దీపికా పదుకొనే… పరిచయం అక్కర్లేని బాలీవుడ్ స్టార్ హీరోయిన్. బాలీవుడ్ సినిమాలతోనే కాదు హాలీవుడ్ లో కూడా తానేంటో నిరూపించుకుంది. నటించిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుని రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన దీపిక అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. హీరోయిన్‌గా కేరీర్ మంచి ఊపుమీద ఉన్న సమయంలో తన ప్రియుడు రణ్‌వీర్ సింగ్‌ను వివాహాం చేసుకుంది. ఆ తరువాత ఆచితూచి సినిమాలు చేస్తుంది దీపిక.

ఈ నేపథ్యంలో ఇంత ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రెటీ ఎక్కడికైనా వెళితే అభిమానుల తాకిడి మామూలుగా ఉంటుందా? ఓ రేంజ్ లో ఉంటుంది కదా.. ఒక్కొక్కసారి అభిమానుల తాకిడి నుంచి రక్షించేందుకు బాడీగార్డ్స్ ఏంతో కష్టపడాల్సి వస్తుంది. అంటువంటి నిత్యం తన రక్షణను చూసుకునే బాడీగార్డ్‌కు దీపికా ఇచ్చే జీతం ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.

ఇది ఒక ఐటి కంపెనీ సీఈఓ అందుకునే వేతనంతో సమానంగా అందుకుంటున్నారు బాలీవుడ్ క్వీన్ దీపిక పదుకొనె బాడీగార్డ్. నిత్యం దీపిక పదుకునే వెన్నంట ఉండే బాడీగార్డ్ పేరు జలాల్. గత కొద్దీ సంవత్సరాలుగా దీపిక బాడీగార్డ్ గా పనిచేస్తున్నారు జలాల్. దీపికా అవుట్ డోర్ షూటింగ్స్ వెళ్లే సమయంలో జలాల్ తన వెంటే ఉండి ఆమెకు రక్షణ కల్పిస్తుంటాడు. అటువంటి పర్సనల్ బాడీగార్డ్ అయిన జలల్ కు ఆమె నెలకు రూ. 6.5 లక్షలు జీతం ఇస్తుందట, అంటే సంవత్సరానికి సుమారు 80 లక్షలు అన్నమాట. ఇది ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓ అందుకునే జీతం కంటే ఎక్కువే.. అయినా ఒక హీరోయిన్ దగ్గర నుంచి అత్యధిక పారితోషకం అందుకే బాడీగార్డ్ జలాల్ ఒక్కడే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here