భారత్ లో కరోనా తీవ్రత పెరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.. ప్రస్తుతం సెకండ్ వేవ్ తీవ్రత కొన్ని రాష్ట్రాలలో అధికంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపద్యంలో మన దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

రష్యా అభివృద్ధి చేసిన “స్పుత్నిక్ వి” టీకా అత్యవసర వినియోగంపై కేంద్ర నిపుణుల కమిటీ భేటీ కాఉంది. ఈ భేటీ తరువాత కమిటీ ఈ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరి కొద్ది రోజుల్లోనే కేంద్రం అనుమతులు లభించే అవకాశం ఉంది.

అయితే ఈ టీకాను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేస్తుంది. 2,3 దశ క్లీనికల్ టెస్టులు నిర్వహించింది. తోలి డోసు తీసుకున్న 21 రోజులకు రెండో డోసు తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here