్ గా గేమ్ ఆడటమే కాకుండా అన్ని విషయాలను పాజిటివ్గా తీసుకుంటూ ఎంతో మంది అభిమానులను కూడా ఆకట్టుకున్నారు. దీంతో విష్ణు ప్రియనే ఈ సీజన్ విన్నర్ కావచ్చనే అభిప్రాయాలు కూడా చాలామందిలో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లు కూడా విష్ణు ప్రియ పేరును చెప్పడంతో ఈ సీజన్ విన్నర్ ఆమెనని స్పష్టంగా అర్థమవుతుంది.
Anushka: సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఈమె అరుంధతి వంటి లేడి ఓరియంటెడ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్కకు అవకాశాలు క్యూ కట్టాయి.
Advertisement
ఇలా ఎన్నో అద్భుతమైన తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. అయితే పలు ప్రయోగాత్మక సినిమాలలో నటించిన అనుష్క అధిక శరీర బరువు కావడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పలు భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న అనుష్కకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.
ఇటీవల సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అనుష్క మంచితనం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అనుష్క మంచితనం చూస్తే ఇలాంటి వ్యక్తులు కూడా భూమి మీద ఉంటారా అనే ఆశ్చర్యం కలుగుతుందని ఆయన అనుష్క పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా అనుష్కకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయటపెట్టారు.
సెప్టెంబర్ నెలలో.. అనుష్క ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో తనకు ఐఫోన్ గిఫ్ట్ గా పంపిస్తుందని ఈయన తెలిపారు. నా మీద ఆమె చూపించే ఈ ప్రత్యేకమైన ప్రేమకు నేను కృతజ్ఞుడిని అంటూ ఈయన కామెంట్లు చేశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది కేవలం రెండు సినిమాలే కానీ ఈ రెండు సినిమాలకి వీరిద్దరి మధ్య ఇలాంటి బాండింగ్ ఏర్పడటంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Mokshagna: నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి మోక్షజ్ఞ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈయన ఫస్ట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మోక్షజ్ఞ లుక్ కి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే.
Advertisement
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలను వెల్లడించడమే కాకుండా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.
ఈ సినిమా కోసం మోక్షజ్ఞ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఇతర భాష సెలబ్రిటీలను కూడా భాగం చేయబోతున్నారు.
20 కోట్ల రెమ్యూనరేషన్.. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఈ విధంగా ఒక డెబ్యూ హీరో సినిమాకు ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించడం అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి. అయితే మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రాకముందే ఈయనకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు కనుక ఈ సినిమాపై ఎంతో నమ్మకంతోనే భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.