Analyst Damu Balaji : సిబిఐ ఛార్జ్షీట్లో జగన్, భారతి పేర్లు… ప్రచారంలో నిజమెంత…: అనలిస్ట్ దాము బాలాజీ

0
113

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలియక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్, ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా ఈ కేసులో జగన్, భారతి పేర్లు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

చార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లు… నిజమేంటంటే…

వివేకానంద హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా కేసులో పురోగతి సాధించలేదు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎంత మందిని విచారించినా అసలు హంతకులు మాత్రం దొరకడం లేదు. తాజాగా ఈ కేసులో జగన్, భారతి ల పేర్లు ఛార్జ్ షీట్లో సిబిఐ వాళ్ళు నమోదు చేసారంటూ టీడీపీ తరుపు మీడియాలో ప్రచారం జరుగుతోందని బాలాజీ తెలిపారు.

మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ కల్లం రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో జగన్ కి భారతి వచ్చి వివేకానంద హత్య గురించి తెలిపిందని చెప్పడంతో జగన్ అలాగే భారతి రెడ్డి లకు వివేకానంద హత్య జరిగినట్లు ఉదయం ఆరు గంటలకు ముందే తెలుసని, అందుకే వారినీ విచారించాలంటూ సిబిఐ భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నా వాటికి ఆధారాలు లేవని బాలాజీ తెలిపారు. నిజానికి టీడీపీ హయాంలోనే వివేకానంద హత్య జరిగింది. ఆ మూడు నెలలు వాళ్లెందుకు కాలయాపన చేసినట్లు, అపుడే విచారణ వేగవంతం చేసి ఉండొచ్చు కదా అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. వివేకానంద కేసులో అసలు దొషులు ఎప్పటికీ బయటికి రారు. న్యాయం జరగాలని కూడా ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ అనుకోవడం లేదు, కేవలం రెండు పార్టీలు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.