“50 ఏళ్ళ అందమైన వరుడు కావలెను” అంటూ ఓ అమ్మడు ట్వీట్ చేసింది. కానీ పెళ్లి అమ్మాయికి కాదు, అమ్మాయిని కన్న వాళ్ళ అమ్మకి. అదేంటి ఇలాంటివి అన్ని సినిమాలు, సీరియళ్ళలో మాత్రమే ఉంటాయి అనుకుంటున్నారా ? నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి అండీ.. వాస్తవానికి భిన్నంగా ఉన్నా, మా అమ్మకి వరుడు కావలెను అని ఒక కూతురు తెగ వెతుకుతోంది.

ఇక వివరాల్లోకి వెళితే తాజాగా ఆస్తా వర్మ అనే అమ్మాయి మా అమ్మకి వరుడు కావాలి అని చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అయిపోయింది. అందులో అమ్మతో పాటు ఆస్తా వర్మ తానూ ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ ట్వీట్ చుసిన చాలామంది రీట్వీట్ చేస్తూ ఆస్తా వర్మకి అభినందనలు తెలుపుతున్నారు. మరికొందరు ఇదెక్కడి విడ్డురం అని పెదవి విరుస్తున్నారు.

అంతేకాదు ఇందులో కొన్ని షరతులు కూడా పెట్టింది ఈ అమ్మడు. అమ్మకి కాబోయేవాడు శాకాహారిగా ఉండాలని, మద్యం సేవించరాదని, బాగా సెటిల్ అయినా వ్యక్తి అయ్యి, మంచి వాడికి ఉండాలని షరతులు విధించింది ఆస్మా.. సోషల్ మీడియాలో స్పందన అయితే బాగుంది కానీ, అమ్మకొసం ఆస్మా చేసిన ఈ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.. మరి అమ్మకోసం ఆస్మా చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం.. అల్ ది బెస్ట్ ఆస్మా !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here