Category Archives: Political News

స్టేజీపైనే ఆ మంత్రికి హెయిర్ కట్టింగ్ చేసిన బార్బర్.. రూ.60 వేల బహుమానం!

అదృష్టం ఎవరిని ఏ విధంగా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఒక బార్బర్ ను చూస్తే ఈ మాట నిజమేనని అనిపిస్తుంది. ఒక బార్బర్ కు ఒక వ్యక్తికి కటింగ్, షేవింగ్ చేసినందుకు 60 వేల రూపాయలు దక్కింది. వినడానికి కొంత వింతగానే ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే కట్టింగ్ చేయించుకున్న వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు. అధికార పార్టీ మంత్రి అయిన సదరు వ్యక్తి కటింగ్, షేవింగ్ చేసిన బార్బర్ కళ్లల్లో ఆనందం నింపాడు.

పూర్తి వివరాల్లోకి వల్ల కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల గత కొన్ని నెలలుగా ప్రజా ప్రతినిధులు బహిరంగ సభలను ఏర్పాటు చేయడం లేదు. ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వానించినా వాటికి హాజరు కావడానికి ఇష్టపడటం లేదు. కార్యక్రమాలకు హాజరైతే వైరస్ తమకు ఎక్కడ సోకుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. అయితే మధ్యప్రదేశ్ అటవీ శాఖ మంత్రి విజయ్ షా మాత్రం ఖండ్వా జిల్లా గులైమాల్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు.

కార్యక్రమంలో భాగంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు కీలక సూచనలు చేశాడు. ఆ సమయంలో రోహిదాస్ అనే బార్బర్ అక్కడికి వచ్చి కరోనా, లాక్ డౌన్ వల్ల తన పరిస్థితి ఏం బాగాలేదని తనకు షాపు పెట్టుకోవడానికి సహాయం చేయాలని కోరాడు. మంత్రి తనకు కట్టింగ్, షేవింగ్ చేయాలని నైపుణ్యాన్ని పరిశీలించి సాయం చేయాలో వద్దో నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.

రోహిదాస్ వెంటనే ఫేస్ మాస్క్ ధరించి, శానిటైజర్ రాసుకుని కటింగ్, షేవింగ్ చేశాడు. అనంతరం ముఖాన్ని అద్దంలో చూసుకున్న మంత్రి బార్బర్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు. ఆ తరువాత 60 వేలు ఇచ్చి షాపు పెట్టుకోవాలని మంత్రి సూచించడంతో రోహిదాస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంత్రి మాట్లాడుతూ కరోనా వల్ల చాలామంది సెలూన్లకు వెళ్లాలంటే భయపడుతున్నారని… అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ బారిన పడే అవకాశాలు ఉండవని చెప్పారు.

అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు సిఎం జగన్ ఆదేశం…!

ఇటీవలే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అగ్నికి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో ఆలయానికి చెందిన రధం అగ్నికి ఆహుతైపాయింది. అయితే ఈ విషయాన్ని సిఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రతిపక్షాలు దుమ్మేత్తిపోస్తున్నాయి. మరోవైపు పలు పార్టీలు, సంఘాలు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సిఎం జగన్ రాష్ట్ర డీజీపీ ని ఆదేశించారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర హోం శాఖకు రాష్ట్ర డీజీపి కార్యాలయం ఒక లేఖను పంపింది. ఈ క్రమంలో దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ రేపు జీవో విడుదల చేయనున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ వెనుక పెద్ద కుట్ర జరుగుతుందంటూ టాలీవుడ్ హీరో రామ్ సంచలన ట్వీట్స్ !!

