టెలివిజన్లో ఎన్ని షోలు ఉన్నా ఈ టీవిలో ప్రసారమయ్యే “జబర్దస్త్” షో కి ఉన్న క్రేజే వేరు. అనామకులుగా ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టులను బయటకి తెచ్చింది జబర్దస్త్. బుల్లితెర మీద ఎన్ని కామెడీ షో లు వచ్చినా సరే ఈ టీవిలో జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ షోనే. ఈటీవీ TRP రేటింగ్స్ చాలా వరకు ఈ జబర్డస్ట్ వచ్చే టైంలోనే వస్తున్నాయి అంటే దాన్ని బట్టి జబర్దస్త్ షో కెపాసిటీ అర్థం చేసుకోవచ్చు. తెలుగులో ఒక కామిడి రియాలిటీ షో ఇంత అద్భుతమైన సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించని కూడా లేదు. అంతేకాదు ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ జీవితాలు కూడా ఓ రేంజ్ లో మారిపోయాయి. ఒకే ఒక్క షో తోనే స్టార్స్ అయిపోయారు. అంతేకాదు ఈ కామెడీ షో ద్వారా చాలా మంది కొత్త కొత్త కమెడియన్స్ టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఒక్కసారిగా వీరి జీవితాలు మారిపోయాయి. డబ్బులు, క్రేజ్ బాగానే సంపాదించారు. కొంత మంది సినిమాల్లో హీరోలుగా వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

అయితే ఈ మధ్యనే నాగబాబు ఈ షో నుంచి తప్పుకుని, వేరు కుంపటి పెట్టుకున్న విషయం తెలిసిందే. పోతూ పోతూ జబర్దస్త్ నిర్మాతలైన మల్లెమాలపై ఘాటుగానే విమర్శలు చేసారు. అదిరింది లో షోలో ఆర్టిస్టుల చేత జబర్డస్ట్ షో మీద జోకులు వేయించుకుని మరీ పగలపడి నవ్వుకున్నారు నాగబాబు. అయితే దీనికి జబర్దస్త్ కూడా రివర్స్ అటాక్ చేసింది. అదిరింది షో ప్రసారమయ్యే సమయంలో జబర్దస్త్ లోని బాగా పేలిన స్కిట్ లను వేసి నాగబాబు మీద రివెంజ్ తీర్చుకుంది. ఈ షోల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ క్రమంలో మొన్న గురువారం వచ్చిన జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్ లో చేసిన పంచ్ గట్టిగానే పేలింది. స్కిట్ లో మరో వ్యక్తి “చీరల్ని.. నగల్ని… తీసుకెళ్తా..” అని అంటే. దానికి హైపర్ ఆది రిప్లై ఇస్తూ “ఆ.. తీసుకెళ్ళరా.. యాంకర్లను, మమల్ని, జడ్జీలను తీసుకెళ్లి “కుదిరింది” అని షో పెట్టుకోరా” అన్నాడు. అదే సమయంలో జడ్జి గా ఉన్న రోజా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ తరువాత తేరుకుని పడి పడి నవ్వడం మొదలు పెట్టారు. దీనికి ఆది ఫై ఫైర్ అవుతున్నారు మెగా ఫాన్స్… ఆది కి నాగబాబు చాలా చేసారని, నాగబాబు వల్లే ఆది ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడని. నాగబాబు పై ఆది ఇలాంటి పంచులు వేయడం సరికాదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here