Category Archives: General News

Sakshi malik: మల్ల యోధురాలు సాక్షి మాలిక సక్సెస్ స్టోరీ తెలుసా?

Sakshi malik: 2016 రియో ఒలంపిక్ పోటీలలో భాగంగా కాంస్య పతకాన్ని సాధించి భారత దేశ గర్వానికి కారణమైనటువంటి మల్ల యోధురాలు సాక్షి మాలిక్ హర్యానాలో మారుమూల గ్రామంలో జన్మించారు. ఈమె చిన్నతనం నుంచి తన తాతయ్య సుబీర్ మాలిక్ ను చూసి ఎంతో స్ఫూర్తి పొందారు. తన తాతయ్య అడుగుజాడల్లోనే ఈమె కూడా క్రీడారంగంలోకి అడుగుపెట్టారు.

6

ఇలా క్రీడ రంగంపై ఎంతో ఆసక్తి పెంచుకున్నటువంటి ఈమె 12 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్లో చేరారు. ఇక ఈమె శిక్షణ తీసుకునే సమయంలో తాను కుస్తీపడాలంటే కేవలం తమ ఊరి అబ్బాయిలతో మాత్రమే కుస్తీ పడాలి అంటూ గ్రామస్తులు తమ కుటుంబ సభ్యులు తెలియజేసేవారు. ఇలా ఎవరు కూడా క్రీడారంగంలో తనని ప్రోత్సహించలేదు ఇలా ఎవరు తనకు సహకరించకపోయినా తన కోచ్ మాత్రం తనని ప్రోత్సహించారు.

ఇలా కోచింగ్ ప్రారంభమైనటువంటి ఈమె భారీ స్థాయిలో శిక్షణ తీసుకున్నారు ఇక తన శిక్షణ పూర్తి అయిన తర్వాత 2009వ సంవత్సరంలో మొదటిసారి ఆసియా జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ 59 కిలోల ప్రీ స్టైల్ లో రజత పథకాన్ని సాధించారు. ఇలా మొదటిసారి గెలుపు అందుకున్నటువంటి ఈమె ఆ గెలుపు క్రీడలపై తనకు మరింత ఆసక్తిని పెంచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమయ్యేలా చేసింది.

రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి మాలిక్…

అనంతరం 2010లో జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని గెలుపొందారు. 2017 వ సంవత్సరంలో జరిగినటువంటి ఆసియా రెజ్లింగ్ పోటీలలో పాల్గొని ఈమె రజిత పథకం సాధించారు. ఇలా ఎప్పటికప్పుడు తన ఆట తీరుతో భారతదేశానికి గర్వకారణంగా నిలిచినటువంటి ఈమె ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవల జరిగిన డబ్ల్యు ఐఎఫ్ ఎన్నికలలో ఈమె ఓడిపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది ఇలా తనని ఎంతో మంచిది విమర్శించిన తనను తాను స్ఫూర్తిగా తీసుకొని క్రీడా రంగాలలో కొనసాగుతూ భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు.

Telangana: ఫ్రీ బస్సు స్కీంను తెలంగాణ మహిళలు ఇలా వాడుతున్నారా… మామూలు వాడకం కాదుగా?

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి అనే పథకం ద్వారా మహిళలందరికీ కూడా తెలంగాణ పరిధిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితం అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకం అమలులో ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీలో మహిళల ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరిగిందని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు.

ఇలా ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో మహిళలు ప్రయాణం చేస్తున్నారు. లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీలో ప్రయాణం చేసే వారి సంఖ్యలో ఉందని అధికారులు తెలియజేశారు. ఇకపోతే తాజాగా ఈ ఉచిత స్కీం ద్వారా మహిళలు ఏ ఏ ప్రదేశాలకు ప్రయాణం చేస్తున్నారా అనే విషయాలు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఉచిత ప్రయాణం కావడంతో మహిళలందరూ కూడా ఎక్కువగా దైవ దర్శనాలకు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు వేములవాడ, కాలేశ్వరం వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే రూట్లలో ప్రయాణం చేసినట్లుగా ఆర్టీసీ అధికారులు గుర్తించారు.

పుణ్యక్షేత్రాలకు ప్రయాణం…

ఈ పథకం డిసెంబర్ 9వ తేదీ అమలులోకి తీసుకువచ్చారు. 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్దరాత్రి వరకు 94,128 మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేశారు. 10వ తేదీ ఆదివారం రోజు 2,26,645 మంది మహిళలు ప్రయాణం చేశారు. 11వ తేదీ రెండు లక్షలకు పైగా ప్రయాణం చేశారు. ఇలా ప్రతిరోజు లక్షల సంఖ్యలోనే మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారని అధికారులు తెలిపారు.

