Category Archives: Political News

AP: అదే చంద్రబాబు సక్సెస్… జగన్ ఓటమిపై సజ్జల సంచలన వ్యాఖ్యలు!

AP: దివంగత మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో అట్టహాసంగా జరిగాయి. ఈ క్రమంలోనే విజయవాడ పార్టీ కార్యాలయం ఎదుట వైయస్సార్సీపీ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంబంటి రాంబాబు వంటి వారందరూ కేక్ కట్ చేసి వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ ఓటమి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలలో వైసిపి ఓటమి కావడానికి కారణం చంద్రబాబు అబద్ధాలేనని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా కుల మతాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించారు.

ఇకపోతే చంద్రబాబు నాయుడు ఎలాగైనా అందలం ఎక్కాలన్న ఉద్దేశంతో తప్పుడు హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేశారని ఇలా ఈయన మోసం చేయడంలో బాగా సక్సెస్ అయ్యారని అదే ఆయన విజయానికి కారణం అంటూ సజ్జల తెలిపారు. ఇప్పుడు కూటమి ఇచ్చిన హామీలలో 10 శాతం నెరవేర్చిన చాలని సజ్జల వెల్లడించారు.

బాబు ప్రజలను మోసం చేశారు..
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీద్దామని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా వైయస్ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇలా సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెడుతూ వారిని మోసం చేస్తూ చంద్రబాబు సక్సెస్ అయ్యారు కానీ జగన్ పద్ధతి అలా కాదు అలవికాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడం జగన్ కి ఇష్టం లేదంటూ సజ్జల చేసి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

YS Sharmila: 2029లో ఏపీ సీఎం షర్మిల అవుతుంది.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు విజయవాడలో ఎంతో ఘనంగా జరిగాయి. వయసు షర్మిల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు బట్టి విక్రమార్క వంటి వారందరూ కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించిన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు ఆరోగ్యశ్రీ 10820 మహాతరమైన కార్యక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన మహానేత రాజశేఖర్ రెడ్డి అంటూ ఆయన సేవలను కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి గారు భౌతికంగా దూరమైన ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువై ఉన్నారని తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.2029లో షర్మిల ఏపీ సీఎం అవుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని తెలిపారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

వ్యాపారం చేసేవాళ్లు వైయస్ వారసులు కాదు..

ఈ ముగ్గురు మోదీ పక్షమే అని, ప్రజల పక్షాన పోరాడబోయేది షర్మిల మాత్రమే అని అన్నారు. కడపలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని వార్తలొస్తున్నాయి, కడపలో ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు రేవంత్ రెడ్డి. వైఎస్‌ పేరుతో వ్యాపారం చేసేవాళ్లు వారసులు కాదు,
ప్రజల కోసం పోరాడేవాళ్లే వైఎస్‌ వారసులని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

RK Roja: వైయస్సార్ జయంతి… ఆసక్తికర ట్వీట్ చేసిన ఆర్కే రోజా?

RK Roja: ఆర్కే రోజా పరిచయం అవసరం లేని పేరు సినీ నటిగా రాజకీయ నాయకురాలుగా ఎంతో సపరిచితం. వైఎస్ఆర్సిపి పార్టీలో మాజీ మంత్రిగా వ్యవహరించినటువంటి ఈమె ఇటీవల ఎన్నికలలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. అయితే ఇలా ఓటమి పాలైన ఈమె బీజేపీలోకి వెళ్తారని అందరూ భావించినప్పటికీ ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు..

ఇకపోతే తాజాగా నేడు వైయస్సార్ 75వ జయంతి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది వైయస్సార్ ను గుర్తు చేసుకుంటూ చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ అభిమానులు కార్యకర్తలు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా సైతం ట్విట్టర్ వేదికగా వైయస్సార్ జయంతి వేడుకలను పురస్కరించుకొని చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా రోజా ట్విట్టర్ వేదికగా వైయస్సార్ గురించి తెలియజేస్తూ.. రోడ్డు ప్రమాదాలలో మరణాలను వీలైనంత తక్కువ చేయడానికి 108 అంబులెన్స్‌లను తీసుకువచ్చారనీ రోజా తెలిపారు.ఈ 108 అంబులెన్స్ ఆవిష్కరణ రాష్ట్ర వైద్య చరిత్రలోనే ఓ సంచలనంగా నిలిచిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ గుండెల్లో ఉన్నారు…
ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఎంతోమందికి పునర్జన్మ ప్రసాధించిన దేవుడు వైయస్ఆర్ గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. వైయస్సార్ గారు చేసిన ఎన్నో మంచి పనులను మనం మర్చిపోకూడదని తెలిపారు.. వైయస్సార్ మన మధ్య లేకపోయినా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయులై ఉంటారంటూ ఈ సందర్భంగా రోజా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

AP politics: తండ్రి జయంతి.. అన్నకు బిగ్ షాక్ ఇచ్చిన షర్మిల… ఇక జగన్ కి కష్టమేనా?