ఈ రోజు దేశ ప్రజలందరూ 74వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకం ఎగరవేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కి ఇస్మార్ట్ హీరో రామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇచ్చిన సలహా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈమధ్య విజయవాడలోని స్వర్ణ. కోవిడ్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

అయితే హోట‌ల్ స్వ‌ర్ణ ప్యాల‌స్‌ ని ర‌మేశ్ హాస్పిట‌ల్ వారు కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మార్చ‌కముందు, ప్ర‌భుత్వం అక్క‌డ క్వారంటైన్ సెంట‌ర్ నిర్వ‌హించింద‌ని, అప్పుడే ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగి ఉంటే ఎవ‌రిని నిందిస్తారు.? అంద‌రినీ ఫూల్స్‌ను చేయ‌డానికే ఈ విష‌యాన్ని అగ్ని ప్ర‌మాదం నుంచి ఫీజుల వైపు మ‌ళ్లిస్తున్నారా.? అని ప్ర‌శ్నించారు. స్వ‌ర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంట‌ర్ మేనేజ్‌ మెంట్ బాధ్య‌త‌ల‌ను స్వ‌ర్ణ ప్యాలెస్ యాజ‌మాన్య‌మే నేరుగా చూసుకుంటుంద‌ని, వారే బిల్లింగ్ చేస్తున్నార‌ని రామ్ తెలియజేస్తూ.. అందుకు సంబంధించిన స్వ‌ర్ణ ప్యాలెస్ బిల్లుల‌ను కూడా ఆయ‌న జ‌త చేశారు.

ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని త‌ప్పుగా చూపించ‌డానికి పెద్ద కుట్ర జ‌రుగుతుంద‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. “జ‌గ‌న్ గారూ.. మీ కింద ప‌ని చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్‌కి, మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ జ‌రుగుతుంది. వాళ్లను ఓ కంట కని పెడతార‌ని ఆశిస్తున్నాం.” అని రామ్ జ‌గన్‌కు ట్వీట్ చేశారు. ఆయ‌న ట్వీట్ వెనుక ఉద్దేశ్యం ఈ అగ్ని ప్ర‌మాదం సంఘ‌ట‌న‌లో ర‌మేష్ ఆసుప‌త్రి త‌ప్పేమీ లేదని చెబుతున్న‌ట్లుగా ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో హీరో రామ్ ఒక్కడే ఎందుకు స్పందించాడబ్బా.? అని ఆరా తీస్తే.. రామ్ కి ర‌మేష్ హాస్పిట‌ల్స్ అధినేత రమేష్ ద‌గ్గ‌రి బంధువని తెలిసింది. ప్రస్తుతం సోషల్.మీడియాలో బాగా సంచలనం సృష్టిస్తున్న హీరో రామ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసాడా.? అని రాజకీయ, సినీ వర్గాలలో పెద్ద చర్చాంశనీయమైంది.

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్…

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకీ విశ్వరరూపం చూపిస్తోంది. ప్రతిరోజూ కొత్త‌గా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. కరోనా ఎవరినీ వదలడం లేదు.. ఇప్ప‌టికే చాలామంది పలువురు రాజ‌కీయ నాయ‌కులతో పాటు సినీ, క్రీడా సెబ్రిటీల‌ను సైతం ఈ కరోనా మహమ్మారి సోకిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా ను కూడా వదిలిపెట్టలేదు ఈ మహమ్మారి. తాజాగా ఆయనకు క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు కనిపించడంతో.. టెస్టు చేయించగా అమిత్ షా కు కోవిడ్ పాజిటివ్‌ అని నిర్థార‌ణ అయింది.

ఈ మేర‌కు అమిత్ షా తన ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అయితే డాక్ట‌ర్ ల సూచ‌న మేర‌కు తాను ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నట్టు అమిత్ షా తెలిపారు. అలాగే గ‌త కొద్దీ రోజులుగా త‌న‌ని కలిసిన వారు హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని, ఒకవేళ లక్షణాలు కనిపిస్తే వారు కూడా క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని తెలిపారు అమిత్ షా. కాగా ఇప్పుడు అమిత్ షాకు కోవిడ్ సోక‌డం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగుతోంది.

మంచికిపోతే చెడు ఎదురైందన్న సామెత సోనూసూద్ విషయంలో నిజమైంది.?!

పేదల పాలిట పెన్నిధిగా ఆపదలో అందరికీ సహాయం చేస్తూ వెండితెరపై విలన్ గా నటించే సోనూసూద్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఈమధ్య కరోనా లాక్ డౌన్ టైంలో వలస కూలీల కోసం ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేసి అందరి మన్ననలు అందుకున్న సోనూసూద్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ పేద కుటుంబానికి సహాయం చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కూతుళ్లతో నాగలి పట్టించిన రైతుకు అండగా నిలిచి ట్రాక్టర్ కొనిచ్చాడు సోనూసూద్.

అయితే ఈవిధంగా సహాయం చేసేముందు వాళ్ళు నిజంగానే ధీనస్థితిలో వున్నారా.. లేదా..? అనే విషయాన్ని కాస్త విచారించుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెట్టడంతో సోనూసూద్ చేసిన పని కాస్త విమర్శలకు గురవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కంభం వారి పల్లె మండలం మహల్ రాజపల్లికి చెందిన రైతు వీరదల్లు నాగేశ్వరరావు ఆర్ధికంగా వెనుకబడిన రైతేం కాదు.. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నాయకునిగా గతంలో పని చేశారు. కమ్యునిస్ట్ ఉద్యమాలలో పాల్గొని మావోయిస్టుల హక్కులపై పోరాడారు. ఇతనికి సొంత ఇల్లు ఉంది. సొంత ఊరిలోనే సమాజం కోసం పోరాటం చేసే వ్యక్తిగా మంచి పలుకుబడి కూడా సంపాదించారు. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. లేటెస్టుగా సోనూసూద్ నుంచి ట్రాక్టర్ సహాయం పొందిన ఈ రైతు లోక్ సత్తా పార్టీ తరపున గతంలో ఆ ఊరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ఇతను ఉండేది మదనపల్లె పట్టణంలో.. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా పల్లెటూర్లో వుండడమే మంచిదని ఈమధ్యనే సొంతూరు మహల్ రాజపల్లి వచ్చేశారు.

వీరదల్లు నాగేశ్వరరావు పేరుకు మాత్రమే రైతు. కానీ., ఏడాది మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే వ్యక్తి మాత్రం కాదు. పొలం దుక్కి దున్నటానికి ఆ టైంలో ట్రాక్టర్లు, కూలీలు అందుబాటులో లేక తన కూతుళ్లతో సరదాగా ఇలా చేశాడే కానీ డబ్బులు లేక ధీనస్థితిలో ఉండి మాత్రం ఈ పని చేయలేదు. మరొక్క ఆసక్తికరమైన విషయమేమిటంటే.. నాగేశ్వరరావుకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అన్ని పథకాల కింద ఆర్థిక సహాయం అందుతుంది. పోయిన సంవత్సరం రైతు భరోసా పధకం కింద రూ. 13వేల 500 నాగేశ్వరరావు బ్యాంకు ఎకౌంట్ లో జమయ్యాయి. ఈ సంవత్సరం కూడా రైతు భరోసా పధకం కింద రూ.7వేల 500 అందుకున్నారు. అలాగే తన చిన్న కూతురుకు జగనన్న అమ్మ ఒడి పధకం క్రింద రూ.15 వేల రూపాయలు అందుకున్నారని తెలిసింది.

నాగేశ్వరరావు తల్లి కూడా అభయ హస్తం కింద పెన్షన్‌ తీసుకుంటుంది. కరోనా టైంలో ప్రభుత్వం అందించిన వెయ్యి రూపాయల ఆర్థిక సాయం కూడా అందుకుంది. తన రెండెకరాల పొలంలో వేరు శెనగ పంట వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి DAP ఎరువులు, విత్తనాలను కూడా తీసుకున్నారు. కరోనా ప్రభావంతో అద్దెకు ట్రాక్టరు దొరక్క. కూలీలు అందుబాటులో లేక కుమార్తెల సహాయంతో పొలం దున్నుతున్న రైతు నాగేశ్వరరావు వివరాలను ఓ పత్రిక ప్రచురించింది. కానీ ఆ పత్రిక ప్రచురించిన వార్తలో ఎక్కడా ఆ రైతు కుటుంబం డబ్బుల్లేక.. ధీనావస్ధలో వున్నారని లేకపోవడం విశేషం. వాళ్ళు పొలం దున్నే సమయానికి ట్రాక్టర్ అందుబాటులో వున్నా.. లేక పని చేసే కూలీలు దొరికినా డబ్బులిచ్చే స్థోమత నాగేశ్వరరావుకి ఉంది. ఇదిలా వుండగా.. తాజాగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే స్పందించినట్లు చిత్తూరు జిల్లా అధికారులు తెలియజేస్తూ..

ఆ రైతు గ్రామానికి స్వయంగా వెళ్లి అతన్ని ఆరా తీశామని, కేవలం సరదాగానే తన కూతుళ్ళతో పొలం దున్నించినట్లు రైతు వివరించారని, ఈలోపు అతని కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలను గ్రామ వాలంటీర్ ద్వారా కూడా సేకరించామని, డబ్బున్న కుటుంబమేనని తెలియడంతో ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించలేదని తెలిపారు. ఈ వివరాలన్నీ కూడా ది హిందూ పత్రిక కూడా ప్రత్యేక కధనంగా ప్రచురించింది. అయితే ఇంకాస్త అడ్వాన్స్ గా సోనూసుద్ ట్విట్ చేయటం… అతను స్పందించటం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఫైనల్ గా గతంలో లోక్ సత్తా పార్టీ తరపున ఆ ఊరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రైతు నాగేశ్వరరావు ఇప్పుడు ఆ ట్రాక్టర్‌ను వెనక్కిచ్చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.

ఏపి రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ కోడలు మృతి కేసులో క్రొత్త ట్విస్ట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ ఫ్యామిలీలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఆయ‌న చిన్న కోడ‌లు, క‌న్నా చిన్న కుమారుడు ఫ‌ణేంద్ర భార్య సుహారిక అనుమాన‌స్ప‌ద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.. హైద‌రాబాద్ సమీపంలోని రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో వున్న మీనాక్షి బాంబూస్‌లో‌ గురువారం ఫ్రెండ్ ఇంట్లో పార్టీ చేసుకుంటుండ‌గా సుహారిక ఒక్క‌సారిగా కుప్ప‌కూలి పోయింది. దాంతో వెంట‌నే ఆమెను రాయ‌దుర్గంలోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌ కు త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే ఆమె మరణించిన‌ట్లుగా వైద్యులు ధృవీకరించారు. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని.. అనుమానాస్ప‌ద మరణంగా కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

చిన్న కోడ‌లు మరణించడంతో క‌న్నా కుటుంబంలో తీవ్ర విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడ‌లు సుహారిక మృతి విష‌యంలో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌న్నా కొడుకు ఫణీంద్ర కుమార్ త‌న భార్య మ‌ర‌ణంపై సందేహాలున్న‌ట్లు మీడియాకి తెలియజేశారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ను ఈ కేసు దర్యాప్తు విషయంపై కలిశానని, ముందు త‌న భార్య‌ సిబిఐటి వద్ద చనిపోయిందని చెప్పారని, ఆ త‌ర్వాత‌ ఏఐజి హాస్పిటల్ కి దగ్గరలో ఉన్న బ్యాంబో హిల్స్ చనిపోయిందని 2 మాటలు చెప్పిన‌ట్లు తెలియడంతో తన బార్య మృతి పట్ల కొన్ని సందేహాలున్నట్లు సజ్జనార్ గారికి తెలిపారు. ఈ సందర్భంగా ఫణీంద్ర ఆరోజు అక్కడ అస్సలు బర్త్ డే పార్టీ జరగలేదని చెప్పడం ఈ కేసులో క్రొత్త ట్విస్ట్. సుహారిక చనిపోయే నెల రోజుల ముందు త‌న‌ తండ్రి చనిపోయాడని..

అప్పటి నుండి ఆస్తుల విషయంలో ఆ ఇంట్లో త‌న తోడ‌ల్లుడు గొడవ చేస్తున్న‌ట్టు తెలిపారు. ఆస్తుల విషయం మాట్లాడుకోవడానికే బాంబో విల్లాస్ కి సుహారిక వెళ్ళిందని.. ఆ రోజు ఏం జరిగింద‌న్న విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త లేద‌ని, అక్కడున్న నలుగురులో ఇద్దరు మాత్రమే త‌నకు తెలిసిన వాళ్ళని.. అసలు నిజాలు బయటకు రావట్లేదని, పోలీసులు ఈ కేసుని అన్ని కోణాల్లోనుంచి విచారించి నిజాల్ని బయటికి తీసుకోస్తారని ఆశిస్తున్నట్లు క‌న్నా కొడుకు ఫణీంద్ర కుమార్ తెలియజేశారు.

నారా బ్రాహ్మణి, వైయస్ భారతి జీవితాలను పోల్చుకుంటే దొరికే తేడాలు ఇవే..!

నారా బ్రాహ్మణి, వైయస్ భారతి జీవితాలను పోల్చుకుంటే దొరికే తేడాలు ఇవే..!

నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవి దంపతులకు జన్మించిన పెద్ద కుమార్తె బ్రాహ్మణి ని నారా లోకేష్ 2007వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. బ్రాహ్మణి బ్యాగ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ నటుడు దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆమెకు తాత అవుతారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమెకు మావయ్య అవుతాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ కి ఆమె భార్య అవుతుంది.

ఇలా ఒక రాష్ట్రాన్ని ఏళ్ళపాటు పరిపాలించిన కుటుంబం లో పుట్టి పెరిగిన బ్రాహ్మణి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈమె హెరిటేజ్ వంటి కార్పొరేట్ సంస్థ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. బడా బిజినెస్ లను కూడా ఒంటిచేత్తో మేనేజ్ చేయగల సత్తా నారా బ్రాహ్మణి లో ఉంది. ఒక కొడుక్కి తల్లి అయిన ఆమె 2500 కోట్ల బిజినెస్ ని ఆరు వేల కోట్ల బిజినెస్ గా చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. స్టాండ్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న నారా బ్రాహ్మణి చాలా స్పష్టంగా, తెలివిగా మాట్లాడుతుంది.

ఇక వైయస్ భారతి గురించి తెలుసుకుంటే ఆమె దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోడలు అని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆమె భర్త వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం పదవి ని అధిరోహించారు. దీంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఎంత స్ట్రాంగో మనం సులువుగా అర్థం అవుతుంది. అయినా కూడా వైయస్ భారతి ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ఎలాంటి దర్పం చూపకుండా చాలా సాదాసీదాగా తన జీవితాన్ని కొనసాగిస్తారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పట్టా పొందారు.

గంగిరెడ్డి, సుగుణ రెడ్డి దంపతులకు జన్మించిన భారతీ జగన్ మోహన్ రెడ్డి ని 1996వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి జగన్ కి ప్రతి విషయంలో కొండంత సహాయం చేస్తున్నారు. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన భారతి కుటుంబ వ్యవహారాలను, వ్యాపార వ్యవహారాలను చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. అప్పట్లో తన మామయ్య చనిపోగా… భర్త జైలుపాలు కాగా తానే అన్ని అయ్యి భర్తకు పిల్లలకు కుటుంబసభ్యులకు అండగా ఉంటూ ముందుకు సాగారు. భారతికి దయాగుణం చాలా ఎక్కువ. ఆమె తమ కింది స్థాయి ఉద్యోగులకు ఎప్పుడూ గౌరవం ఇస్తూ సొంత కుటుంబంలా చూసుకుంటారు. భారతి, బ్రాహ్మణి లకు గల తేడా ఏంటంటే… ఒకరు సామాన్య కుటుంబం నుండి వస్తే మరొకరు సినీ రంగం నుండి సీఎం కుటుంబాల్లో కి కోడళ్లుగా వచ్చారు.

జగన్ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదంటున్న కమెడియన్ పృథ్వీ రాజ్ !

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా ఉన్నాడు. అతని కెరీర్ గ్రాఫ్ కూడా ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉంది. వరస విజయాలతో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళితో పాటు టాప్ దర్శకులందరూ తారక్ కాల్షీట్లు కోసం పడిగాపులు కాస్తున్నారు.

ఇలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో మళ్లీ రూమర్స్ వినిపిస్తున్నాయి. తారక్ మళ్లీ పాలిటిక్స్‌లోకి వస్తేనే బాగుంటుందని చాలా మంది టీడీపీ నాయకులు కూడా తమ అభిప్రాయాలను తెలియ జేస్తున్నారు. తారక్ పాలిటిక్స్ లోకి వస్తేనే కానీ తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రావంటూ కొందరు సీనియర్ నేతలు జోస్యం చెబుతున్నారు. కానీ లోకేష్, బాలయ్య లాంటి వాళ్లు మాత్రం తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని తెలపడం కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. ఇదిలా వుండగా తాజాగా సీనియర్ కమెడియన్ పృథ్వీరాజ్ సంచలనమైన కామెంట్స్ చేసాడు.

ఈ టైంలో తారక్ అవసరం ఏమీలేదని తేల్చి చెప్పేశాడు పృథ్వీ. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బాగానే పరి పాలిస్తున్నారని, ఇలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాడు ఫృధ్వీ. తారక్ ప్రస్తుతం రాజకీయాల కన్నా సినిమా రంగానికే ఎక్కువ అవసరమని.. ఆయన అక్కడుండటమే మంచిదని, తారక్ సినీ భవిష్యత్తు ప్రస్తుతం అద్భుతంగా ఉందని.. రాజకీయాల్లోకి ఆయన ఇప్పుడప్పడే రానవసరం లేదని, 55 ఏళ్లు దాటిన తర్వాత తారక్ సరికొత్త ఎజెండాతో రాజకీయ ప్రవేశిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయ పడ్డాడు కమెడియన్ ఫృధ్వీ రాజ్. ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలై రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

“సచివాలయం వాస్తు బాగోకే ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట..” – నటి మాధవీలత !!

బీజేపీ యువ నాయకురాలు, ప్రముఖ సినీ నటి మాధవీలత KCR పై సంచలన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. సచివాలయం కూల్చివేతకు KCR అనారోగ్యానికి లింక్ పెడుతూ ఈసారి మాధవీ లత తన ఫేస్ బుక్‌లో ఓ షాకింగ్ పోస్ట్ ను వీడియో రూపంలో షేర్ చేసింది. ఉస్మానియా హాస్పిటల్ లో వర్షం నీరు రావడంతో అక్కడ రోగులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లుగా ఈ వీడియోలో చూసిన చాలా మంది..

“KCR గారూ!! ఈ దుస్థితి చూసిన తర్వాతైనా తెలంగాణ ప్రజలకు అత్యవసరంగా కావాల్సింది సచివాలయమా? లేక వైద్యాలయమా? ఒకప్రక్క జనం పిట్టల్లా రాలి పోతుంటే.. మరోవైపు పాలకులేమో వాటి మీద దృష్టి పెట్టకుండా ఆధునిక నిర్మాణాలపైనా దృష్టి సారిస్తారా? అంటూ తీవ్రంగా మండి పడుతున్నారు. కోర్టు స్టే వరకూ వెళ్లిన ఈ అంశంపై “నిజాం కాలం నాటి గుప్త నిధుల కోసమే సచివాలయాన్ని కూల్చి వేస్తున్నారంటూ గతంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నిజాం నవాబులు ఆరోజుల్లో తమ గుప్త నిధులను 5 రహస్య స్థావరాల్లో దాచి వుంచారని వాటిలో మింట్ కాంపౌండ్, హోం సైన్స్ కాలేజీ, సెక్రటరేట్ జీ బ్లాక్ ఉన్నాయని.. జీ బ్లాక్ కింద గుప్త నిధులు ఉన్నట్లు దాదాపు అన్ని ఆంగ్ల పత్రికలు రాసుకొచ్చాయంటూ.. ఇప్పుడు ఆ గుప్త నిధుల కోసమే KCR పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్. దాంతో సచివాలయం కూల్చివేత అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. హైకోర్ట్‌లో స్టేల వరకూ వెళ్లింది. “ఒక ప్రక్క తెలంగాణ ప్రజలంతా కరోనా మహమ్మారి దెబ్బకి విలవిల్లాడిపోతుంటే.. ఇంత అర్జంట్ గా సచివాలయాన్ని కూల్చేసి..

కొత్తది కట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది..? అని నిలదీయగా దీనికి అధికార పార్టీ నేతలు చెప్పే సమాధానం ఏమిటంటే.. పాత సచివాలయం వాస్తు బాలేదు కాబట్టి కొత్తది కట్టాలి అని.. సరే వాళ్ళు చెప్పింది బాగుంది. అలానే అనుకుందాం.. మరి గడిచిన 7సంవత్సరాలూ KCR పాలించింది ఆ సచివాలయం నుంచే కదా.. అప్పుడేమైంది ఈ వాస్తు సమస్య.? అప్పుడు రాని సమస్య ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటి.? ఎందుకంటే పీఠం మార్చే ఉద్దేశం ఉంది కాబట్టి, తన కుమారుడు KTR జాతకానికి పాత సచివాలయం అంత అనువైనది కాదు కాబట్టి. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. అందులో చాలా మంది ఈ సచివాలయం నుంచే పాలించారు. కానీ, ఏ ముఖ్యమంత్రి కొడుకూ ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు. Y.s జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన రాష్ట్రం వేరు. ఇప్పుడు ఇదే మూఢ నమ్మకంతో CM KCR సచివాలయాన్ని కూల్చేందుకు సిద్దమైనట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతాంశానికొస్తే.. ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ని వీడియో రూపంలో షేర్ చేసిన నటి మాధవీలత సచివాలయం అంశంపై స్పందిస్తూ..

“సెక్రెటరేట్ వాస్తు ప్రభావం వల్ల.. ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట.. అందుకే కొత్త బిల్డింగ్ ప్లాన్. మరి పేషెంట్స్ ఉండే హాస్పటల్స్ ఇలా ఉండొచ్చా.? అలాగైతే ఈ వాస్తులో నీటి దోషం ఉంది.. అయినా పర్లేదా.?” అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ చదివిన చాలామంది నెటిజన్లు ‘నీలాంటి మూర్ఖులు పెట్టే అవివేకపు పోస్టింగ్స్‌తో బీజేపీకి మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువ.. ఒకళ్ళను అనే ముందు మీ బీజేపీ పార్టీ దేశాన్ని ఎలా పాలిస్తున్నారో తెలుసుకో.. ఏది పడితే అది మాట్లాడే ముందు కేసీఆర్ ఏం చేస్తానన్నారో తెలుసుకో.. కేసీఆర్ ఉస్మానియా హాస్పటల్‌ ప్లేస్‌లో కొత్త బిల్డింగ్ కడతా అన్నారు. కాని మీ పార్టీవాళ్లు కోర్టుకి వెళ్లి అడ్డుకున్నారు అది కూడా తెలియకుండా నువ్ కామెంట్స్ చేస్తున్నావ్.. మీ కళ్ళు బైర్లు కమ్మేలా మీ లీడర్లు ఉస్మానియా మీద చేసిన దొంగ రాజకీయాలను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాము. దమ్ముంటే వాటిని నీ ఫేస్ బుక్ లో షేర్ చేయ్’ అంటూ నటి మాధవీ లతపై ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు TRS కార్యకర్తలు.

కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్..! 5 కోట్ల సాయం అందజేత !!

ఇటీవలే చైనా సేనలతో వీరోచితంగా పోరాడి నేలకొరిగిన కల్నల్ సంతోష్ కుమార్‌ కుటుంబాన్ని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ సూర్యాపేట లోని సంతోష్ బాబు ఇంటికి వెళ్లిన కేసీఆర్ రూ.5 కోట్ల సాయాన్ని చెక్కు రూపంలో కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంలో సంతోష్ బాబు తల్లిదండ్రులకు ఒక కోటి రూపాయాలు, ఆయన భార్యకు 4 కోట్లు రూపాయిల చెక్ అందజేశారు. అదే సమయంలో సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా సీఎం అందించారు. అంతేకాకుండా హైదరాబాద్ లో ఒక ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తూ పట్టా అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి జగదీవ్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంతోష్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించిన తరువాత సీఎం మీడియాతో మాట్లాడుతూ… ‘సంతోష్ బాబు దేశ రక్షణ కోసం తన ప్రాణాలు ధారపోశారు. ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది…’ అని అన్నారు. కాగా, చైనాతో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబుతో పాటు మరణించిన 19 మంది జవాన్ల కుటుంబ సభ్యులకు కూడా రూ.10 లక్షల చొప్పున సాయాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ద్వారా అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.