Venuswamy: బర్రెలక్క కెరియర్ సోషల్ మీడియా వల్లే నాశనమైంది … వేణు స్వామి కామెంట్స్ వైరల్!

Venuswamy: ఇటీవల తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క ఎన్నికలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. బర్రెలక్కగా ఎంతో ఫేమస్ అయినటువంటి శిరీష యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు అయితే ఈమె తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు.

barre

ఎన్నికలలో పోటీ చేసినటువంటి ఈమె అతి తక్కువ ఓట్లతో పరాజయం పాలయ్యారు. అయితే తాజాగా ఈమె గురించి వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బర్రెలక్క వీడియోలు చేసుకుంటూ తన జీవితం తాను గడిపేదని కానీ సోషల్ మీడియా వల్ల ఆమెను కొందరు ఎన్నికల వైపు దృష్టి సారించేలా చేసి తనని ఎన్నికలలో నిలబెట్టారని తెలిపారు.

ఈ ఎన్నికలలో నిలబడటం వల్ల తాను సంపాదించుకున్నది కూడా పూర్తిగా కోల్పోయిందని వేణు స్వామి తెలిపారు. ఇలా కాకుండా తాను సైలెంట్ గా ఉండి ఉంటే కాంగ్రెస్ పాలనలో తనకు ఒక మంచి ఉద్యోగం వచ్చి ఉండేదని ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా సోషల్ మీడియానే శిరీష కెరియర్ నాశనం చేశారు అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా కామెంట్లు చేశారు.


వేణు స్వామికి తప్పని ట్రోల్స్…

ఇకపోతే ఈ మధ్యకాలంలో వేణు స్వామి కూడా తన జ్యోతిష్యం కారణంగా ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోసారి తెలంగాణకు కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని కాకుంటే నేను జ్యోతిష్యం చెప్పడమే మానేస్తానని ఈయన తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఈయన పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

Telangana: తెలంగాణ ఎన్నికల ఫలితాలు టిడిపికి కలిసొచ్చేనా… వైసిపి ప్రమాదంలో ఉన్నట్టేనా?

Telangana: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలలో ఏ సంఘటన జరిగినా ఇరు రాష్ట్ర ప్రజలు నాయకులు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే తాజగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పెద్ద ఎత్తున బారాస, కాంగ్రెస్ పార్టీలో పోటీ పడుతూ ప్రచార కార్యక్రమాలను చేశారు. అయితే రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి బారాస పార్టీకి ప్రజలు మద్దతు తెలుపకపోగా హస్తం చేతిలో హస్తం వేసి కాంగ్రెస్ కి పట్టం కట్టారు.

ఇలా తెలంగాణలో పదేళ్ల బారాసపాలనకు ప్రజలు పులిస్టాప్ పెట్టారని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తెలుస్తోంది. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఎన్నికలపై ఆంధ్ర ప్రదేశ్ నాయకులు ఎంతో ఆసక్తి కనబరిచారు. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసి కొంతమేర ఏపీ నేతలలో కూడా గుబులు మొదలైందని తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుతో ఎంత సన్నిహితంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఎలాంటి అధికారక ప్రకటన లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ తో చేతులు కలిపి ఓట్లు మొత్తం కాంగ్రెస్ కి పడేలా వ్యూహం రచించారు.

ఇక రేవంత్ రెడ్డి గెలవగానే కాంగ్రెస్ జెండాలతో పాటు ఊరేగింపులో పసుపు జెండాలు కూడా కనిపించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రేవంత్ రెడ్డి ఎట్టకేలకు విజయం సాధించార. అయితే రేవంత్ రెడ్డికి ఎంతో సహాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడుకి కూడా వచ్చే ఎన్నికలలో రేవంత్ సహాయ పడబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ తో చేతులు కలిపారో ఇక్కడ కూడా కాంగ్రెస్ తో చేతులు కలిపి ఎన్నికలలో పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు వ్యూహం రచిస్తున్నారని తెలుస్తుంది.

అలర్ట్ అవుతున్న వైసీపీ నేతలు…

ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తుకుదురుచుకున్నారు. మరోవైపు బీజేపీ పార్టీని కూడా కలుపుకోవడానికి కేంద్రంతో పవన్ కళ్యాణ్ చర్చలు కూడా జరుపుతున్నారు. అన్ని పార్టీలు కలిసి ఈసారి వైసిపి పార్టీపై దండెత్తబోతున్నాయని తెలుస్తుంది . ఇలా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి బారాస పార్టీకే ప్రజలు మద్దతు తెలుపలేదు దీంతో వైసిపి నేతలు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేకపోతే తెలంగాణలో బారాసకి వచ్చిన పరిస్థితి ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా రాబోతోంది అంటూ మరికొందరు నేతలు భావిస్తున్నారు అయితే రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో తెలియదు కనుక ఏపీ రాజకీయాలలో ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.

