పంచదార వాడటం మానేస్తే ఇలాంటి మార్పులు వస్తాయా?

మనం ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగనిదే మన శరీరం ఉత్తేజితం కాదు. మరి ఉదయం లేవగానే కాఫీ తయారు చేయాలంటే చక్కెర అవసరం. మన నిత్యవసర వస్తువులలో చక్కెర కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలామంది చక్కెరతో వివిధ రకాల వంటలను తయారు చేసుకొని తింటుంటారు. చక్కెర అనేది మన నిత్య జీవితంలో ఒక అవసరంగా మారిపోయింది. అయితే పంచదారను తినడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చక్కెర అనేది ఒక మత్తు పదార్థంగా ఉండటం వల్ల చాలామంది చక్కెరకు బానిస అయ్యి పదేపదే తినాలనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే చక్కెరను పూర్తిగా మానేయాలి అని నిపుణులు తెలియజేస్తున్నారు.

మన నిత్యావసరాలలో ఎంతో ప్రాముఖ్యతను చోటుచేసుకున్న చక్కెరను ఒక్కసారిగా మానేయాలంటే ఎంతో ఇబ్బందికరం. కనుక చక్కెర స్థానంలో బెల్లం, పటిక బెల్లం వంటి వాటిని ఉపయోగించడం ద్వారా క్రమంగా చక్కెరను దూరం పెట్టవచ్చు. చక్కెరతో వివిధ రకాల వంటలను తయారు చేసుకుని తినాలి అనుకునేవారికి మరీ మరీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా చక్కెరను అతిగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కనుక పూర్తిగా చక్కెరను మానేయాలి.

చక్కెరను క్రమంగా తగ్గిస్తూ రావడం వల్ల మన దృష్టి మొత్తం ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల వైపు మళ్ళుతుంది. ఈ క్రమంలోనే మన శరీరానికి కావలసిన పోషకాలు అందడంతో ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. చక్కెరను దూరం పెట్టిన తరువాత ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలను తీసుకోవాలి. ఈ విధంగా తాజా కూరగాయలను తీసుకోవటంవల్ల మన శరీరానికి ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పూర్తిస్థాయిలో అందుతాయి.

ఈ పంచదారను దూరంచేసి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనలో కలిగే ఒత్తిడి, ఆందోళన, అనేవి క్రమంగా తగ్గిపోతాయి. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు శాతం కరిగిపోయి శరీర బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. అందుకోసమే పంచదారకు బదులుగా నల్ల బెల్లం, పటిక బెల్లం, బెల్లం వాడాలి. అయితే మనం తీసుకొనే ఆహారంలో కేవలం 20 శాతం మాత్రమే ఉండేలా చూసుకోవాలి అప్పుడే ఎలాంటి సమస్యలు లేకుండా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలము.