నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రూటే సపరేటు. అయన పెర్ఫర్ర్మెన్స్, అయన మాటలు అబ్బో అసలు ఆపడం ఎవరితరం కాదుగా… అయన జనరల్ గా మాట్లాడితేనే కొంచెం అతిగా మాట్లాడుతారు. అదే ఇంకా మెగా ఫామిలీ గురించి అయితే చెప్పక్కర్లేదులెండి. మీరు ఇదివరకే చూసారుగా.. వినేవాళ్ళు ఉండాలి కానీ జనాల చెవుల్లో మ్రోత మ్రోగించేస్తారు. అయన మామూలుగానే మెగా అభిమాని, ఇక మెగాస్టార్, పవర్ స్టార్ ముందు స్టేజి మీద మాట్లాడాల్సి వస్తే మాత్రం ఇక అయన అభిమానాన్నీ చాటుకోవడానికి చేయాల్సిన భజన మొత్తం చేస్తాడు. 7’O క్లాక్ బ్లేడుతో పీక కోసుకునేంత అభిమానాన్ని అందరికి చూపిస్తాడు. అయితే ఇప్పుడు ఈయన భజన ట్విట్టర్ లో కూడా మొదలెట్టేసాడండోయ్. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మీద డైలాగులు ట్వీట్ల రూపంలో అభిమానులతో అయన అభిమానాన్ని పంచుకున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే.. పింక్ రీమేక్ “వకీలు సాబ్” సినిమాతో వస్తున్న పవన్. మరో పక్క సినిమాల మీద సినిమాలు సైన్ చేసుకుంటూ జోరు పెంచారు. వకీల్ సాబ్ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం పవన్ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో క్లిన్ షేవ్ తో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఇక పవన్ కొత్త లుక్ చుసిన బండ్ల గణేష్ వెంటనే ట్విట్టర్లో భజన ప్రోగ్రాం మొదలుపెట్టాడు. పవన్ ఫోటో షేర్ చేస్తూ ఒక్కో ఫొటోకు ఒక్కో వ్యాఖ్యాన్ని జోడిస్తూ తన పవన్ పై తన అభిమానాన్ని వీర లెవల్ లో చాటుకున్నాడు. “కళ్ళల్లో కసి ముక్కు మీద పౌరుషం మీసం లో నిజాయితీ నీ సొంతం బాస్⁦” , “అడిగితే ఇచ్చేది ప్రసాదం పూజిస్తే వచ్చేది వరం నాకు కావాల్సింది వరం లాంటిది జీవితం అది తప్పకుండా వస్తుంది” అంటూనే మరో ట్వీట్ “దేవుని అడగకూడదు తప్పు ! కోరుకోవాలి అప్పుడే కోరిక తీరుతుంది…………………⁦” అంటూ తన ట్విట్టర్ లో బండ్ల గణేష్ ట్వీట్ చేసారు.

ఇంతటితో ఆగలేదు అయన కన్సన్ట్రేషన్ మెగాస్టార్ చిరంజీవి మీదకి మళ్లింది. “ఏ బ్రహ్మ ముహూర్తం అడుగుపెట్టే రో . కానీ మీ అడుగు వెయ్యి సంవత్సరాల పునాది అని ఎవరూ ఊహించలేదు.. అది మీ అదృష్టం కాదు మా అదృష్టం సినీ పరిశ్రమ అదృష్టం కొన్ని లక్షల కుటుంబాలు అదృష్టం జై చిరంజీవ⁦.. ఒక్కరా ఇద్దరా ఎంత మంది మీ పేరు చెప్పుకొని అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు అనుభవిస్తున్నారు అన్నయ్య మీకు మీరే పోటి జై చిరంజీవ. అంటూ ఫోటో ఫోటోకో ట్వీట్ చేస్తూ చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

బండ్ల చేస్తున్న ఈ కామెంట్లపై నెటిజన్లు ఆపవయ్యా బాబు నీ భజన అంటూ కామెంట్లు చేస్తున్నా అయన పట్టించుకోలేదు. “ఇక నువ్వు ఎన్ని బిస్కెట్స్ వేసిన నీకు ఛాన్స్ ఇవ్వరులే బ్లెడ్ గణేష్ అన్నా.. ఇక వేరే కాంపౌండ్ లో బిస్కెట్స్ వేసుకో”, “7’o clock blade tho గడ్డం గీసుకున్నడేమో బండ్ల”, “అభిమానం చూపించడంలో నీ తరువాతే ఎవరైనా. బండ్లన్నా …❤️❤️😍” అంటూ నెటిజన్లు ట్వీట్ ట్వీట్ కి కామెంట్లు చేస్తూనే ఉన్నారు. నెటిజన్లు ఎంతగా ట్రోల్ చేస్తున్న బండ్ల తన పని తాను చేసుకుంటూ పోయారు. పవన్ పై తన అభిమానాన్ని చాటుకుంటూ “అభిమానం కృతజ్ఞత బ్లడ్ లో ఉండాలి అది బండ్ల బ్లడ్ లో ఫుల్లుగా ఉంది జై జై మెగా పవర్” అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here