Y S Sharmila : వై ఎస్ షర్మిల ఇంట మోగనున్న పెళ్లిభాజాలు… రాజా రెడ్డి ప్రేమ వివాహం…!

Y S Sharmila : జగనన్న వదిలిన బాణంలా తెలుగు రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుంది షర్మిల . ఇపుడు తెలంగాణాలో కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాడుతానంటూ ప్రత్యేక పార్టీ స్థాపించి రాజకీయాలలో తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. అప్పుడు అన్నకోసం రాజకీయాలలోకి వచ్చిన షర్మిల ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం నియంత్రుత్వ పాలనకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తానంటోంది.

షర్మిల కొడుకు రాజరెడ్డి కులాంతర వివాహం

వైస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి వైస్ షర్మిలది కులాంతర వివాహం అని తెలిసిందే. మొదట వారి మేనమామతో వివాహం జరిగినప్పటికి కొన్ని కారణాలతో విడిపోయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత అనిల్ కుమార్ క్రైస్తవ మతాన్ని స్వీకరించడం జరిగింది. వీరికి రాజారెడ్డి, అంజలి అనే ఇద్దరు పిల్లలు కూడా. అయితే రాజారెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడం, అక్కడ ప్రియా అట్లూరి అనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం జరిగిందని, వీరి ప్రేమ నాలుగేళ్లుగా కొనసాగుతోందని ఇటీవల ఒక ఇంగ్లీషు వెబ్ సైట్ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించడం జరిగింది.

ఇదిలా ఉండగా, వీరి ప్రేమకు ఇటు షర్మిల దంపతులు, అటు ప్రియా అట్లూరి తల్లితండ్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చే ఏడాది మే లో వీరి పెళ్లి ఉండనున్నట్లు సమాచారం. అయితే ప్రియా అట్లూరి అమెరికాలోనే స్థిరపడింది . ఈమెకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉందని సమాచారం. ఇక షర్మిల కొడుకు రాజారెడ్డి డల్లాస్ యూనివర్సిటిలో బ్యాచిలర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేసుకున్నాడు.

Heroine Payal Ghosh: ఇర్ఫాన్ ను తప్ప ఎవరినీ ప్రేమించలేదు… గంభీర్ నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడు… క్రికెట్ ఆటగాళ్ల మీద హాట్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ భామ…: హీరోయిన్ పాయల్ ఘోష్

Heroine Payal Ghosh: సినిమా వాళ్లకు క్రికెట్ ఆటగాళ్లకు మధ్య మంచి రెలేషన్స్ ఉంటాయి. అదికూడా బాలీవుడ్ భామలతో ప్రేమాయణం నడపడం ఇప్పటిది కాదు. కపిల్ దేవ్ దగ్గరి నుండి నేటి ధోనీ వరకు అందరి మీదా బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టేవి. అయితే వీటికి ఎప్పటికప్పుడు బ్రేక్ ఇస్తూ వేరే వాళ్లను పెళ్ళిళ్ళు చేసుకుని కొంతమంది ఆటగాళ్ళు సెటిల్ అయితే విరాట్ లాంటి వాళ్ళు ప్రేమించిన హీరోయిన్ తోనే పెల్లి బంధం కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఒక బాలీవుడ్ మాజీ హీరోయిన్ క్రికెట్ ఆతగాడితో తన ప్రేమాయణం అలాగే మరో క్రికెటర్ తనను ఎలా ఇబ్బంది పెట్టాడో వంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా చెప్పి హాట్ టాపిక్ గా నిలిచింది.

