Bigg Boss 8 Telugu: తెలుగులో ఇటీవలె వలే గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు చూస్తుండగానే అప్పుడే ఐదవ వారం ఎలిమినేషన్ కు దగ్గర పడింది. నాలుగు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదవ వారం ఎలిమినేషన్ ప్రక్రియకు చేరువయ్యింది. ఇక ఇప్పటికే హౌస్ లో నుంచి నలుగురు కంటెస్టెంట్లు ఎప్పటిలాగే ఎలిమినేట్ అవ్వగా నిన్నటి రోజున అనగా శుక్రవారం రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మరోసారి సందడి చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో మణికంఠతో పులిహోర కలిపింది యష్మీ.
Advertisement
నిన్న మొన్నటి దాకా ఈ ఇద్దరి మధ్య అస్సలు పడేది కాదు. ఎలాగైనా మణికంఠను హౌస్ నుంచి బయటకు పంపాలని చూసింది యష్మీ. కానీ ఇప్పుడు ప్లేట్ తిప్పేసింది. మణికంఠకి నేనున్నా అంటూ భరోసా ఇచ్చింది యష్మీ, నీ నవ్వు చూసే నీకు పడిపోయా అంటూ మణికంఠకు డైలాగ్స్ కొట్టింది యష్మీ. నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా ఆదిత్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ యష్మీ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆదిత్య గారు నన్ను ప్రేరణను ఎంత తిట్టుకున్నారో, మేమిద్దరమే నామినేట్ చేశాం అని చెప్పుకొచ్చింది. ఇంతలో అక్కడికి పృథ్వీ వచ్చి ఏరా డల్‌గా ఉన్నావంటూ యష్మీని అడిగితే, నేనే నామినేట్ చేశాను కదా ఆదిత్య గారిని, దాని గురించే బాధ అని చెప్పింది.
సర్లే ఫీల్ అవ్వకు అని పృథ్వీ అనగానే నువ్వు హ్యాపీయే కదా విష్ణు ఉంది అంటూ సెటైర్లు వేసింది యష్మీ. ఆ తర్వాత హౌస్ మేట్స్ అంతా కలిసి మణికంఠ మీద పడ్డారు. ఫస్ట్ విష్ణుప్రియ స్టార్ట్ చేసింది. అక్కడ మా టెన్షన్ లో మేముంటే అప్పుడు కూడా కెమెరాలన్నీ వీడి వైపే ఉండాలి వీడినే అందరూ ఓదార్చాలి అన్నట్లుగా ఏడు పొకటి మొదలు పెట్టాడు అని మణికంఠను ఉద్దేశించి విష్ణుప్రియ అంది. దాంతో మనోడు ఎప్పటి లానే సమాధానం చెప్పాడు. ఏమో నాకు అంతా బ్లాంక్ అయ్యింది రా అని అన్నారు మణి. సైరన్ మోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని నువ్వే చెప్పావంటగా ఇంకెందుకు బ్లాంక్ అయ్యావ్? అని నబీల్ అన్నాడు.
ఎందుకలా బిహేవ్ చేస్తావ్ అంటూ..
Advertisement
ఇంతలో సీత అందుకొని ఎందుకు నువ్వు మాటి మాటికి అందరూ నిన్ను ఓదార్చాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తావ్? అని అడిగింది. దాంతో సైలెంట్ గా మణి పక్కకు వెళ్ళిపోయాడు. మణికంఠ వెళ్ళిపోయినా తర్వాత మనం ఇంత అర్థం చేసుకున్నా వాడెందుకు మనల్ని అర్థం చేసుకోవట్లేదు.. అందరితో గొడవ పెట్టుకొని.. తిట్టేసి, తర్వాత వాడు కెమెరా ముందుకొచ్చి ఏడుస్తాడు. దాని వల్ల మనం బ్యాడ్ అవుతాం అని సీత చెప్పుకొచ్చింది. దీంతో మొత్తంగా చూసుకుంటే నిన్నటి రోజున జరిగిన ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ మణికంఠను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అసలు మణికంఠ ఎందుకు ఏడుస్తున్నాడు అన్నది అర్థం కాక హౌస్ మేట్స్ అతని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.
Divvela Madhuri: వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి వ్యవహారం ఏ స్థాయికి వెళ్ళిందో మనకు తెలిసిందే. కట్టుకున్న భార్య పిల్లలను వదిలేసిన దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలిసి సహజీవనం చేయడమే కాకుండా తాము త్వరలోనే పెళ్లి చేసుకుంటామని మాకు కొడుకు పుడితే దువ్వాడ జగన్ అని పేరు పెట్టుకుంటాము అంటూ బహిరంగంగా తెలిపారు.
