సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్ ఇచ్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ స్కూళ్లు టీచర్లకు వృత్తికి సంబంధం లేని పనులు చెప్పవద్దని, ప్రైవేట్ స్కూళ్లు టీచర్లను అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఇళ్లకు పంపించవద్దని సూచించింది.

జగన్ సర్కార్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాధారణంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు టీచర్లకు టార్గెట్ విధించి మరీ టీచర్లు ఇంటింటికీ తిరిగి విద్యార్థులను స్కూళ్లలో చేర్పించాలని చెబుతూ ఉంటాయి. టీచర్లు అలా చేయకపోతే వేతనాల్లో కోత విధించడం లేదా వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించడం చేస్తూ ఉంటాయి. కొందరు టీచర్లు ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో విద్యాశాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

ప్రభుత్వ ఆదేశాల వల్ల ఇకపై పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు సంబంధం లేని పనులను చెప్పకూడదు. ఉపాధాయులను బలవంతంగా విద్యార్థుల ఇళ్లకు పంపినా లేదా ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చాలంటూ వచ్చినా అలాంటి పాఠశాలలపై విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. మరోవైపు జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోనుంది.

జగన్ సర్కార్ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. నాడు- నేడు ద్వారా జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చేందుకు అడుగులు వేస్తోంది. అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన స్కీమ్ ల ద్వారా జగన్ సర్కార్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.