గంభీర్ నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడు…

పాయల్ ఘోష్.. ఈ నటి పెద్దగా తెలుగులో సినిమాలను చేయకపోయినా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో వచ్చిన మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ సినిమాతో తెలుగులో సుపరిచితురాలు. ఇక ‘ఊసరవెల్లి’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ఈ బెంగాలీ భామ కన్నడ, తమిళంలో కూడా ఒక్కొ సినేమా చేసింది. హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఈ అమ్మడు పెద్దగా రానించలేదు. ఇక క్రికెటర్ తో ప్రేమలో పడి బాగా వైరల్ అయిన పాయల్ ఇండియన్ జట్టు ప్లేయర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ తో ప్రేమాయణం నడిపింది. అప్పట్లో వీరి బంధం హాట్ టాపిక్ కాగా ఆ తరువాత విడిపోయారు. బ్రేక్ అప్ అయ్యాక అనారోగ్యంతో బాధపడినట్లుగా తెలిపిన పాయల్ సినిమాలు కూడా చేయలేకపోయానంటూ ఇటీవల వరుస ట్వీట్స్ తో పంచుకుంది. జీవితంలో ప్రేమించింది కేవలం ఇర్ఫాన్ ని మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఇర్ఫాన్ తో ప్రేమలో ఉన్నపుడు గౌతమ్ గంభీర్ తనకు తరచూ మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడు, ఈ విషయం ఇర్ఫాన్ కి కూడా తెలుసంటూ ట్వీట్ చేసింది. నా ఫోన్ తరచూ ఇర్ఫాన్ చెక్ చేసేవాడని, ఒకసారి పుణె లో ఇర్ఫాన్ ను కలవడానికి వెళ్ళినపుడు క్రునాల్ పాండ్య, హర్ధిక్, యూసఫ్ ముందు ఈ విషయం గురించి చెప్పాడు అంటూ ట్వీట్ చేసింది పాయల్. ఇటీవల వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరిగిన ఆటలో ఏడు వికెట్లు పడగొట్టి హాట్ టాపిక్ అయిన మహ్మద్ షమీ ను పెళ్లి చేసుకుంటా అంటూ ట్వీట్ చేసి వైరల్ అయిన పాయల్ ఇపుడు ఇర్ఫాన్ అలాగే గౌతమ్ గంభీర్ ల గురించి వరుస ట్వీట్ తో బాగా హాట్ టాపిక్ అవుతోంది.

Hyderabad: హైదరాబాద్ పేరు మార్చేస్తాం… యోగి ఆదిత్యనాథ్ కు కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్?

Hyderabad: తెలంగాణలో మరొక రెండు రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్లో సందడి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తామని దీనిని భాగ్యనగర్ గా పిలుస్తామని తెలిపారు.

ఇక్కడ భాగ్యలక్ష్మి ఆలయం ఉందని ఇది ఎంతో ప్రసిద్ధి చెందిందని అందుకే ఈ హైదరాబాద్ కి భాగ్యనగర్ అనే పేరును పెట్టబోతున్నట్లు ఈయన వెల్లడించారు. అయితే ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు కేంద్ర బిజెపి మంత్రి కిషన్ రెడ్డి కూడా మద్దతు తెలియజేశారు. అసలు ఈ హైదర్ ఎవరు ఈ హైదర్ పేరును మన భాగ్యనగర్ కు ఎందుకు పెట్టుకోవాలి అంటూ మాట్లాడారు. అయితే యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ స్పందిస్తూ యోగి ఆదిత్యనాథ్ కు కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్ మా అస్తిత్వం…

అసదుద్దీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భాగ్యనగర్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ముందుగా వారిని నేను ప్రశ్నిస్తున్నానని తెలిపారు. పేరు ఎక్కడ రాసి ఉన్నది? మీరు హైదరాబాద్‌ను ద్వేషిస్తారు. అందుకే పేరు మార్చాలని అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు విద్వేషానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఈయన తెలియజేశారు.హైదరాబాద్ మా గుర్తింపు, మా అస్తిత్వం. మీరు దీని పేరు ఎలా మారుస్తారు? వాళ్లు కేవలం ద్వేష రాజకీయాలు చేస్తున్నారనీ అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు అయితే ఇప్పుడు హైదరాబాద్ పేరు మార్చడం పట్ల యోగి వర్సెస్ అసదుద్దీన్ అనేలా మారిపోయిందని తెలుస్తోంది.

IPL 2024: ప్రపంచ కప్ హీరోలపై దృష్టి పెట్టిన ఐపీఎల్ ప్రాంచైజీలు… ఆసీస్ పైనే పూర్తి దృష్టి?

IPL 2024: ఐపీఎల్ 2024 కోసం ఇప్పటికే అన్ని జట్టులో సిద్ధమవుతున్నాయి. అయితే త్వరలోనే ఐపీఎల్ సీజన్ కోసం దుబాయ్ లో వేలం జరగనుంది ఈ క్రమంలోనే ప్రపంచ కప్ క్రికెట్లో పెద్ద ఎత్తున పోటీపడి ఆట తీరును కనబరిచిన ఆటగాళ్లపైన ఈసారి ప్రాంచైజీలు పూర్తి దృష్టి పెట్టాయని తెలుస్తుంది. ఈ ఐపీఎల్ కోసం ఈ నెల 19వ తేదీ వేలం జరగబోతుంది.

