Featured

Analyst Damu Balaji : జగన్ కు సుప్రీంలో షాక్… వివేకానంద కేసులో ఏం జరగబోతోంది…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద కేసులో ఊహకందని మలుపులు అలాగే డైలీ సీరియల్ ను తలపించేలా కొత్త వ్యక్తులు వస్తూనే ఉన్నారు. తాజాగా సుప్రీం కోర్టుకు చేరిన ఈ హత్య కేసులో సిబిఐ సీల్డ్ కవర్ లో కొన్ని కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించబోతోంది అనే వార్తలను నడుమ జగన్ కు ఈ కేసులో చుక్కెదురు కాబోతోందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటి మీద అనలిస్ట్ బాలాజీ ఆయన విశ్లేషణ అందించారు.

సుప్రీం కోర్టులో ఏం జరగనుంది…

సిబిఐ ఇప్పటికే గడువు తీసుకుని తన విచారించిన విషయాలను సీల్డ్ కవర్ లో అందిస్తానని న్యాయ స్థానం ఎదుట చెప్పింది. మరోవైపు సునీత అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో సుప్రీం కోర్ట్ తలుపు తట్టడంతో ఆ బెయిల్ పిటిషన్ విచారణ జులై 3 న ఉండనుండటంతో అదే రోజు సిబిఐ కూడా తన విచారణ పత్రాలను మొత్తం కోర్ట్ ముందు పెట్టొచ్చని బాలాజీ తెలిపారు.

ఇక కేసులో మరో ఇద్దరు కొత్త వ్యక్తులను ముద్దాయిలుగా చేర్చుతోంది సిబిఐ అనే మాట వినిపిస్తోంది. జగన్, ఆయన సతీమణి భారతి పేర్లు కొన్ని మీడియా వర్గాలు సిబిఐ సీల్డ్ కవరర్లో ఉండొచ్చని చెబుతుండగా ఒకవేళ ఉన్న ఆ పేర్లు బయటికి రాకుండా విచారణ జరపాలని సిబిఐ భావిస్తున్నట్లు బాలాజీ అభిప్రాయపడ్డారు. అందుకే కోర్ట్ కి సీల్డ్ కవర్ లో విచారణ పత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు.

Bhargavi

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

4 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

4 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

4 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

5 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

5 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

5 hours ago