Bengaluru Padma : నా కూతురికి చెప్పింది ఒకటి చేసింది ఒకటి… అన్నీ అపద్ధాలే…: నటి బెంగళూరు పద్మ

0
184

Bengaluru Padma: సీరియల్స్ లోనూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ సుపరిచితురాలైన బెంగళూరు పద్మ గారు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. జీ తెలుగులో వచ్చే ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటించిన ఆమె ప్రస్తుతం ఏ ప్రొజెక్ట్ చేయకుండా వ్యక్తిగత జీవితంలో చాలా బిజీగా ఉన్నారు. పద్మ గారి కూతురు గాయత్రి కూడా నటి. హ్యాపీడేస్ సినిమాలో అప్పు గా నటించి మంచి గుర్తింపు అందుకుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పద్మ గారు ఇండస్ట్రీలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నా కూతురు అందుకే సినిమాలను మానేసింది…

బెంగళూరు పద్మ గారి కూతురు గాయత్రి , అలాగే భర్త అరుణ్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా హ్యాపీ డేస్ లో నటించారు. ఆ సినిమాలో గాయత్రి అప్పుగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆ సినిమా తరువాత కొన్ని చేసినా అవేవీ ప్రేక్షకులకు తెలియదు. అయితే మళ్ళీ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో హారతి పాత్రలో నటించింది. అయితే ఆ పాత్ర మొదట డైరెక్టర్ చెప్పినపుడు అలా లేదట.

కానీ సినిమా తీసాక ఆ క్యారెక్టర్ నచ్చలేదని తన పాత్ర చెప్పేటపుడు ఒకలాగ సినిమా షూటింగ్ లో ఒకలాగ మార్చేయడంతో గాయత్రికి ఇక సినిమాల మీద ఆసక్తి పోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది అంటూ పద్మ తెలిపారు. కథ చెప్పెటపుడు మీ పాత్ర చుట్టే జరుగుతుంది అంటూ చెప్తారు కానీ సినిమా చూస్తే అలా ఉండదు, అన్నీ అపద్ధాలే అంటూ చెప్పారు పద్మ. ప్రస్తుతం గాయత్రి ఆస్ట్రేలియా లో ఎమ్మెస్ చేసి హ్యాపీగా అక్కడే ఉంది అంటూ చెప్పారు.