తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రేంజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే.. దేశవ్యాప్తంగా ఈ షో కి ఉన్న క్రేజ్ ఏ షో కి లేదు.. సీజన్ ల పరంగా వస్తున్న ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.. తెలుగులో నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ కి ఏర్పాట్లు చేసుకుంటుంది. బాలీవుడ్ లో అయితే 14 వ సీజన్ కంప్లీట్ చేసుకుంటుంది. అన్ని భాషల్లో ఇన్నేసి సీజన్లు పూర్తి చేసుకుంది అంటే బిగ్ బాస్ షో క్రేజ్ ఏ లెవెల్లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. తెలుగులో ఇప్పటివరకు ముగ్గురు హోస్ట్ లు మారిపోయారు. తొలి సీజన్ కు ఎన్టీఆర్, రెండో సీజన్ కు నాని, మూడోవ, నాలుగోవ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా చేశారు. ఇక ఇటీవలే నాల్గో సీజన్ అయిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ల అల్లరి మాత్రం తగ్గడమే లేదు.

సోషల్ మీడియా లో వారు పెట్టె పోస్ట్ లు చూస్తుంటే ప్రేక్షకులు తమని మర్చిపోకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు అనిపిస్తుంది. ప్రస్తుతం ఐదో సీజన్ కు రంగం సిద్ధం అవుతుంది. దీనికోసం అప్పుడే సెలెక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొందరిని బుక్ చేసుకున్నారని.. వారికి భారీగా డబ్బులు ముట్టజెప్పుతున్నారని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశాడు. ఇక మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేసింది తెలిసిందే. ఈ సీజన్‌ను ఏప్రిల్‌లోనే స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. దీంతో ఈ సారి నాగార్జున అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

ఇంతకు ముందే కమిట్ అయినా సినిమాల కారణంగా నాగార్జున ఈ ఐదవ సీజన్‌ను హోస్ట్ చేయడం కుదరదట ఈ సారి. నాగార్జున చేయాల్సిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో పాటు సూపర్ హిట్ సినిమా మనంకు కూడా సీక్వెల్ రాబోతోందట. దీంతో ఆయన ఈ సీజన్‌కు రాకపోవచ్చని.. తాను సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సారి యువ హీరో గతంలో బిగ్ బాస్ రెండవ సీజన్‌ను హోస్ట్ చేసిన నాచురల్ స్టార్ నానిని బిగ్ బాస్‌ యాజమాన్యం సంప్రదించిందని తెలిసింది. అంతేకాదు నాని కూడా ఐదవ సీజన్‌ ను హోస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here