Advertisement
ఇలా దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు సందర్భంగా మాధురి దువ్వాడ శ్రీనివాస్ కు ఖరీదైన బహుమతిని అందజేశారు. దువ్వాడ శ్రీనివాస్ ఆయన సన్నిహితులు శ్రేయోభిలాషులతో కలిసి ఈ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా దువ్వాడ శ్రీనివాస్ కి ఖరీదైన చేతి వాచీని మాధురికి కానుకగా ఇచ్చారు. ఈ వాచ్ ఖరీదు సుమారు రెండు లక్షల విలువ చేస్తుందని తెలుస్తోంది. ఇలా ఖరీదైన వాచ్ ఇవ్వడమే కాకుండా స్వయంగా మాధురి ఆ వాచ్ ని శ్రీనివాస్ చేతికి తోడిగారు.
2 లక్షలు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరి బంధం గురించి బయటకు రావడంతో వీరిద్దరూ ఎంతో బహిరంగంగా తమ గురించి పలు విషయాలను తెలపడమే కాకుండా ఎన్నో ఇంటర్వ్యూలలో జంటగా పాల్గొంటున్నారు అలాగే దీపావళి వేడుకలను కూడా ఇటీవల ఎంతో ఘనంగా జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ ఆస్తులకు సంబంధించిన వాటిలో సరస్వతి పవర్ భూములు కూడా ఒకటి. ఈ భూమి గురించి వైయస్ జగన్ షర్మిల మధ్య పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సరస్వతి పవర్ భూములను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు.
Advertisement
తాజాగా పలనాడు జిల్లాలో ఉన్నటువంటి సరస్వతి భూములను పరిశీలించిన పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరస్వతీ పవర్ భూములను వైయస్ హయామంలో ఉన్నప్పుడు ప్రజల వద్ద నుంచి సేకరించారని తెలిపారు. ఆ సమయంలో తమ భూములను కంపెనీ కోసం ఇస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వైఎస్ భూములను తీసుకున్నారు.
తమ భూములను ఇవ్వని రైతులపై పెట్రో బాంబులు వేసి మరి బెదిరించి భూములను లాక్కున్నారని పవన్ తెలిపారు. ఇలా కంపెనీ కోసం రైతుల నుంచి భూములు లాక్కోవడమే కాకుండా సుమారు 300 ఎకరాల అటవీ భూములను కూడా ఆక్రమించారని వాటన్నింటినీ కూడా తమ సొంత ఆస్తిగా మార్చుకున్నారని సంచలన విషయాలు వెల్లడించారు.
రైతులకు న్యాయం చేయలేదు.. ఇలా ప్రజల వద్ద భూములను లాక్కొని ఇప్పటికి వారికి న్యాయం చేయలేదని, ఈ ఆస్తి కోసమే ఆ అన్న చెల్లెలు కొట్టుకుంటున్నారని పవన్ తెలిపారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ఇంకా ఎన్ని దోపిడీలు జరిగేవో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దోపిడీని అడ్డుకున్నామని ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు.
Suriya: సినీ నటుడు సూర్య కంగువ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ సూర్యను వేదికపైకి ఆహ్వానిస్తూ నేను సింహం అయితే అతను సింగం, నేను లెజెండ్ అయితే అతను గజినీ, నేను అఖండ అయితే అతను రోలెక్స్ అంటూ సూర్యకు అదిరిపోయే ఇంట్రో ఇచ్చారు.
Advertisement
బాలయ్య ఆ తర్వాత సూర్యతో సరదా మాట్లాడుతూ తికమక పెట్టే ప్రశ్నలు అడిగారు అనంతరం తన తమ్ముడు కార్తీ ఫోన్ నెంబర్ ను తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నారో అడిగారు అలాగే తన తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడారు. మీ అన్న ఇక్కడ అన్ని అబద్ధాలే చెబుతున్నారని చెప్పగా చిన్నప్పటినుంచి అంతే అంటూ కార్తి సెటైర్లు వేశారు. అలాగే ఓ నటి అంటే ఆయనకు చాలా ఇష్టం సార్ అని కార్తీ అంటే.. వెంటనే సూర్య నువ్వు కార్తీ కాదు రా.. కత్తి అని డైలాగ్ వేశారు.
ఇక సూర్య నటుడిగా మాత్రమే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈయన తన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులని చదివించారు అయితే ఓ అమ్మాయి వీడియోని ఇక్కడ ప్లే చేయడంతో తను చెప్పిన మాటలకు సూర్య ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సూర్య గారి వల్ల తాను చదువుకున్నానని అమ్మాయి చెప్పడంతో సూర్య ఎమోషనల్ అయ్యారు.
చారిటబుల్ ట్రస్ట్.. బాలకృష్ణ కూడా నాకు కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఇక తమిళనాడులో చాలా మంది ఫండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలాగే తెలుగు నుంచి కూడా దాదాపు సగంమంది జనాలు ఫండ్ ఇవ్వడాని ముందుకు వచ్చారని సూర్య చెప్పారు. ఇక ఈయన నటిస్తున్న కంగువ సినిమా నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.