Connect with us

Featured

Harsha Sai: పరారీలో యూట్యూబర్ హర్ష సాయి… తప్పు ఒప్పుకున్నట్టేనా?

Published

on

Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హర్ష సాయి ఒకరు. ఈయన వివిధ భాషలలో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎంతో మంది అభిమానులను సబ్స్క్రైబర్లను సొంతం చేసుకోవడమే కాకుండా యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయాన్ని ఇతరులకు పంచుతూ మంచి మనసు చాటుకున్నారు.

Advertisement

ఎవరైతే పేదరికంలో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారిని గుర్తించి వారికి వేళల్లో లేదా లక్షల్లో సహాయం చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన హర్ష సాయి ఇటీవల వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే..హర్ష సాయిపై ఓ నటి, నిర్మాత లైంగిక ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తన నిర్మాణంలో హర్ష సాయితో చేస్తున్న మెగా అనే సినిమా కాపీ రైట్స్ విషయంలోనే తనను లైంగికంగా వేధించాడని, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసాడని, అంతేకాకుండా తన వీడియోలు చేసి ఇప్పుడు తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని ఈయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ విధంగా హర్ష స్థాయిపై కేసు నమోదు కావడంతో ఆయన కూడా స్పందించారు. కేవలం డబ్బు కోసమే ఆ మహిళ తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అలాగే హర్ష సాయి లాయర్లు కూడా ఆమె చెప్పేవన్నీ అవాస్తవాలేనని,డబ్బు కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు.

Advertisement

గాలిస్తున్న పోలీసులు..
ఇకపోతే ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నారు ఈయన కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుతం ఈయన ముంబైలో ఉన్నారని సమాచారం. ఇలా హర్ష సాయి పరారీలో ఉన్నారనే విషయం తెలియడంతో ఆయన తప్పు చేశారు కాబట్టే పరార్ అయ్యారని పరోక్షంగా ఇలా తప్పును ఒప్పుకున్నట్లేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Paritala Nirupam: రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన డాక్టర్ బాబు.. పెళ్లి ఫోటోలు వైరల్!

Published

on

Paritala Nirupam: పరిటాల నిరూపమ్ అంటే టక్కున ఎవరికి గుర్తు రాదు కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం ఈయన అందరికీ గుర్తుకు వస్తారు. కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా నటించిన పరిటాల నిరూపమ్ బుల్లితెర నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన స్టార్ మాలో కార్తీకదీపం 2 సీరియల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Advertisement

ఇక పరిటాల నిరూపమ్ మరో సీరియల్ నటి మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ చంద్రముఖి సీరియల్ చేసే సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ సీరియల్ సమయంలోనే పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇకపోతే తాజాగా మరోసారి డాక్టర్ బాబు పెళ్లి చేసుకున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డాక్టర్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారు అంటే మరో అమ్మాయిని కాదండోయ్ తన భార్య మంజులనే ఈయన మరోసారి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి వివాహం జరిగి అక్టోబర్ 13వ తేదీకి సరిగా 15 సంవత్సరాలు అయింది.

పెళ్లిరోజు..
ఇలా వీరి వివాహం జరిగి 15 సంవత్సరాలు కావడంతో తిరిగి మరోసారి వీరిద్దరూ తమ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఎంతో సాంప్రదాయబద్ధంగా మరోసారి డాక్టర్ బాబు తన భార్య మంజుల మెడలో పసుపు కొమ్ము కట్టి ఈ పెళ్లిని ఘనంగా జరుపుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

https://www.instagram.com/reel/DBBXi2EscP_/?utm_source=ig_embed&ig_rid=60b835cf-13fc-4a05-bc5e-4015bc1225dd

Advertisement
Continue Reading

Featured

Rana: మహేష్ కోసం మరోసారి రానాను విలన్ ను చేయబోతున్న జక్కన్న?

Published

on

Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న రానా ఇటీవల కాలంలో హీరోగా మాత్రమే కాకుండా కథ పాత్ర బలంగా ఉంటే విలన్ పాత్రలలో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమాలో భల్లాళ్ల దేవుడి పాత్రలో నటించి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

Advertisement

ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన రానాని రాజమౌళి మరోసారి విలన్ ను చేయబోతున్నారని తెలుస్తుంది. రాజమౌళి డైరెక్షన్లో త్వరలోనే మహేష్ బాబుతో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో కూడా రాజమౌళి ఎంతో బిజీగా గడుపుతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ఓ అడ్వెంచరస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కూడా చాలా భిన్నంగా ఉంది. ఇక ప్రభాస్ కు పెద్ద ఎత్తున పోటీ పడిన రానా మహేష్ బాబుకి కూడా గట్టి పోటీ ఇస్తారని చెప్పాలి. మరి రానా ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

విలన్ గా రానా..
ఇక రాజమౌళి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. RRR సినిమాలోని ఒక పాటకు మాత్రమే ఆస్కార్ వచ్చింది కానీ ఈ సినిమా మాత్రం అన్ని విభాగాలలో ఆస్కార్ కు ఎంపిక అయ్యే విధంగా రాజమౌళి సినిమా కోసం కష్టపడుతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Lavanya Tripathi: మెగా ఇంట్లోకి రాబోతున్న బుల్లి వారసుడు.. తల్లి కాబోతున్న లావణ్య!

Published

on

Lavanya Tripathi: మెగా ఇంట్లోకి మరో బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కుమార్తె జన్మించిన విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలోనే మరో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా అమ్మ కాబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Advertisement

నటి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ప్రేమలో పడి పెద్దల సమక్షంలో గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఇలా ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి పెద్దగా సినిమాలలో నటించలేదు.

ఇలా ఈ జంట పెళ్లి చేసుకొని దాదాపు ఏడాది అవుతున్న నేపథ్యంలో వీరికి సంబంధించి ఈ వార్త వైరల్ అవుతుంది. అతి త్వరలోనే లావణ్య త్రిపాఠి అమ్మగా ప్రమోట్ అవ్వబోతుందని తెలుస్తోంది. దసరా పండుగను పురస్కరించుకొని ఈ శుభవార్తను తన అత్తమామలతో లావణ్య త్రిపాఠి తెలిపారని సమాచారం. ఇలా లావణ్య త్రిపాఠి తల్లి కాబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తల్లి కాబోతున్న లావణ్య..
ఇకపోతే ఈమె తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ ప్రకటించలేదు దీంతో ఇలాంటి విషయాలను అధికారకంగా ప్రకటిస్తేనే మంచిది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె తల్లి కాబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక లావణ్య త్రిపాటి సినిమాలకు కాస్త విరామం ప్రకటించిన వరుణ్ తేజ్ మాత్రం వరుస సినిమాలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈయన మట్కా అనే సినిమా ద్వారా రాబోతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!