కలర్ చూసి.. కమిడియన్స్ పక్కన తప్ప హీరోల పక్కన నువ్వు పనికిరావు అన్నాడు ఆ స్టార్ డైరెక్టర్…!!

0
420

ఐశ్వర్య రాజేష్… ఇటీవలే విజయ్ దేవరకొండ “వరల్డ్ ఫ్యామస్ లవర్” సినిమాలో విజయ్ సరసన నటించి తన నటనతో శెభాష్ అనిపించుకుంది. తెలుగమ్మాయే అయినా కూడా తమిళంలో నటించి అక్కడ మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే తెలుగులో అడుగుపెట్టింది. ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ భామ. అయితే ఎక్కడో బాలీవుడ్ లో మొదలైన “మీటూ” ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అన్ని ఇండుస్త్రీలలోను కొందరు నటీమణులు తమకు ఎదురైనా చేదు అనుభవాలను, వేధింపులను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దీనిపై మీడియా లో మాట్లాడిన విషయం తెలిసిందే. తాజగా ఇదే కోవలోకి ఐశ్వర్య రాజేష్ కూడా వచ్చేసింది.

తాజాగా ఆమె మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ నిజంగానే ఉందని, నటీమణులను చాలా తక్కువగా చూస్తుంటారని కామెంట్ చేసింది. “నా కెరీర్ మొదటిలో నేను అనేక లైంగిక వేధింపులతో పాటు.. ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాను. నేను నల్లగా ఉన్నాను అనే కారణంగా చాలా మంది నన్ను అవహేళన చేసారు. ఒక స్టార్ డైరెక్టర్ అయితే అసలు నేను హీరోయిన్ మెటీరియల్ కాదు అని కించపరిచారు. కమెడియన్స్ పక్కన తప్ప హీరోల పక్కన నువ్వు సెట్ అవ్వవు అని కూడా అయన అన్నాడు” అంటూ తనకు జరిగిన అవమానాలను గురించి చెప్పింది. అయినా తాన ప్రయత్నం ఎక్కడ ఆపలేదని, ఎన్నో వేధింపులను ఎదుర్కొని పైకి వచ్చానని ఐశ్వర్య రాజేష్ తెలిపింది.