సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన, కొనసాగుతున్న ప్రముఖ, దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు తమ జీవిత భాగస్వాములను సినీ ఇండస్ట్రీలోనే దొరకపుచ్చుకున్నారు.

వీళ్ళు వివాహం చేసుకోవడంతో భారతీయ సినీ పరిశ్రమ లో చాలామంది ప్రముఖ నటులు మామ అల్లుళ్ళు అయ్యారు. ఈ విధంగా మామా అల్లుళ్లు అయిన వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

అల్లు రామలింగయ్య కూతురు అయిన సురేఖ ని వివాహం చేసుకొని అతనికి అల్లుడు అయ్యాడు చిరంజీవి. వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు.

2004 నవంబర్ 18వ తేదీన రజనీకాంత్ పెద్ద కూతురు అయిన ఐశ్వర్యాని ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. దంపతులిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. దీంతో తమిళ స్టార్ హీరో అయిన రజనీకాంత్ ధనుష్ మామ అల్లుళ్లు అయ్యారు.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన కళ్యాణ్ దేవ్ ని 2016 మార్చి 28 వ తేదీన పెళ్లి చేసుకుంది. దీంతో కళ్యాణ్ దేవ్ చిరంజీవి మామా అల్లుళ్లు అయ్యారు. కళ్యాణ్ కూడా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.

ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూతురు ప్రియాంక.. నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా డైరెక్టర్ నాగ అశ్విన్ ని ప్రేమించి 2015వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. దీంతో అశ్వినీదత్, నాగ అశ్విన్ మామ అల్లుళ్ళయ్యారు.

ప్రముఖ తమిళ, మలయాళం హీరో, నిర్మాత అయిన సీఎల్ ఆనందన్ కుమార్తె డిస్కో శాంతి తొమ్మిది వందల సినిమాల్లో ఐటమ్ సాంగ్ ల లో నాట్యం చేసి భారతదేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అయితే ఈ డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో సీఎల్ ఆనందన్ శ్రీహరి మామ అల్లుళ్ళయ్యారు.

1988వ సంవత్సరంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రముఖ నిర్మాత అయిన కే. బాలాజీ కుమార్తె సుచిత్ర ని పెళ్లి చేసుకున్నాడు. సుచిత్ర కూడా తన తండ్రి లాగానే భారతీయ సినిమా నిర్మాత. ఈమె వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటుంది.

రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ కి తల్లిగా నటించిన శరణ్య భారతీయ నటుడైనా పోంవన్నన్ ని పెళ్లి చేసుకుంది. శరణ్య మలయాళ సినిమా దర్శకుడైన ఏ.భాస్కర్ రాజు కుమార్తె కాగా… పోంవన్నన్ భాస్కర్ రాజు మామ అల్లుళ్లు అయ్యారు.

సీఎల్ ఆనందన్ పెద్ద కుమార్తె అయిన లలిత కుమారి ని ప్రకాష్ రాజు 1994వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని 2009వ సంవత్సరంలో విడాకులు ఇచ్చాడు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో సీఎల్ ఆనందన్ కి శ్రీ హరి తో (భార్య రెండవ కుమార్తె డిస్కోశాంతి) పాటు ప్రకాష్ రాజ్ కూడా అల్లుడు అయ్యాడు.

సీనియర్ హీరోయిన్ నిరోషా రాధా రాంకీ కి పిలవబడే రామకృష్ణన్ ని 1995వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. నిరోషా రాధా ప్రముఖ నటుడు రాజకీయవేత్త అయిన మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ కుమార్తె కాగా… అతడికి రాంకీ అల్లుడు అయ్యాడు. మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ కి సీనియర్ నటీమణి రాధిక కూడా కూతురే. అయితే రాధిక శరత్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. దీంతో శరత్ కుమార్ కూడా మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ అల్లుడు అయ్యాడు.

2001వ సంవత్సరంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నా ని పెళ్లి చేసుకున్నాడు. ట్వింకిల్ ఖన్నా రాజేష్ కన్నా కుమార్తె కాగా… అతడికి అక్షయ్ కుమార్ అల్లుడు అయ్యాడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here