Actor Sivabalaji : బిగ్ బాస్ కి వాళ్ళు వెళితే… కెరీర్ అంతే… అది ఒక లగ్జరీ జైలు…: యాక్టర్ శివ బాలాజీ

0
94

Actor Sivabalaji : ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ బాలాజీ ఆ తరువాత ఎలా చెప్పను, దోస్త్ సినిమాల్లో నటించారు. అయితే శివ బాలాజీ కి మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం ఆర్య. బన్నీ నటించిన ఆర్య సినిమాలో విలన్ షేడ్ ఉన్న పాత్రలో అజయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత సంక్రాంతి సినిమాతో మరో మంచి హిట్ అందుకున్న శివ బాలాజీ తన 17 ఏళ్ళ వయసులోనే తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ 22 ఏళ్లకే సొంత వ్యాపార సంస్థలను పెట్టాడు. ఇక సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీ వైపు వచ్చిన శివ బాలాజీ నటి మధుమిత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ గా నిలిచి తెలుగు ప్రేక్షకులకు మదిలో సరికొత్త గుర్తింపు అందుకున్న బాలాజీ బిగ్ బాస్ గురించి అక్కడి అనుభవాలను మాట్లాడారు.

బిగ్ బాస్ తర్వాత ఫ్యూచర్ ఉండదు…

శివ బాలాజీ అప్పటికే గుర్తింపు ఉన్న నటుడు అయినా బిగ్ బాస్ తో ప్రతి ఇంటికి మరింత చేరువయ్యాడు. ఏదో ఒక రోజు ఎలిమినేట్ అవుతాడు అనుకున్న వ్యక్తి ఏకంగా విన్నర్ అయి బయటికి వచ్చాడు. మంచి హైప్ వచ్చింది, ఇక మళ్ళీ వరుస అవకాశాలతో బిజీ అవుతాడు అని అందరూ అనుకున్నా అలాంటిదేమి జరగలేదు. ఆచితూచి సినిమాలను చేస్తూ బాలాజీ నెమ్మదిగానే ఉన్నాడు.

ఇదే విషయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ మంచి అనుభవాలను ఇచ్చిందని అదొక లగ్జరీ జైలు వంటింది అంటూ చెప్పారు. చిన్న చిన్న ఆర్టిస్టులకు అలాగే సోషల్ మీడియాలో కొంచం పేరు సంపాదించుకున్న వారికి బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ మంచి గుర్తింపు ఇస్తుంది. ముఖ్యంగా వాళ్ళు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతారు. అయితే ఆల్రడీ సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వారికి కొత్తగా బిగ్ బాస్ వల్ల ఒరిగేదేమి ఉండదు. కేవలం సినిమాల్లో చూస్తున్న వ్యక్తి నిజంగా ఎలాంటి వాడో తెలుస్తుంది అంతే అంటూ చెప్పారు.