AP politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగా ఉంటాయి. ఇకపోతే నేడు దివంగత నేత వైయస్సార్ 75 వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇడుపులపాయలో ఇప్పటికి ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి వైయస్సార్ ని గుర్తు చేసుకున్నారు.

వైయస్సార్ ఘాట్ వద్ద షర్మిల జగన్ ఇద్దరు కూడా ఒకేసారి అక్కడికి చేరుకునేలా షెడ్యూల్ ప్లాన్ చేసిన షర్మిల నో చెప్పారని తెలుస్తుంది. ముందుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లి తన తండ్రికి నివాళులర్పించారు. ఇక వైయస్ విజయమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇలా జగన్మోహన్ రెడ్డి తండ్రికి నివాళులు అర్పించి వెళ్లిన అనంతరం వైఎస్ షర్మిల తన కుటుంబ సభ్యులతో పాటు తండ్రి సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఇక ఈమెతో పాటు తల్లి విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఇలా తన తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం వైయస్ షర్మిల విజయవాడకు వెళ్లిపోయారు.

విజయవాడలో వైయస్సార్ జయంతి వేడుకలు..
విజయవాడలో నేడు కాంగ్రెస్ పార్టీ నేతలతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించబోతున్నారు అంతేకాకుండా ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా బలహీన పడటంతో ఆ పార్టీలో ఉన్న నాయకులను కాంగ్రెస్ లోకి తీసుకురావడం కోసం షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే కనుక సక్సెస్ అయితే తిరిగి ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడమే కాకుండా జగన్ వైసీపీ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని తెలుస్తోంది.

YS Jagan Mohan Reddy: నాన్న మీ మార్గం శిరోధార్యం… ఎమోషనల్ ట్వీట్ చేసిన వైయస్ జగన్!

YS Jagan Mohan Reddy: మహానేత దివంగత నాయకుడు శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయంతి వేడుకలు నేడు ఎంత ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు నాయకులు రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.

ఇక వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకొని ఇడుపులపాయలో ఉన్నటువంటి తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించారు. ఇక జగన్ ఇడుపులపాయకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమని భారతి కూడా ఈ జయంతి వేడుకలలో పాల్గొన్నారు.

ఇకపోతే వైయస్ విజయమ్మ కూడా వైయస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని చూసే ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కనిపించారు. ఇలా తల్లితో కలిసి వైఎస్ జగన్ దంపతులు తన తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తన తండ్రి గురించి ఎమోషనల్ ట్వీట్ చేశారు.

వైయస్సార్ జయంతి వేడుకలు..
నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరివరకూ మా కృషి అంటూ వైఎస్‌ జగన్‌ చేసిన ట్వీట్‌ వైరల్ అవుతుంది.

Chandra Babu: టీడీపీ విజయంలో తెలంగాణ శ్రేణుల కృషి ఎంతో ఉంది: చంద్రబాబు

Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎం అయిన తర్వాత హైదరాబాద్ కి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీలో రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు రావాల్సిన అంశాల గురించి కీలక అంశాల గురించి ప్రస్తావించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది.

ఇలా చంద్రబాబునాయుడు హైదరాబాద్ కి రావడంతో పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు భారీ స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి భాగ్యనగరం మొత్తం పసుపు మయం చేశారు. ఇకపోతే హైదరాబాదులోనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తాజాగా ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ పార్టీ నాయకులతో కీలక నేతలతో మాట్లాడి పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళతో సమానం అని తెలిపారు. తన విజయానికి టిడిపి శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం వస్తుందని ఈయన తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోయినా ఎంతో మంది నాయకులు వేరొక పార్టీలోకి వెళ్లారు కాని కార్యకర్తలు మాత్రం వెళ్లలేదని తెలిపారు.

టీడీపీకి పూర్వ వైభవం..
ఇకపోతే నాలెడ్జ్ ఎకానమీగా హైదరాబాదును తీర్చిదిద్దిన ఘనత టీడీపీదని తెలిపారు. మా పార్టీ తర్వాత వచ్చిన ఇతర పార్టీలు దానిని కొనసాగించాయి తప్ప చెడగొట్టలేదని ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని అభినందించాలని తెలిపారు .పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎంగా ఆ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నారంటూ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

YS Jagan: షాకింగ్ న్యూస్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్న వైయస్ జగన్?

YS Jagan: వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు.

2019 ఎన్నికలలో ఈయన ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికలలో కూడా అదే స్థాయిలో తమ విజయం ఉంటుందని భావించిన వైఎస్ జగన్ కు చేదు అనుభవం ఎదురయింది. ఈసారి ఈయన కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. ఇలా 11 స్థానాలు రావడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందని చెప్పాలి.

ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ స్పీకర్ కి లేఖ కూడా రాశారు. ఇక ఈ విషయంపై స్పీకర్ నుంచి ఏ విధమైనటువంటి సమాధానం రాలేదు అయితే ఇటీవల తండ్రి జయంతి ఉత్సవాల కోసం తాడేపల్లి నుంచి వైయస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. ఇలా పులివెందులకు వెళ్లినటువంటి ఈయన తన తండ్రి జయంతి వేడుకల సందర్భంగా షాకింగ్ న్యూస్ తెలియజేయబోతున్నారని సమాచారం.

