సినీనటి రాశికి ఆర్ధిక సమస్యలు… సమస్యలు అందరికి ఉంటాయంటున్న రాశి..!

0
428

‘రావుగారిల్లు’ చిత్రం ద్వారా బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన రాశి… ఆ తర్వాత ‘గోకులంలో సీత’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై అతి తక్కువకాలంలోనే ప్రముఖ హీరోలందరి సరసన నటించి అగ్ర హీరోయిన్ గా ఎదిగారు. అన్ని రకాల పాత్రలను పోషించి అభిమానుల మన్ననలు పొందారు. చివరకు ‘నిజం’ లోని రత్తాలు వంటి వ్యాంప్ క్యారెక్టర్ లో సైతం నటించి మెప్పించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఫ్యామిలీకి పరిమితమైపోయిన రాశి ఇటీవలే మళ్లీ మేకప్ ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలోని తల్లి క్యారెక్టర్ తో మళ్ళీ తెరమీదకొచ్చారు.

ఇదిలావుంటే.. ఈమధ్యనే సోషల్ మీడియాలో సినీనటి రాశి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటూ, సినీ అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే విషయంపై రాశి స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె మాట్లాడుతూ, ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, తనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని స్పష్టం చేశారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నానని చెప్పారు. సమస్యలు ఎవరికైనా వస్తుంటాయని… వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలని పాజిటివ్ గా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here