Analyst Damu Balaji : పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం కొన్న కొత్తవాహనం వారాహి. ఏపీ పాలిటిక్స్ లో కొంత కాలం ఈ వాహనం గురించి చర్చ బాగా జరిగింది. ఆ వాహనం రంగు ఆర్మీ వాళ్ళ వాహనాల రంగు ఉండటం వల్ల ఆ వెహికల్ ఎలా రిజిస్ట్రేషన్ చేసారంటూ వాదించారు చాలా మంది వైసీపీ నాయకులు. అసలు ఏపీ లో తిరగనివ్వబోము అంటూ కామెంట్స్ చేశారు. అయితే వాళ్ళు తిరగనిచ్చేది ఏంటి అసలు నేను తిరగనంటూ ఆ వెహికల్ ను మూలపేట్టేసారు పవన్. అసలు పవన్ బస్సు యాత్ర ఎపుడు, ఎన్నికలకు పవన్ వ్యూహాలేంటి వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

చంద్రబాబు గేమ్ లో పవన్…
ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతుంటే పవన్ దారి ఇంకా క్లియర్ కాలేదు. పవన్ టీడీపీ తో పొత్తు ఉంటాడో లేక బీజేపీ తో కలిసి వెళ్తాడో, అసలు సీఎం కాండిడేట్ కాదా అనే సందేహాలు చాలా ఉన్నాయి ప్రజలకు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. టీడీపీ తో జరిగిన పొత్తు చర్చల తరువాత పవన్ డీలా పడిపోయాడని, మీరు గతంలో ఒక్క ముప్పై సీట్లు ఇచ్చి గెలిపించి ఉంటే ఇప్పుడు సీఎం సీటు డిమాండ్ చేసుండేవాడిని అంటూ నిరుత్సాహంగా మాట్లాడటం వెనుక టీడీపీని డిమాండ్ చేసే పరిస్థితిలో తాను లేనని చెప్పినట్లైనదంటూ బాలాజీ తెలిపారు.

ఇక లోకేష్ పాదయాత్ర అయిపోయేవరకు పవన్ వారాహి యాత్ర ను చేయకూడదని చంద్రబాబు అదేశించినట్లు అందుకే పవన్ వారాహి ని మూలన పడేసాడని తెలిపారు. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తాయా లేక టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళతాయో వేచిచుడాలని, అయితే జనసేన ప్రధాన అజెండా ఈసారికి జగన్ ను ఓడించడమే కానీ పవన్ తాను సీఎం అవడం కాదని తెలుస్తోందని బాలాజీ తెలిపారు.