పార్లమెంటుకు వైయస్ జగన్..
కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి తో రాజీనామా చేయించడమే కాకుండా ఈయన కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికలను నిర్వహించి జగన్ ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే జగన్ ఉన్న ఫలంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి ఈయన ఎందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టాలనుకుంటున్నారు అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Pitapuram: స్కూటీకి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా బోర్డ్… ఊహించని షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు!

Pitapuram: సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది అఖండమైన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా స్కూటీ లేదంటే కార్లకు వారి నెంబర్ ప్లేట్ తీసేసి మరి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బోర్డులు వేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇటీవల ఈ బోర్డులు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. ఇలా ఎక్కడ చూసినా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బోర్డులు కనిపించడంతో ఈ బోర్డులపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అలాంటి బోర్డులు వేసుకొని ట్రాఫిక్ పోలీసులకు దొరికి నా పరువు తీయకండి జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు.

ఇలా పవన్ కళ్యాణ్ ఈ బోర్డుల గురించి చెప్పారో లేదో ఓ స్కూటీలో ఇద్దరు యువకులు వెళ్తూ వారి స్కూటీకి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బోర్డు పెట్టుకున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఆ స్కూటీని ఆపి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఇలా స్కూటీని ఆపిన పోలీసులు చూడకుండా మీ స్కూటీ నెంబర్ చెప్పండి అని ప్రశ్నించారు దాంతో ఆ యువకులు చెప్పలేకపోయారు.

అభిమానం ఉంటే ఎక్కడైనా పెట్టుకోండి..

ఈ క్రమంలోనే పోలీసుల స్వయంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఉన్న బోర్డు తొలగించే నెంబర్ ప్లేట్ ఉన్న బోర్డు వేశారు మీకు అభిమానం ఉంటే ఎక్కడైనా పెట్టుకోండి కానీ ఇలా వాహనాలకు పెట్టుకోవడం వల్ల అవి చోరీ అయితే గుర్తించడం కష్టమని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Pawan Kalyan: వారాహి దీక్షలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసిన పవన్.. ఫోటోలు వైరల్!

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత 11 రోజులపాటు వారాహి అమ్మవారి దీక్ష వేశారు. గత నెల 25వ తేదీ ఈ దీక్ష వేశారు. అయితే ఈ దీక్షలో భాగంగా ఇటీవల సూర్య భగవానుడికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోనే జనసేన పార్టీ కార్యాలయంలో ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సూర్యరాదనలో భాగంగా ఆదిత్య యంత్రం ఏర్పాటు చేసి దీని ఎదుటు ఆశీనులైన జనసేన అధినేత ప్రత్యక్ష భగవానుడిని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజించారు.

ఇలా సూర్యభగవానుడిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఈయన సమాజ శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారని తెలుస్తుంది. పూజా కార్యక్రమాలలో భాగంగా ఈ పూజ విశిష్టత గురించి పండితులు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాష్ట్ర సంక్షేమం కోసం..
ఇక పవన్ కళ్యాణ్ గతంలో ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ సూర్య భగవానుడిని ఆరాధించే వారట. అయితే ప్రస్తుతం దీక్షలో ఉన్నటువంటి ఈయన సూర్య నమస్కారానికి బదులుగా సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్ర సహిత ఆదిత్య ఆరాధనను వారాహీ దీక్షలో భాగంగా అత్యంత ఘనంగా నిర్వర్తించారు.

YS Jagan: నెల్లూరు జైలుకు వైయస్ జగన్.. ఆ వైసీపీ నేతతో మూలఖత్?

YS Jagan: వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జులై 4వ తేదీ నెల్లూరు జైలుకు వెళ్లబోతున్నారు. నెల్లూరు జైలులో రిమాండ్ లో ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈయన పరామర్శించడానికి వెళ్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే పిల్లలతో ఇప్పటికే కొంతమంది వైసీపీ కీలక నేతలు మూలాఖత్ అయ్యారు. అయితే తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో విజయం తమదేనని చాలా ధీమా వ్యక్తం చేశారు కానీ ఫలితాలు ఊహించిన విధంగా రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ విషయం నుంచి ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారని తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను తిరిగి పరామర్శించడానికి అలాగే ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని కేడర్ కి సూచించడమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉండాలని కూడా తెలిపారు.

పిన్నెల్లితో మూలాఖత్…

ఇక త్వరలోనే తాను ప్రజలలోకి రాబోతున్నానని జగన్ వెల్లడించారు. ఈ తరుణంలోనే ముందుగా అరెస్టయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈయన పరామర్శించబోతున్నారు. ఇన్ని రోజులపాటు బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లికి చేరుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక తాడేపల్లి నుంచి నేరుగా నెల్లూరుకు హెలికాప్టర్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన జైలుకు వెళ్లబోతున్నారు.