Analist Damu Balaji : తినండి.. తాగండి.. ఎంజాయ్ చేయండి… క్లాస్ రూమ్ వైపుకి రాకండి… ఆర్జీవి సంచలన కామెంట్స్..: అనలిస్ట్ దాము బాలాజీ

0
125

Analist Damu Balaji : రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఎవరివో ఒకరి మనోభావాలు దెబ్బతినాల్సిందే. అందరిలా వర్మ మాట్లాడితే అందులో వెరైటీ ఏముంటుంది. అయితే వర్మ ఏమి మాట్లాడినా నేను చెప్పింది చేయండి అని మాత్రం చెప్పడు. నాకు నచ్చింది నేని చేస్తా, నాకు నచ్చినట్టు నేనుంటా అన్నట్లు వర్మ తీరు ఉంటుంది. తాజాగా వర్మను నాగార్జున యూనివర్సిటీలో అతిధిగా పిలిచి విద్యార్థులకు నాలుగు మంచి ముక్కలు చెప్పమంటే ఏకంగా తిని తాగి ఎంజాయ్ చేయమని భోదించాడు. దీంతో విద్యార్థులకు ఇవేనా చెప్పేది అంటూ చాలా మంది మండి పడుతున్నారు. ఇక ఈ ఇష్యూ మీద వర్మ దగ్గర పనిచేసిన దాము బాలాజీ గారు వర్మ గారి ఆంతర్యం ఏమిటో వివరించారు.

వర్మ తాను చెప్పాలనుకున్నది చెప్పాడు…

నా కోసం మాత్రమే నేను బతుకుతా, నేను ఆరాధించేది కేవలం అందమైన ఆడవాళ్లను మాత్రమే అంటూ ఓపెన్ గా చెప్పే వర్మ గురించి దాము బాలాజీ మాట్లాడుతూ ఆర్జీవి చాలా నాటీ గా ఉంటారంటూ చెప్పాడు. అయితే ఆయన చేసేది చెప్పడు, ఇతరులు తాను ఏది చేస్తున్నాడని అనుకుంటారో అది చెప్తాడని కానీ తాను చేసేది వేరని అభిప్రాయపడ్డారు. వర్మ కు మందు మీద అంత వ్యామోహం ఏమి ఉండదని నేను చాలా దగ్గరగా చూసానని చెప్పారు బాలాజీ. ఇక నాగార్జున యూనివర్సిటీ నుండి బిటెక్ పట్టాను ఇన్నేళ్లకు అందుకున్న వర్మ ఆ విషయం గురించి చెబుతూ ఆ సర్టిఫికెట్ లేకుండానే మొదట్లో జాబ్ చేసానని ఆ తరువాత అదే యూనివర్సిటీ గెస్ట్ గా వచ్చేంత ఎదిగానని కాబట్టి చదువు ముఖ్యం కాదు అంటూ చెబుతూ జీవితం మీకు నచ్చినట్లు బతకాలి అంటూ హితాబోధ చేసాడు.

చనిపోతే స్వర్గంకి వెళ్తాము అక్కడ రంభ ఊర్వశి మేనక తో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారు. నిజంగా వాళ్ళు అక్కడ కనిపించకపోతే అందుకే నేను భూమి మీదే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాను అంటూ చెప్పారు. ఈ విషయాలే ఇప్పుడు వర్మ మీద చాలా మంది గుర్రుగా ఉండటానికి కారణం ఆంటూ దాము బాలాజీ వివరించారు. నిజానికి వర్మ కష్టపడ్డాడు కాబట్టే పైకి వచ్చాడు. ఆ విషయం మర్చిపోయి విద్యార్థులు వర్మ చెప్పిన తినడం తాగడం ఎంజాయ్ చేయడం చేస్తే పోతారు. వర్మ నా మాటలను సీరియస్ తీసుకోండి అని కూడా చెప్పడు కనుక అతని మాటలు సీరియస్ గా తీసుకుంటే పోయేది స్టూడెంట్స్ మాత్రమే అంటూ చెప్పారు దాము బాలాజీ.