Chinmayi Sripada : ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద అటు తమిళ ఇటు తెలుగు వారికి సుపరిచితురాలు. తన పాటలు, మాటలు ఎంత ఫేమస్సో, తన సోషల్ మీడియా ద్వారా కూడా అంతే ఫేమస్. మీ టూ అంటూ సోషల్ మీడియా ద్వారా సాటి మహిళల కష్టాలను తెలుసుకుంటూ వాటికి స్పందిస్తూ, అందరితో పంచుకుంటూ ఉంటారు. ఇక క్యాస్టింగ్ కౌచ్, ఫెమినిజం వంటి వాటి పై తరచూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ చాలామంది విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంది. ఈ మధ్యనే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ కూడా అయింది. అలా నిత్యం ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో ఉండే చిన్మయి ఇపుడు ఒక శుభవార్తతో అందరిని సర్ ప్రైజ్ చేసింది.
కవల పిల్లలకు జన్మనిచ్చిన శ్రీపాద…
అందాల రాక్షసి సినిమా ఫేమ్ రాహుల్ రవీంద్రన్ ను పెళ్లి చేసుకున్న చిన్మయి శ్రీపాద తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈవిషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కి జన్మనిచ్చానని చెప్పింది. అయితే ఇన్నిరోజులు తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటికి రాకపోవడంతో చాలా మంది సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నారా అని అడుగుతున్నారు.
దీనికి స్పందించి చిన్మయి తన ప్రెగ్నెన్సీ గురించి తన కుటుంబానికి, అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసనీ, వ్యక్తిగత విషయాలను ఎక్కువగా చెప్పాలని అనుకోను, నన్ను నేను జాగ్రత్త పరుచుకున్నానని చెప్పారు. తన పిల్లల ఫోటోలను కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంచానని చెప్పారు. ఇక పరోక్షంగా తనకు సి సెక్షన్ అయినట్లు వివరించారు. సర్జరీ సమయంలో తాను తన బిడ్డలు భూమి పైకి వచ్చేటప్పుడు భజన చేసానని చెప్పారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…