బాలయ్యతో ఆ సీన్ చేయాల్సింది కాదు.. దాని వల్ల నవ్వుల పాలయ్యాం..!! డైరెక్టర్ బి.గోపాల్

0
342

నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ కుమారుడుగానే కాకుండా స్వతహాగా తన ప్రతిభ కనపరిచి విజయాలు సొంత చేసుకుని తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాడు నందమూరి బాలకృష్ణ. ఫ్యాక్టన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా బాలకృష్ణ ఎప్పుడో గుర్తింపు తెచ్చుకున్నాడు. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బి.గోపాల్ కలిసి 5 సినిమాలు చేశారు. వీళ్లిద్దరి డైరెక్షన్లో చేసిన 5 సినిమాలో 4 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అందులో ఒక చిత్రం “పల్నాటి బ్రహ్మనాయుడు” మాత్రం వీళ్లిద్దరి పరువు తీసేసింది. ఈ సినిమా సక్సెస్ కంటే ఈ సినిమా వల్ల అందరూ నవ్వుల పాలు అయ్యారు, ఎక్కువ అతి సీన్స్ ఉండటం వల్ల అప్పట్లో ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అంతే కాకుండా “జై బాలయ్య” అనే నినాదం కూడా అప్పుడే వచ్చిందని చెప్పొచ్చు.

ఈ చిత్రంలో అతి సీన్స్ తీసి నేనే తప్పు చేశాను అని, ఇందులో రైట్టర్స్ తప్పేమీ లేదని, బాలయ్య బాబు బంగారం అని ఎది చెప్తే అది డైరెక్టర్ నీ నమ్మి గుడ్డిగా చేస్తాడు అని డైరెక్టర్ బి.గోపాల్ ఇప్పుడు ఆచిత్రం గురించి చెప్పుకొచ్చారు. అందులో ముఖ్యంగా తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళడం, విలన్ కూర్చున్న కుర్చీ ముందుకు రావడం, కోడి పుంజు విలన్నీ చంపేయడం వంటి అతి సన్నివేశాలు బాలయ్య ఫ్యాన్స్ నీ భయపెట్టాయి. ఈ సీన్స్ గురించి బాలయ్య కూడా “ఆ సీన్స్ చేయడానికి ఎలా ఒప్పుకున్నన్నో నాకే తెలియదు” అని ఒక ఇంటర్వూ లో చెప్పారు. వాటి వల్ల ఇండస్ట్రీ లో విమర్శలకు గురి అయ్యారు ఈ చిత్ర యూనిట్. ఆసీన్స్ తీయకుండా ఉంటె బాగుండు నీ ఇప్పుడు బాధ పడుతున్నారు ఈ డైరెక్టర్ గారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు బాధపడి ఎం లాభం బి గోపాల్ గారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here