Adi Reddy: డబ్బులు తీసుకొని బయటకు రావచ్చు కదా… యాంకర్ శివ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఆదిరెడ్డి!

Adi Reddy: బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ముగిసింది. అందరూ అనుకున్న విధంగానే ఈ సీజన్ విన్నర్ రేవంత్ నిలిచి కప్పు గెలుచుకున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీహాన్, రేవంత్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక టాప్ త్రీ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయినటువంటి రోహిత్ ఆదిరెడ్డి కీర్తి ఈ ముగ్గురు కూడా ఈ కార్యక్రమం అనంతరం బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ శివ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ 15 వారాల జర్నీ ఎలా ఉంది అని ప్రశ్నించడంతో.. జీవితంలో ఒక్కసారి మాత్రమే కలిగే అనుభూతి ఇది అని రోహిత్ చెప్పగా, అమేజింగ్ ఫీలింగ్ అని కీర్తి సమాధానం చెప్పారు. ఇక ఆది రెడ్డి మాట్లాడుతూ ఈ జర్నీ చాలా హ్యాపీ బ్రో బట్ టఫ్ జర్నీ అంటూ సమాధానం చెప్పారు.

ఇక బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేటప్పుడు చాలా నెగిటివ్గా అనిపించింది కానీ కంటెంట్ గా ఉన్నప్పుడు అలా అనిపించలేదని ఆదిరెడ్డి చెప్పగా ప్రేక్షకులు తనని ఎక్కడ వరకు తీసుకెళ్తారన్న మైండ్ సెట్ తోనే తాను బిగ్ బాస్ కి వచ్చాను అని రోహిత్ చెప్పారు.ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో నాకు నా ఫ్యామిలీ దొరికింది అని కీర్తి సమాధానం చెప్పారు.

Adi Reddy: ఒక్క రూపాయి కూడా ముట్టుకోను…


బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ఉపయోగించుకొని డబ్బులు తీసుకొని బయటకు రావచ్చు కదా అని యాంకర్ శివ ఆది రెడ్డికి ప్రశ్నించడంతో ఆదిరెడ్డి మాత్రం సమాధానం చెబుతూ….50 లక్షల రూపాయలు ఆఫర్ చేసిన కానీ నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోనని అది కేవలం విజేత డబ్బులు అని సమాధానం చెప్పారు. కీర్తి సైతం డబ్బులు తీసుకొని బయటకు రావడం ఇష్టం లేక తను ఆఫర్ రిజెక్ట్ చేశానని కీర్తి కూడా సమాధానం చెప్పుకొచ్చారు.