అనిల్ అంబానీ… మొత్తం పోగొట్టుకున్నాడా? అన్న ఆదుకోకపోతే జైలుకు వెళ్లాల్సిందేనా?

0
300

ఒకప్పుడు ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో వినపడే పేరు “టాటా”. అదే కోవలో ఇప్పుడు వినిపిస్తున్న మరో పేరు “రిలయన్స్” అంబానీ బ్రదర్స్. అంబానీ బ్రదర్స్ ఆస్తి మొత్తం వేల కోట్ల ఆస్తి.. ప్రస్తుతం వారు అడుగు పెట్టని రంగం లేదు… అయితే ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే… ఇక్కడ మరో వైపు అప్పులు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అంబానీ బ్రదర్స్ లో ఒకరైన అనిల్ అంబానీ గురించి. ఒకప్పుడు అన్న ముఖేష్ అంబానీ ఆస్తులతో సమానంగా ఉండేవి ఈయన ఆస్తులు. అయితే ప్రస్తుతం అనిల్ అంబానీ ఆస్తులు కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలి అంటే అయన అన్న ముఖేష్ అంబానీ ఆస్తులు పెంచుకుంటూ ఉంటే.. అనిల్ అప్పులు పెంచుకుంటున్నాడు. చైనా బ్యాంకులకు అనిల్ అంబానీ భారీగా ఆప్పునట్టు తెలుస్తుంది. చైనా బ్యాంకులకు 2012లో 4900 కోట్లు అప్పన్నట్టు తెలుస్తుంది. తాజాగా అనిల్ అంబానీ మొన్న కోర్టుకు అయన “నా ఆస్తులకు, అప్పులకు లెక్క సరిపోతుంది.. ఇక నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు” అని అయన సమాధానం ఇచ్చారు. నా పెట్టుబడులు అన్ని పోయాయి. నా ఆస్తులన్నీ కలిపితే 82.4 మిలియన్ డాలర్లు.. నేను కట్టాల్సిన అప్పులు కూడా ఇంచుమించు అంటే ఉన్నాయి. ఇక నాదగ్గర ఏమి మిగిలి లేవని తేల్చి చెప్పారు.

2002లో అతని తండ్రి ధీరుభాయ్ అంబానీ మరణించాక, అనిల్ అంబానీ రిలయన్స్ సంస్థల్లో టెలికాం, వినోద రంగం, ఆర్థిక సేవలు, విద్యుత్తు, మౌలిక వసతులు వంటి విభాగాల పగ్గాలు చేపట్టాడు. 2008లో అనిల్ రిలయన్స్ పవర్ సంస్థ షేర్లు పబ్లిక్ ఇష్యూ విడుదల చేసినప్పుడు అది అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించింది. అది కేవలం 60 సెకన్లలో ఆశించిన మేరకు సబ్ స్క్రిప్షన్ సాధించి ఆ రకంగా కూడా చరిత్ర సృృష్టించింది. అనిల్ అంబానీ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ కు చెందిన డ్రీమ్ వర్క్స్ స్టూడియోస్ సంస్థలో 2009 లో 825 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాడు. దాంతో అంతర్జాతీయ వినోద రంగంలో భారీ పెట్టుబడిదారుగా రూపొందాడు. భారత్ లో కూడా బాలీవుడ్ సినిమాల్లో పెద్ద పెట్టుబడిదారుల్లో ఆయన ఒకరు. 44 ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు, దేశవ్యాప్త డీటీహెచ్ కనెక్షన్లు, యానిమేషన్ స్టూడియోలు, పలు మల్టీప్లెక్స్ సినిమా హాళ్లను ఆయన సంస్థలు నిర్వహిస్తున్నాయి.

తన అన్న ముఖేష్ అంబానీ సంస్థ అయిన జియో ఇన్ఫోకాం 4జీ టెలికాం సేవలు ప్రవేశపెట్టే ముందు 2013 లో అనిల్ తన రిలయన్స్ కమ్యూనికేషన్స్. సంస్థ ద్వారా రెండు భారీ టెలికాం టవర్లు లీజుకివ్వడానికి 2.1 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అప్పటికే అనిల్ సంస్థలన్నీ దాదాపుగా అప్పుల్లో కూరుకుపోయాయి. అనిల్ అంబానీకిి ఒక సొంత జెట్ విమానం , ( ఫాల్కన్ 7ఎక్స్ ) ఉంది. లాంబోర్గినీతో సహా పలు లగ్జరీ కార్లున్నాయి. తన భార్య , గతంలో సినిమా నటి అయిన టీనా మునిమ్ కు ఒక సూపర్ లగ్జరీ యాట్ (విలాసవంతమైన పెద్ద పడవ) ని బహుమానంగా ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here