అందుతున్న సమాచారం ప్రకారం దుబాయిలో జరగబోయే ఈ వేలం పాటలో పెద్ద ఎత్తున కాసుల వర్షం కురిపించబోతున్నారని తెలుస్తుంది.ముఖ్యంగా ప్రపంచ కప్ 2023లో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై అందరూ చూపు పడిందని తెలుస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ ను తమ జట్టులోకి తీసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.

భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కూడా ప్రపంచ కప్ పోటీలలో అద్భుతమైన ఆట తీరును కనబరిచారు ఈయన కోసం కూడా ఫ్రాంచైజీలు తెగ పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్  సారథ్యంలో ఆరోసారి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది దీంతో ఈయనపై కూడా ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించబోతున్నాయని తెలుస్తోంది.

వరల్డ్ కప్ ఆటగాళ్లపై కాసుల వర్షం..

న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రపంచకప్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌లు 2 సార్లు తలపడ్డాయి. లీగ్ రౌండ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఈ ఐపీఎల్ వేలంలో డారెల్ మిచెల్‌ భారీ ధర పలకవచ్చు. వీరితో పాటు గెరాల్డ్ కోయెట్జీ, ట్రావిస్ హెడ్ తదితర ఆటగాళ్ల పై భారీ స్థాయిలోనే ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Fridge: ఫ్రిడ్జ్ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా…ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్రిడ్జ్ పేలిపోతుంది తెలుసా?

Fridge: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ తప్పనిసరిగా ఉంటుంది.ఫ్రిడ్జ్ ప్రతి ఒక్కరికి ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఫ్రిడ్జ్ ఇంట్లో ఉండటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే ఇలా నిత్యవసర వస్తువుగా మారిపోయినటువంటి ఫ్రిడ్జ్ విషయంలో కూడా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ప్రమాదాలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలుస్తుంది.

మీ ఇంట్లో కనుక ఫ్రిడ్జ్ ఉన్నట్లయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు ఫ్రిడ్జ్ విషయంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అయితే కొన్నిసార్లు ఫ్రిడ్జ్ పేలిపోతూ ఉంటుంది ఇలా ఫ్రిడ్జ్ పేలిపోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే… ఫ్రిడ్జ్ పేలిపోవడానికి ప్రధాన కారణం కంప్రెషర్. యూనిట్ వెనుక భాగంలో ఈ కంప్రెసర్ ఉంటుంది. ఇది పంప్, మోటారును కలిగి ఉండి.. కాయిల్ ద్వారా కూలింగ్ వాయును పంపిస్తూ ఉంటుంది అయితే కొన్నిసార్లు కంప్రెషర్ బాగా వేడి కావడం వల్ల కంప్రెషర్ కుచించుకుపోతుంది.

ఈ కంప్రెసర్ కాయిల్ లో ఎక్కువ వాయువు పెరిగి ఒత్తిడికి గురవుతుంది.ఇలా ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతుందో ఆ క్షణమే ఫ్రిడ్జ్ పేలుతుంది అందుకే అప్పుడప్పుడు మనం ఈ కంప్రెసర్ కాయిల్ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కేవలం కంప్రెషర్ కాయిల్ మాత్రమే కాకుండా మనం పవర్ సప్లై విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

పవర్ సప్లైలో లోపాలు…

పవర్ సప్లై లో కూడా ఎక్కువ లోపాలు ఉన్న హెచ్చుతగ్గులు ఉన్నా కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ పేలిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటాయి. అందుకే పవర్ సప్లై విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రిడ్జ్ మనం ఉపయోగిస్తూ ఎనిమిది సంవత్సరాలు దాటింది అంటే ఇలాంటి వాటిలోనే ఎక్కువగా పేలుడు జరుగుతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఫ్రిడ్జ్ విషయంలో మీకు ఏదైనా సమస్య అనిపించినట్లు వెంటనే ఫ్రిడ్జ్ ప్లగ్ ఆఫ్ చేసి వెంటనే టెక్నీషియన్ ను పిలిపించి సమస్య ఏంటో గుర్తించడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చు.

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు.. ఓల్డ్‌ సిటీ సహా నాలుగుచోట్ల కొనసాగుతున్న తనిఖీలు..

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు చేస్తున్నారు. శనివారం ఉదయం నుండి ఏకకాలంలో ఓల్డ్‌ సిటీ సహా నాలుగుచోట్ల తనిఖీలు కొనసాగిస్తున్నారు.. ISIS సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. తమిళనాడులో 30 చోట్ల, హైదరాబాద్‌లో నాలుగు చోట్ల రైడ్స్‌ జరుగుతున్నాయి. ఈక్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.