ఎంపీ నవనీత్ కౌర్ కు పదవి గండం.. క్యాస్ట్ సర్టిఫికెట్ వల్లే?

నటి ఎంపీ నవనీత్ కౌర్ 2014 ఎన్నికల ముందు రాజకీయాలలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికలలో పోటీ చేసిన నవనీత్ కౌర్ అప్పట్లో ఎన్సీపీ టిక్కెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే 2019 వ సంవత్సరంలో ఎన్నికలలో పోటీ చేసిన ఆమె మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ కౌర్ పోటీ చేసి విజయం సాధించారు.

ఈ క్రమంలోనే నటి నవనీత్ కౌర్ అసలు ఎస్సీ కాదని నకిలీ పత్రాలు సృష్టించి ఆమె అమరావతి లోక్ సభ స్థానం నుంచి ఎన్నికలలో పోటీ చేశారని ఆరోపణలు చేస్తూ శివసేన నేత, మాజీ ఎంపీ ఆనందరావు అదసూల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

నటి నవనీత్ కవర్ కుల ధ్రువీకరణ పత్రం పై విచారణ చేపట్టిన ముంబై కోర్టు వెల్లడించిన తీర్పుతో ఆమె ఎస్సీ కేటగిరికి చెందిన మహిళ కాదని స్పష్టమైంది. ఈ క్రమంలోనే హైకోర్టు నవనీత్ కౌర్ కుల దృవీకరణ పత్రాన్ని రద్దు చేయడమే కాకుండా ఆమెకు రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇకపోతే నవనీత్ కౌర్ భర్త రవి రాణా ప్రస్తుతం అమరావతి జిల్లా బద్నేరా ఎమ్మెల్యేగా ఉన్నారు.ఈ క్రమంలోనే ముంబై హైకోర్టు 6 నెలలలోగా ఆమె కుల ధ్రువీకరణ పత్రాలన్నింటినీ హైకోర్టుకు సమర్పించాలని లేకపోతే ఆమె పార్లమెంట్ సభ్యత్వానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపింది.

ఈ క్రమంలోనే నవనీత్ కౌర్ మాట్లాడుతూ.. శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇటీవల కాలంలో నటి ఆరోపించిన సంగతి మనకు తెలిసిందే.మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పకుండా తనని జైలుకు పంపుతామని బెదిరించినట్లు నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. తనపై యాసిడ్ దాడి చేస్తామని తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు నవనీత్ కౌర్ ఈ లేఖలో పేర్కొన్నారు.