Connect with us

Featured

Ntr: జీవితం చాలా విలువైనది.. రండి నాతో చేతులు కలపండి: ఎన్టీఆర్

Published

on

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా విడుదలకు మరొక రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు.

Advertisement

తెలంగాణలో సినిమాకు అదనపు షోలు రావాలన్నా లేదంటే టికెట్ల రేట్లు పెంచాలన్న కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కండిషన్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే. సినిమా విడుదలకు ముందు ఆ సినిమాలో నటించిన నటీనటులు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఒక వీడియోని చేస్తూ అందరిలో చైతన్యం కలిగేలా చేయాలంటూ కండిషన్ పెట్టారు.

ఇక దేవర సినిమాకి తెలంగాణలో ఆదరణ పశువులు పెంచడం అలాగే టికెట్ల రేట్లు కూడా పెంచడంతో డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఒక వీడియోను విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూమన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో, సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ అనో మాదక ద్రవ్యాల బారిన పడటం చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే చాలా విలువైనది. రండి, నాతో చేతులు కలపండి.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం..

Advertisement

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యులు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ వినియోగించటం కానీ చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో 8712671111 కు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Elections 2024: ఈవీఎం ఎన్నికలు అయితే పోటీ చేయను.. వైకాపా మాజీ ఎమ్మెల్యే కామెంట్స్!

Published

on

Elections 2024: ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల విషయంలో ఎన్నో గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఏదో తప్పు జరిగిందని ఎంతోమంది సందేహాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈవీఎం ట్యాంపర్ అయ్యాయి అంటూ కూడా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేశారు.

Advertisement

ఇకపోతే వచ్చే ఎన్నికలలో కూడా ఈవీఎం ద్వారా ఎన్నికలు జరిగితే తాము ఎన్నికలలో పోటీ చేయమని పలువురు వైకాపా మాజీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తాజాగా వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన స్టేట్మెంట్ అందించారు.

2024 లో జరగబోయే ఎన్నికలలో కూడా ఈవీఎం ద్వారానే ఎన్నికలు జరిగితే తాను ఎన్నికలలో పోటీ చేయనని ఈయన తెలిపారు. ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే చంద్రబాబు అండ్ బ్యాచ్ మరోసారి మోసానికి పాల్పడుతుందని అలాంటప్పుడు పోటీ చేసిన ప్రయోజనం ఉండదని రాచమల్లు తెలిపారు.

ఈవీఎం ట్యాంపరింగ్..
ఇటీవల మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటూ పలు ప్రాంతాలలో పోలైన ఓట్ల అసమానతులను చూపిస్తూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో కూడా ఈవీఎంలను ఉపయోగిస్తే మరోసారి మోసమే జరుగుతుందని ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: నాకు ఏ హీరోతో పోటీ లేదు… పవన్ నోట అల్లు అర్జున్ మాట?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన పల్లెకు పండగ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ పల్లెకు పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పలు విషయాలను వెల్లడించారు.

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమానికి వెళ్లిన అభిమానులు పెద్ద ఎత్తున ఈయన సినిమాల గురించి అప్డేట్స్ కావాలి అంటూ గోల చేస్తూ ఉంటారు.. ఇక పల్లెకు పండుగ కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు ఓజీ సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

అభిమానులు ఇలా తన సినిమా గురించి అడగడంతో పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను తన బాధ్యతలకే ప్రాధాన్యత ఇస్తానని బాధ్యత తరువాతే వినోదం అంటూ చెప్పుకువచ్చారు. అనంతరం ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో నాకు ఎవరితోనో పోటీ లేదు ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ చిరంజీవి బాలకృష్ణ మహేష్ బాబు వంటి వారందరూ కూడా ఎంతో నైపుణ్యం ఉన్నవారు అని తెలిపారు.

హీరోలు బాగుండాలి..
అందుకే నాకు ఎవరితో పోటీ లేదు. వారందరూ కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవాలి వారంతా బాగుండాలని కోరుకున్నారు. సినిమా ఇండస్ట్రీ బాగుంటేనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ పేరు కూడా ప్రస్తావనకు తీసుకురావడంతో ఈ కామెంట్స్ సంచలనగా మారాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Sree Vani: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బుల్లితెర నటి శ్రీవాణి… ఏం జరిగిందంటే?

Published

on

Sree Vani: బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రీవాణి అందరికీ ఎంతో సుపరిచితమే. చంద్రముఖి సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమె ప్రస్తుతం పలు సీరియల్స్ లో విలన్ పాత్రలలో తల్లి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.

Advertisement

ఇలా నిత్యం తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని శ్రీవాణి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని తన భర్త విక్రమాదిత్య యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈమె గుంటూరు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత మూడు రోజుల క్రితం శ్రీ వాణి తన తల్లితో కలిసి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయింది.

తన ఫ్యామిలీతో కలిసి చీరాల బీచ్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రమాద సమయంలో శ్రీవాణి నుదిటిపై పెద్ద గాయం తగలడమే కాకుండా మరోవైపు చెయ్యి కూడా ఫ్యాక్చర్ అయినట్టు విక్రమాదిత్య తెలిపారు. ఇక నుదుటిపై కుట్లు వేయాలని వైద్యులు చెప్పడం తనకు ప్లాస్టిక్ సర్జరీ చేయమని చెప్పిన, ప్లాస్టిక్ సర్జరీ చేయడం సాధ్యం కాదని కుట్లు వేసినట్టు వెల్లడించారు.

నుదుటిపై తీవ్రగాయం..
ఇలా తన భార్యకు జరిగిన ప్రమాదం గురించి ఈయన ఒక వీడియోని షేర్ చేయడమే కాకుండా తాను తొందరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ దీవించండి అంటూ విక్రమాదిత్య శ్రీవాణికి జరిగిన రోడ్డు ప్రమాదం గురించి వెల్లడించడంతో అభిమానులు కూడా కంగారు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!