Analyst Damu Balaji : కోవెలముడి సూర్యప్రకాష్ రావు గారి అబ్బాయిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రాఘవేంద్ర రావు గారు డైరెక్టర్ గా ఎన్నో హిట్స్ ఇచ్చారు. అందులో ఇండస్ట్రీ హిట్స్ ఎన్నో ఉన్నాయి. ఒక్క ఎన్టీఆర్ తోనే దాదాపు పది హిట్ సినిమాలకు పైనే తీసిన దర్శకేంద్రుడు దాదాపు అందరు హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చారు. తాజాగా ఆయన తన 81 వ జన్మదినాన్నీ జరుపుకున్నారు. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ లో యాక్టీవ్ గా ఉంటూ పలు వెబ్ సిరీస్ లను తీస్తూ మరోవైపు కొత్త దర్శకులకు తన అనుభవాలను చెబుతూ ఉన్న రాఘవేంద్ర రావు గారి గురించి పలు ఆసక్తికర విషయాలను జర్నలిస్ట్ దాముబాలాజీ పంచుకున్నారు.

తన సినిమాల్లో కథ ఉండదు…..
రాఘవేంద్ర రావు గారి సొంతూరు గుడివాడ దగ్గరి పల్లె. ఆయన తండ్రి కోవెలమూడి సూర్యప్రకాష్ గారు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా మంచి సినిమాలను చేసారు. ఇక బిఎ వరకూ చదివిన రాఘవేంద్రరావు గారు కూడా ఆయన తండ్రి లాగా డైరెక్టర్ అవ్వాలని అనుకున్నా దాదాపు పదిహేనేళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసారు. చాలా మంది దర్శకుల కింద పనిచేసిన ఆయన తొలి సినిమా ‘బాబు’ అంటూ దాముబాలాజీ వివరించారు.

ఇక ఆయన వెంకటేష్ తో తీసిన సుభాష్ చంద్రబోస్ సినిమాకు తాను అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసినపుడు రాఘవేంద్ర రావు గారితో పనిచేసానని బాలాజీ తెలిపారు. తెలియని విషయాన్ని చిన్నవారు చెప్పినా ఆయన వింటారని ఆయన సినిమాల్లో పెద్దగా కథ ఉండదని ఆయనే అంటుంటారని చెప్పారు. ఆయన కొడుకు సినిమా ‘మార్నింగ్ రాగా’ సినిమాకు రివ్యూ రాయమని చెప్పారు. తప్పులను కూడా చెప్పామన్నారు. రాసి ఇస్తే ఇంగ్లీష్ లో రాసి తన కొడుకుకి ఇవ్వాల్సిందిగా తెలిపారు అలా విమర్శలను ఆయన చాలా బాగా స్వీకరిస్తారు. ఇండస్ట్రీ కి ఎంతోమంది హీరోలను పరిచయం చేసారు. అలానే రాజమౌళిని ఇండస్ట్రీ కి పరిచయం చేసింది రాఘవేంద్ర రావు గారే అంటూ చెప్పారు బాలాజీ.